Business Ideas: తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించాలా? రిస్క్ అస్సలు ఉండకూడదా? అయితే ఇవిగో బెస్ట్ ఆప్షన్స్..

మీ ఆలోచనలే మీరు పెట్టే అధిక పెట్టుబడి కావాలని ప్రయత్నిస్తున్నారా? అయితే ఈ కథనం మీ కోసమే.. తక్కువ సమయంలో క్లిక్ అయ్యేందుకు అవకాశం ఉన్న బెస్ట్ బిజినెస్ ఐడియాలు.

Business Ideas: తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించాలా? రిస్క్ అస్సలు ఉండకూడదా? అయితే ఇవిగో బెస్ట్ ఆప్షన్స్..
Business Idea
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Anil kumar poka

Updated on: Dec 16, 2022 | 3:36 PM

అతి తక్కువ సమయంలో .. వీలైనంత తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు సంపాదించాలని ఆశిస్తున్నారా? మీ ఆలోచనలే మీరు పెట్టే అధిక పెట్టుబడి కావాలని ప్రయత్నిస్తున్నారా? అయితే ఈ కథనం మీ కోసమే.. తక్కువ సమయంలో క్లిక్ అయ్యేందుకు అవకాశం ఉన్న బెస్ట్ బిజినెస్ ఐడియాలు. ఇంకెందుకు ఆలస్యం చదివేయండి..

బ్లాగింగ్..

ఆన్‌లైన్ పత్రికలు, బ్లాగులు దశాబ్దాలుగా ఉన్నాయి. ఫేస్ బుక్, ట్విటర్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు రాకముందు నుంచే ఈ బ్లాగింగ్ అనేది అత్యంత లాభదాయకమైన వ్యాపారంగా ఉంటోంది. కేవలం హోస్టింగ్ రుసుము, వెబ్‌సైట్-నిర్మాణ సేవతో, కథనాలను రాస్తూ సెర్చ్ ఇంజిన్ ద్వారా ఆకట్టుకోవడం ద్వారా అధిక రాబడులు రాబట్టవచ్చు. అలాగే దీనికి పోటీ కూడా తక్కువగానే ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం ఏవైనా రాయగలిగే ఆసక్తి, నేర్పు ఉంటే వెంటనే బ్లాగింగ్ ను ప్రారంభించండి.

ఆన్ లైన్ కోర్సు క్రియేటర్..

మీరు నిజంగా అత్యంత తక్కువ సమయంలో అత్యధిక లాభాలు తెచ్చి పెట్టే వ్యాపారం కోసం ఆలోచిస్తూ ఉంటే దీనిని మించిన ఆప్షన్ మీకు మరొకటి ఉండదు. ప్రస్తుత ఆధునిక వాతావరణంలో అందరూ ఆన్లైన్ కోర్సులు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. మంచి స్టార్టప్ లా ఆన్ లైన్ కోర్సులను అందించే ప్లాట్ ఫామ్ క్రియేట్ చేసుకుని, అతి తక్కువ నిర్వహణ ఖర్చుతో లాభాలు గడించవచ్చు. మంచి ట్యూటర్స్ తో పాటు ఎప్పటికప్పుడు వినియోగదారులు ఇచ్చే ఫీడ్ బ్యాక్ ను బట్టి మార్పులు, చేర్పులు చేసుకుంటూ ఉంటే చాలు.

ఇవి కూడా చదవండి

గ్రాఫిక్ డిజైనింగ్..

గ్రాఫిక్ డిజైనింగ్ అనేది చాలా మంచి ఐడియా. కొన్ని గంటల్లోనే మీరు అనుకున్న మొత్తాన్ని సంపాదించవచ్చు. ఒక కంప్యూటర్, అవసరమైన సాఫ్ట్ వేర్స్, టూల్స్, నైపుణ్యం ఉంటే చాలు.. ఉన్న చోటు నుంచే లక్షలు ఆర్జించవచ్చు. దీనికి చదువుతో కూడా సంబంధం ఉండదు.

బిజినెస్ కన్సల్టింగ్..

ఏదైనా ఒక వ్యాపారం సక్రమంగా నడవాలి అంటే ప్లానింగ్ చాలా అవసరం. ఎక్కడికక్కడ ఖర్చును అదుపు చేసుకుంటూ ముందు సాగుతూ ఉండాలి. సరిగ్గా దీనినే మీరు ఓ వ్యాపార వనరుగా మార్చుకోవచ్చు. ఓ కంపెనీలను కార్యకలాపాలను క్రమపర్చడం, అవసరమైన సలహాలు, సూచనలు ఇవ్వడం, మానవ వనరులను సక్రమంగా వినియోగించుకోవడం.. ఖర్చులు తగ్గించడం వంటి అంశాలను బిజినెస్ కన్సల్టింగ్ గా ఉండి చేయవచ్చు. అలాగే వ్యాపారాన్ని విస్తరించే క్రమంలో, కొత్త మార్కెట్లోకి వెళ్లే క్రమంలోనూ కంపెనీలు బిజినెస్ కన్సల్టింగ్స్ వైపు చూస్తాయి. దీని ఎటువంటి శిక్షణ సంస్థలూ ఉండవు. మీరు చేస్తున్న చోటే పనిలో నైపుణ్యాన్ని సాధించి, బయట ఇటువంటివి చేసుకోవాల్సి ఉంటుంది.

కాపీ రైటర్..

ఫ్రీలాన్సింగ్ కాపీ రైటర్లు తమ ప్రతి సమయాన్ని ఆదాయ వనరుగా మార్చుకుంటారు. వారు ఉన్న ప్రాంతం నుంచే క్లయింట్ లను ఎన్నుకుంటారు. ప్రపంచంలో ఎక్కడి నుంచైనా ఎక్కడి వారికైనా ఫ్రీలాన్సింగ్ ద్వారా పని చేసి సంపాదించవచ్చు. వెబ్ సైట్ పేజీలు, ఈ మెయిల్ మార్కెటింగ్, ప్రకటనల కాపీ వంటివి చేయాల్సి ఉంటుంది.

సోషల్ మీడియా మేనేజ్మెంట్..

ప్రస్తుత రోజుల్లో విపరీతంగా పాపులర్ అయిన బిజినెస్ సోషల్ మీడియా మేనేజ్మెంట్. చాలా కంపెనీలు, వ్యాపార వేత్తలు, రాజకీయ ప్రముఖులు తమ సోషల్ మీడియాలో తమ పేజీలను నిర్వహించేందుకు ప్రత్యేక టీం లను ఏర్పాటు చేసుకుంటున్నాయి. అటువంటి వారికి మీరు ఓ ఆప్షన్ గా కాగలరు. దీనికి కావాల్సిందల్లా ఫేస్బుక్, ట్విటర్ వంటి సోషల్ మీడియాపై అవగాహన మాత్రమే.

ఇలాంటి మరిన్ని వార్తల కోసం..