Year Ender 2022: సాహో భారతీయుడా..! 2022లో మనవారు అత్యధికంగా ఆర్డర్ చేసిన ఆహారాల జాబితా ఇదే..

కరోనా తర్వాత ఎక్కువ మంది ఆన్‌లైన్ ఫుడ్‌పై ఎక్కువగా ఆధారపడుతున్నారు. కొన్ని ఆహారాలను ప్రజలు ఎక్కువగా ఇష్టపడతారని తేలింది. కాబట్టి 2022లో అత్యంత ప్రజాదరణ పొందిన ఆహారాలు ఏంటి..? ఆన్‌లైన్‌లో ఏవి ఎక్కువగా బుక్ అయ్యాయో ఓ సారి చూద్దాం.

Year Ender 2022: సాహో భారతీయుడా..! 2022లో మనవారు అత్యధికంగా ఆర్డర్ చేసిన ఆహారాల జాబితా ఇదే..
Online Ordered Food
Follow us
Sanjay Kasula

|

Updated on: Dec 16, 2022 | 5:53 PM

భారతీయులు మంచి భోజన ప్రియులు. భారతీయులు తినే ఆహారం, పానీయాల విషయంలో ప్రపంచం జేజేలు పలుకుతుంది. మనం తినేలా మరొకరు తినలేరని ఢంకా బజాయించి మరీ చెబుతోంది 2022. ప్రతి సంవత్సరం మాదిరిగానే, ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ 2022లో ప్లాట్‌ఫారమ్ నుంచి భారతీయులు ఎక్కువగా ఆర్డర్ చేసిన ఆహారాన్ని వెల్లడించింది. స్విగ్గీ అందించిన లెక్కల ప్రకారం.. ఈ సంవత్సరం అత్యధికంగా ఆర్డర్ చేయబడిన రెసిపీ చార్ట్‌లో బిర్యానీ అగ్రస్థానంలో ఉంది. డిష్ చార్ట్‌లో బిర్యానీ వరుసగా ఏడోసారి అగ్రస్థానంలో నిలిచింది. బిర్యానీ సెకనుకు 2.28 ఆర్డర్లతో సరికొత్త రికార్డు సృష్టించిందని ఈ నివేదికలో వెల్లడించింది. ఈ ఏడాది బిర్యానీ కోసం నిమిషానికి 137 ఆర్డర్లు వచ్చాయని స్విగ్గీ తెలిపింది. అయితే, కేవలం ఈ ప్లాట్‌ఫారమ్ నుంచి 2022లో భారతీయులు అత్యధికంగా ఆర్డర్ చేసిన స్నాక్స్, స్వీట్లు, ఐస్ క్రీమ్‌ల గురించి సమాచారాన్ని కూడా ఆ సంస్థ షేర్ చేసింది. 2022లో భారతీయులు ఎక్కువగా ఇష్టపడే వంటకాలు ఏంటో ఓ సారి చూద్దాం.

ఫుడ్ లిస్ట్ లో చికెన్ బిర్యానీ టాప్

ఈ సంస్థ అందించిన నివేదిక ప్రకారం, ఈ సంవత్సరం అత్యధికంగా ఆర్డర్ చేసిన ఆహార పదార్థాలు చికెన్ బిర్యానీ, మసాలా దోస, చికెన్ ఫ్రైడ్ రైస్, పనీర్ బటర్ మసాలా, బటర్ నాన్, వెజ్ ఫ్రైడ్ రైస్, వెజ్ బిర్యానీ, తందూరి చికెన్ అని తెలిపింది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ సంవత్సరం భారతీయులు భారతీయ భోజనం కాకుండా ఇతర ప్రయోగాలు చేసే మూడ్‌లో ఉన్నారని కూడా తెలిపింది. ఇందులో ఇటాలియన్ పాస్తా, పిజ్జా, మెక్సికన్ బౌల్, స్పైసీ రామెన్, సుషీ వంటి వంటకాలను ఆర్డర్ చేశారని వెల్లడించింది. రావియోలీ (ఇటాలియన్), బిబింబాప్ (కొరియన్) వంటి ప్రసిద్ధ వంటకాల రుచి చూసినట్లుగా తెలిపింది.

స్నాక్స్‌లో సమోసా అగ్రస్థానం..

ఈ ఏడాది అత్యధికంగా ఆర్డర్ చేసిన 10 స్నాక్స్‌లో మొత్తం 4 మిలియన్ ఆర్డర్‌లతో సమోసా అగ్రస్థానంలో నిలిచింది. అత్యధికంగా ఆర్డర్ చేయబడిన టాప్ 10 స్నాక్స్‌లో సమోసా, పాప్‌కార్న్, పావ్ భాజీ, ఫ్రెంచ్ ఫ్రైస్, గార్లిక్ బ్రెడ్‌స్టిక్‌లు, హాట్ వింగ్స్, టాకో, క్లాసిక్ స్టఫ్డ్ గార్లిక్ బ్రెడ్, మింగిల్స్ బకెట్ ఉన్నాయి.

గులాబ్ జామూన్‌కు ప్రథమ స్థానం

అయితే, స్వీట్స్ తినాలంటే మన భారతీయుల తర్వాతే ఎవరైనా అని మరోసారి తేలింది. ఇందులో 2.7 మిలియన్ ఆర్డర్‌లతో గులాబ్ జామూన్ టాప్ ప్లేస్ దక్కించుకుంది. 1.6 మిలియన్ ఆర్డర్‌లతో రస్మలై, 1 మిలియన్ ఆర్డర్‌లతో చోకో లావా కేక్, రస్గుల్లా, చోకోచిప్స్ ఐస్ క్రీమ్, ఆల్ఫోన్సో మ్యాంగో ఐస్ క్రీమ్, కాజు కట్లీ, టెండర్ కోకోనట్ ఐస్ క్రీమ్, డెత్ బై చాక్లెట్, మరిన్ని ఆన్‌లైన్ ఆర్డర్ చేసిన స్వీట్‌లు ఉన్నాయి.

స్విగ్గీ ఏం చెప్పిందో తెలుసా?

స్విగ్గీ ఫుడ్ మార్కెట్‌ప్లేస్ భారతదేశం అంతటా వినియోగదారులకు సేవలను అందిస్తుందని కంపెనీ తెలిపింది. కస్టమర్లు శ్రీనగర్, పోర్ట్ బ్లెయిర్, మున్నార్, ఐజ్వాల్, జల్నా, భిల్వారా, మరిన్ని నగరాల్లో తమ మొదటి ఆర్డర్‌లు ఈ ఏడాది వచ్చాయని తెలిపింది. మొట్టమొదటిసారిగా, కొత్త నగరాలు స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌లో నిమిషాల వ్యవధిలో తమ కిరాణా సామాగ్రిని డెలివరీ చేసినందుకు ఆనందాన్ని వ్యక్తం చేసింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం