AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fake Hallmarking: మార్కెట్లో విచ్చలవిడిగా నకిలీ హాల్‌మార్క్ నగలు.. నిజమైన మార్కింగ్‌ను ఎలా గుర్తించాలి..?

ప్రపంచంలోని రెండవ అతిపెద్ద ఆభరణాల మార్కెట్‌లోని వినియోగదారులు నకిలీ హాల్‌మార్క్ బంగారాన్ని కొనుగోలు చేసే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నారని, ఇది మార్కెట్‌ను..

Fake Hallmarking: మార్కెట్లో విచ్చలవిడిగా నకిలీ హాల్‌మార్క్ నగలు.. నిజమైన మార్కింగ్‌ను ఎలా గుర్తించాలి..?
Gold Price
Subhash Goud
|

Updated on: Dec 16, 2022 | 8:10 PM

Share

ప్రపంచంలోని రెండవ అతిపెద్ద ఆభరణాల మార్కెట్‌లోని వినియోగదారులు నకిలీ హాల్‌మార్క్ బంగారాన్ని కొనుగోలు చేసే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నారని, ఇది మార్కెట్‌ను ముంచెత్తుతుందని పరిశ్రమల సంఘం హాల్‌మార్కింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (హెచ్‌ఎఫ్‌ఐ) కేంద్ర ప్రభుత్వానికి లేఖలో పేర్కొంది. దేశంలో బంగారం కొనుగోళ్ల వ్యాపారం జోరుగా సాగుతుంటాయి. భారతీయ సాంప్రదాయంలో పసిడికి అత్యంత ప్రాధాన్యతనిస్తుంటారు. అయితే ఇటీవల కాలంలో బంగారంపై హాల్‌మార్క్‌ విధానాన్ని కేంద్రం అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఈ విధానం బంగారం నాణ్యతను సూచిస్తుంది. అయితే బంగారం నిజమా.. లేదా నకిలీదా అనే విషయాన్ని తెలుసుకోవడం ఎంతో ముఖ్యం. బంగారంపై హాల్‌మార్కింగ్‌ను గుర్తించడం వల్ల బంగారం స్వచ్ఛతను గుర్తించవచ్చు. అయితే దేశంలో నకిలీ హాల్‌మార్క్ నగలు విచ్చలవిడిగా అమ్ముడవుతున్నాయి.

హాల్‌మార్కింగ్ అంటే ఏమిటి..?

హాల్‌మార్కింగ్ అనేది బంగారం స్వచ్ఛతకు హామీ. హాల్‌మార్క్ అనేది ప్రతి ఆభరణంపై ఒక రకమైన గుర్తు లాంటిది. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్‌) చిహ్నం బంగారు ఆభరణాలపై ఉంటుంది. ఇది దాని స్వచ్ఛతను సూచిస్తుంది. దీంతో పాటు పరీక్ష కేంద్రం తదితర సమాచారం హాల్ మార్కింగ్‌లో అందుబాటులో ఉంటుంది. ప్రతి ఆభరణంలో బంగారం పరిమాణం మారుతూ ఉంటుంది. ఇది దాని స్వచ్ఛతపై ఆధారపడి ఉంటుంది. కొన్నిసార్లు నగల వ్యాపారులు తక్కువ క్యారెట్ ఆభరణాలకు ఎక్కువ క్యారెట్ ధరలను వసూలు చేస్తారు. దీన్ని తొలగించేందుకు హాల్‌మార్కింగ్‌ను తప్పనిసరి చేశారు.

నకిలీ హాల్‌మార్కింగ్‌లను ప్రభుత్వం అరికట్టాలి:

ప్రజలను మోసం చేయకుండా కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం బంగారు ఆభరణాలపై గోల్డ్ హాల్‌మార్కింగ్‌ను తప్పనిసరి చేసింది. దీని తర్వాత కూడా దేశంలోని మార్కెట్లలో కల్తీ బంగారు ఆభరణాలు విక్రయిస్తున్నారు. కొందరు వ్యక్తులు బంగారు ఆభరణాలపై నకిలీ హాల్‌మార్కింగ్‌లు వేసి వినియోగదారులను మోసం చేస్తున్నారని హాల్‌మార్కింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (హెచ్‌ఎఫ్‌ఐ) గుర్తించింది. నకిలీ హాల్‌మార్కింగ్‌ను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఫెడరేషన్ ప్రభుత్వానికి లేఖ రాసింది.

