Auto sales: ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్న కార్ల అమ్మకాలు.. ఒక్క నవంబర్‌లోనే ఎన్ని అమ్మకాలు జరిగాయో తెలిస్తే..
దేశంలో కార్ల అమ్మకాలు భారీగా పెరిగాయి. సాధారణంగా కార్ల అమ్మకాలు దసరా, దీపావళి లాంటి పండుగ సీజన్లలోనే ఎక్కువగా ఉంటాయి. పండుగ సీజన్ ముగిసిన తర్వాత జోరు తగ్గుతుంది. అయితే ఈ ఏడాది మాత్రం పండుగ సీజన్ ముగిసినా, జనాల్లో ఫెస్టివ్ మూడ్ తగ్గలేదు. కార్ల అమ్మకాల్లో ఏమాత్రం..
దేశంలో కార్ల అమ్మకాలు భారీగా పెరిగాయి. సాధారణంగా కార్ల అమ్మకాలు దసరా, దీపావళి లాంటి పండుగ సీజన్లలోనే ఎక్కువగా ఉంటాయి. పండుగ సీజన్ ముగిసిన తర్వాత జోరు తగ్గుతుంది. అయితే ఈ ఏడాది మాత్రం పండుగ సీజన్ ముగిసినా, జనాల్లో ఫెస్టివ్ మూడ్ తగ్గలేదు. కార్ల అమ్మకాల్లో ఏమాత్రం జోష్ తగ్గలేదు. ముఖ్యంగా వ్యక్తిగతంతా ఉపయోగించుకునే కార్లకు హై డిమాండ్ కొనసాగింది. దీంతో, నవంబర్ నెలలో రికార్డ్ సేల్స్ నమోదయ్యాయి. గతంలో, ఏ సంవత్సరంలోనూ నవంబర్ నెలలో ఇంత భారీ అమ్మకాలు కనిపించలేదు. కార్ హోల్‌సేల్స్ నవంబర్ నెలలో 31% పెరిగి 3,22,860 యూనిట్లకు చేరుకున్నాయి. 2020 నవంబర్‌లోని మునుపటి హైయస్ట్ స్కోర్ 2.86 లక్షలను 2022 నవంబర్ బీట్ చేసింది. 2021 నవంబర్‌లో 2,45,636 కార్లు కంపెనీల నుంచి డీలర్లకు సప్లై అయ్యాయి.
ఈ సంవత్సరం జనవరి-నవంబర్ కాలంలో జరిగిన విక్రయాలు 35 లక్షల మైల్‌స్టోన్‌ను క్రాస్ చేశాయి. గతంలో, 2018లో అత్యధికంగా 33.8 లక్షల యూనిట్లు అమ్ముడుపోయాయి. 2021 జనవరి-నవంబర్ మధ్య కాలంలో ఈ సంఖ్య 28 లక్షల యూనిట్లుగా ఉంది. ఈ లెక్క ప్రకారం, గత ఏడాదితో పోలిస్తే, ఈసారి సేల్స్ దాదాపు 25 శాతం పెరిగాయి. ఇక, డిసెంబర్‌లో అంచనా సేల్స్‌ను కూడా కలిపితే, ఈ క్యాలెండర్ ఇయర్‌లో విక్రయాల సంఖ్య 38 లక్షల యూనిట్లకు చేరుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే 2022, మే నెలలో విడుదలైన నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ప్రకారం..దేశంలో 8 శాతం కుటుంబాలకు సొంత కార్లున్నాయి. 20 ఏళ్లలో సొంతకార్లున్న కుటుంబాలు ఐదు రెట్లు పెరిగాయి. దేశంలో అత్యధికం కార్లు కలిగి ఉన్న రాష్ట్రాలలో గోవా మొదటి స్థానంలో ఉండగా..ఈశాన్య రాష్ట్రాలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. గోవాలో ఏకంగా 49 శాతం ప్రజలు సొంత కార్లను కలిగి ఉన్నారు.
తమ హోల్‌సేల్ కార్ సేల్స్ 18% పెరిగి 1,39,306 యూనిట్లకు చేరుకున్నాయని దేశంలోని అతి పెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకీ ఇండియా ప్రకటించింది. ఆల్టో, లాంటి మినీ కార్ల అమ్మకాలు గత ఏడాది ఇదే నెలలోని 17,473 యూనిట్లతో పోలిస్తే, ఈసారి 18,251 యూనిట్లకు అమ్మకాలు పెరిగాయి. బ్రెజ్జా, ఎర్టిగా, గ్రాండ్ విటారా విక్రయాలు గత ఏడాది నవంబర్ నెలలో నమోదైన 24,574 యూనిట్లతో పోలిస్తే, ఈసారి 32,563 యూనిట్లకు పెరిగాయి. ఇక, మారుతి రైవల్ కంపెనీ హ్యుందాయ్ మోటార్ ఇండియా హోల్‌సేల్స్ గత నెలలో 30% పెరిగి 48,003 యూనిట్లకు చేరుకున్నాయి. తమ కంపెనీ చరిత్రలో 2022 సంవత్సరం ది బెస్ట్‌గా నిలుస్తుందని హ్యుందాయ్ భావిస్తోంది. టాటా మోటార్స్ మొత్తం ప్యాసింజర్ వాహనాల సేల్స్ 55% పెరిగి 46,037 యూనిట్లకు చేరుకున్నాయి. మహీంద్ర & మహీంద్ర దేశీయ ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు 56% పెరిగి 30,392 యూనిట్లకు చేరుకున్నాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..