AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ration Card: ఇకపై ఈ వ్యక్తులకు రేషన్ కార్డులు రద్దు.. కొత్త మార్గదర్శకాలు ఇవే.!

మీ దగ్గర రేషన్ కార్డు ఉందా.? దాన్ని ఒక్క సంవత్సరం కంటే ఎక్కువ రోజులు ఉపయోగించలేదా.? అయితే మీరు ఇబ్బందుల్లో పడ్డట్లే.!

Ration Card: ఇకపై ఈ వ్యక్తులకు రేషన్ కార్డులు రద్దు.. కొత్త మార్గదర్శకాలు ఇవే.!
Ration Card
Ravi Kiran
|

Updated on: Dec 16, 2022 | 9:46 AM

Share

మీ దగ్గర రేషన్ కార్డు ఉందా.? దాన్ని ఒక్క సంవత్సరం కంటే ఎక్కువ రోజులు ఉపయోగించలేదా.? అయితే మీరు ఇబ్బందుల్లో పడ్డట్లే.! ఎందుకంటే ఏడాది అంతకంటే ఎక్కువ రోజులు ఉపయోగించని రేషన్ కార్డులను రద్దు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దమవుతోంది. అయితే కంగారు పడకండి.. ప్రస్తుతం ఢిల్లీ సర్కార్ ఈ మేరకు కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. చాలా కాలంగా రేషన్ తీసుకోని వ్యక్తుల రేషన్ కార్డులను రద్దు చేయనుంది. రాష్ట్ర పౌరసరఫల శాఖ.. జిల్లా అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇంటింటికి వెరిఫికేషన్( రేషన్ కార్డు వెరిఫికేషన్) చేసి నివేదికను ప్రభుత్వానికి పంపాలని కోరింది. అనంతరం ఆయా రేషన్ కార్డులను రద్దు చేసేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొంది.

అర్హులైన వారికి రేషన్ ప్రయోజనాలు అందించడంతో పాటు.. ఎవరైతే అర్హులైన వారు ఉన్నారో.. వారిని సైతం ఈ పధకంలోకి చేర్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఢిల్లీ సర్కార్ చెబుతోంది. మరోవైపు రేషన్‌ను సద్వినియోగం చేసుకోని వారు రెండు లక్షల మందికి పైగా ఉన్నట్లు అధికార యంత్రాంగం అంచనా వేస్తోంది. ప్రస్తుతం ఏడాది కాలంగా రేషన్ తీసుకోని లేదా ఒకట్రెండు సార్లు మాత్రమే రేషన్ తీసుకున్న వారి డేటాను ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. అలాంటి వారిని ఆహార సరఫరా శాఖ అధికారులు రేషన్ తీసుకోకపోవడానికి గల కారణాలను అడిగి తెలుసుకోనున్నారు. కారణం సరైనదని తేలితేనే, పేరును జాబితాలో ఉంచుతారు. లేదా రేషన్ కార్డును రద్దు చేయడం ఖాయం. ఇందుకోసం అధికారులు ఇంటింటి వెరిఫికేషన్ ప్రక్రియను ప్రారంభించారు.

17.83 లక్షల మందికి రేషన్ ప్రయోజనాలు..

ఇప్పటిదాకా ఢిల్లీ ప్రభుత్వం 17.83 లక్షల కుటుంబాలకు రేషన్‌కార్డులు జారీ చేసింది. 2021 సెప్టెంబర్‌ నుంచి 2022 అక్టోబర్‌ వరకు రేషన్‌ తీసుకోని వారిపై చర్యలు తీసుకోవాలని ఇటీవలే కమిషన్‌ ఉత్తర్వులు జారీ చేసింది. అందులో భాగంగానే వారి ఇంటికి వెళ్లి అధికారులు రేషన్ కార్డు వెరిఫికేషన్‌ను షూరూ చేశారు.

Follow Us
జడ వేసుకుంటేనే గుడిలోకి ఎంట్రీ.. లేదంటే గేటు బయటే..
జడ వేసుకుంటేనే గుడిలోకి ఎంట్రీ.. లేదంటే గేటు బయటే..
ఈ పిల్లి చిత్రంలో దాగున్న మరో జీవిని 10 సెకన్లలో గుర్తిస్తే..
ఈ పిల్లి చిత్రంలో దాగున్న మరో జీవిని 10 సెకన్లలో గుర్తిస్తే..
ఆన్‌లైన్‌లో తిరుమల శ్రీవారి దర్శన టికెట్లు.. విడుదలకు డేట్ ఫిక్స్
ఆన్‌లైన్‌లో తిరుమల శ్రీవారి దర్శన టికెట్లు.. విడుదలకు డేట్ ఫిక్స్
సద్దుల బతుకమ్మ వేడుకల్లో విజయ్ దేవరకొండ, రష్మిక..
సద్దుల బతుకమ్మ వేడుకల్లో విజయ్ దేవరకొండ, రష్మిక..
'మీరు విరిగిపోలేదు.. కేవలం అలసిపోయారు! గతాన్ని మోయడం ఆపండి..'
'మీరు విరిగిపోలేదు.. కేవలం అలసిపోయారు! గతాన్ని మోయడం ఆపండి..'
ఆ స్టార్ నటుడి కేఫ్‌లో ధరలు చూసి షాకవుతోన్న నెటిజన్లు
ఆ స్టార్ నటుడి కేఫ్‌లో ధరలు చూసి షాకవుతోన్న నెటిజన్లు
పండక్కి ముందే ఎయిర్‌టెల్ సూపర్ న్యూస్.. తక్కువ ధరలో రీఛార్జ్..
పండక్కి ముందే ఎయిర్‌టెల్ సూపర్ న్యూస్.. తక్కువ ధరలో రీఛార్జ్..
ఏడాది మొత్తం విజయ్‌ను మనం పెళ్లి చేసుకుందాం అని అడుగుతూనే ఉన్నా
ఏడాది మొత్తం విజయ్‌ను మనం పెళ్లి చేసుకుందాం అని అడుగుతూనే ఉన్నా
ఇక రుద్దాల్సిన పనిలేదు.. నల్లటి వెండి ఆభరణాలు నిమిషాల్లో..
ఇక రుద్దాల్సిన పనిలేదు.. నల్లటి వెండి ఆభరణాలు నిమిషాల్లో..
OTTని షేక్ చేస్తోన్న ఒడియా హారర్ థ్రిల్లర్.. ఇప్పుడు తెలుగులోనూ..
OTTని షేక్ చేస్తోన్న ఒడియా హారర్ థ్రిల్లర్.. ఇప్పుడు తెలుగులోనూ..