ఇవి కూడా చదవండి

పాత లోగోను పూర్తిగా నిషేధం:

మీడియా నివేదికల ప్రకారం, పాత హాల్‌మార్కింగ్ లోగోను ప్రభుత్వం ఇంకా నిషేధించలేదని హెచ్‌ఎఫ్‌ఐ అధ్యక్షుడు జేమ్స్ జోస్ చెప్పారు. దీని ముసుగులో నకిలీ హాల్‌మార్కింగ్‌లు చేసి తక్కువ క్యారెట్ల బంగారు ఆభరణాలను ఎక్కువ క్యారెట్లు చెప్పి వినియోగదారులకు విక్రయిస్తున్నారు. పాత హాల్‌మార్కింగ్ లోగో చాలా సురక్షితం కాదని జోస్ అన్నారు. నకిలీ హాల్‌మార్కింగ్‌ను అరికట్టడానికి, పాత లోగోను ఉపయోగించడానికి ప్రభుత్వం కాలపరిమితిని నిర్ణయించాలని, ఆ తర్వాత పూర్తిగా నిషేధించాలని ఆయన పేర్కొన్నారు.

నిజమైన హాల్‌మార్కింగ్‌ను ఎలా గుర్తించాలి:

గతేడాది జులై 1 నుంచి బంగారు ఆభరణాల హాల్‌మార్కింగ్‌ విధానాన్ని తీసుకువచ్చింది కేంద్రం. ఇందులో భాగంగా ఈ మార్కింగ్‌లో మూడు విధానాలుగా తీసుకువచ్చింది. మొదటి సంకేతం బీఐఎస్‌ హాల్‌మార్క్. ఇది త్రిభుజాకార గుర్తు. రెండవ సంకేతం స్వచ్ఛత గురించి చెబుతుంది. అంటే ఆ నగలు ఎన్ని క్యారెట్ల బంగారంతో చేశారో చూపిస్తుంది. మూడోది హెచ్‌యూఐడీ నంబర్ అని పిలువబడే 6 అంకెల ఆల్ఫాన్యూమరిక్ కోడ్. హెచ్‌యూఐడీ అంటే హాల్‌మార్క్ యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్. ఈ 6 అంకెల కోడ్‌లో అక్షరాలు, అంకెలు చేర్చింది. హాల్‌మార్కింగ్ సమయంలో ప్రతి ఆభరణానికి హెచ్‌యూఐడీ నంబర్ కేటాయించింది. ఈ సంఖ్య ప్రత్యేకమైనది. అంటే ఒకే హెచ్‌యూఐడీ నంబర్‌తో రెండు రకాల అభరణాలు ఉండకూడదు.

ఈ యాప్‌తో తనిఖీ చేయండి

బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ రూపొందించిన బీఐఎస్‌ కేర్ యాప్ అనే మొబైల్ యాప్‌తో మీరు హాల్‌మార్క్ చేయబడిన ఆభరణాలను తనిఖీ చేయవచ్చు. బిఐఎస్ కేర్ యాప్‌ను డౌన్‌లోడ్ చేయడం ద్వారా మీరు అందులో మీ పేరు, ఫోన్ నంబర్, ఇమెయిల్ ఐడిని ఇవ్వాలి. దీని తర్వాత మీ మొబైల్ నంబర్, ఇమెయిల్ ఐడీకి వచ్చిన ఓటీపీని ధృవీకరించాలి. ధృవీకరణ తర్వాత మాత్రమే ఈ యాప్‌ను ఉపయోగించవచ్చు.

యాప్‌లో వెరిఫై ఫీచర్:

BIS కేర్ యాప్‌లో ‘Verify HUID’ ఫీచర్ ఉంటుంది. ఇందులో ఆభరణాలపై ఇచ్చిన హెచ్‌యూఐడీ నంబర్‌ను నమోదు చేయడం ద్వారా హాల్‌మార్కింగ్ అసలైనదా, నకిలీదా అని తెలుసుకోవచ్చు. ఇది కాకుండా మీరు యాప్‌లోని లైసెన్సింగ్ వివరాల విభాగానికి వెళ్లడం ద్వారా బ్రాండెడ్ ఉత్పత్తులను తనిఖీ చేయవచ్చు. మీరు కొనుగోలు చేసిన హాల్‌మార్క్ జ్యువెలరీతో మీరు సంతృప్తి చెందకపోతే మీరు యాప్‌లోని COMPLETES విభాగాన్ని సందర్శించడం ద్వారా ఫిర్యాదును నమోదు చేసుకోవచ్చు.

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి