Credit Card: మీరు క్రెడిట్‌ కార్డు వాడుతున్నారా…? రివార్డు పాయింట్లను ఎలా వాడాలి..? వాటి విలువ ఎంత..?

Credit Card: క్రెడిట్‌ కార్డులు వాడితే వచ్చే రివార్డు పాయింట్ల గురించి పెద్దగా పట్టించుకోరు. వచ్చిన రివార్డు పాయింట్లతో ఆన్‌లైన్‌లో వస్తువులను కొనుగోలుకు వాడుతుంటారు...

Credit Card: మీరు క్రెడిట్‌ కార్డు వాడుతున్నారా...? రివార్డు పాయింట్లను ఎలా వాడాలి..? వాటి విలువ ఎంత..?
Credit Card Reward Points
Follow us
Subhash Goud

|

Updated on: Mar 26, 2021 | 6:21 PM

Credit Card: క్రెడిట్‌ కార్డులు వాడితే వచ్చే రివార్డు పాయింట్ల గురించి పెద్దగా పట్టించుకోరు. వచ్చిన రివార్డు పాయింట్లతో ఆన్‌లైన్‌లో వస్తువులను కొనుగోలుకు వాడుతుంటారు తప్ప వాటి గురించి పెద్దగా తెలుసుకుని ఉండరు. నిజంగా రివార్డు పాయింట్లో ఓ విధంగా ప్రయోజనమేనని చెప్పాలి. వస్తువుల, సేవలను కొనడానికి ఇవి ఉపయోగిస్తారు. మనం చేసే లావాదేవీల ఆధారంగా రివార్డు పాయింట్లు వస్తుంటాయి. అసలు ఇవి ఎలా వస్తాయి..? ఎలా ఉపయోగించాలి..? వీటి అదనపు ప్రయోజనాలు పొందాలంటే ఎలా వాడాలి..? అనే విషయాలు కచ్చితంగా తెలిసి ఉండాలి.

రివార్డు పాయింట్లు ఎలా వస్తాయి..?

క్రెడిట్‌ కార్డుతో లావాదేవీ జరిపినట్లయితే ఈ పాయింట్లు వస్తాయి. అయితే అన్నింటికి వస్తాయని గ్యారంటీ ఏమి ఉండదు. మన చేసే లావాదేవీ విలువపై ఆధారపడి ఉంటుంది. కొన్ని కార్డుల్లో ప్రతి రూ.100 ఖర్చు చేస్తే ఒక రివార్డు పాయింట్‌ వస్తుంటుంది. మరికొన్నింటిలో రూ.150, రూ.200 కంపెనీని బట్టి పాయింట్లు వచ్చే విధానం ఉంటుంది. అలా కార్డు రకం, దేనిపై ఖర్చు చేస్తున్నాము.. ఎలా ఖర్చు చేస్తున్నాము అనే అంశాలపైనా కూడా ఆధారపడి ఉంటుంది. అయితే సాధారణంగా, ఎలాంటి వార్షిక రుసుము లేకుండా లేదా ప్రాసెసింగ్‌ రుసుము లేకుండా ఇచ్చే కార్డుల కంటే ప్రీమియం కార్డుల్లో రివార్డు పాయింట్ల ప్రయోజనాలు అధికంగా ఉంటాయని గమనించాలని నిపుణులు చెబుతున్నారు.

బోనస్‌ రివార్డు పాయింట్లు

అయితే కొన్ని కంపెనీలు బోనస్‌ రివార్డు పాయింట్లు ఇస్తుంటాయి. ఒక నిర్ణీత వ్యవధిలో నిర్ధేశిత మొత్తాన్ని ఖర్చు చేస్తే అదనపు పాయింట్లను అందిస్తుంటాయి. ఉదాహరణకు చెప్పాలంటే.. సంవత్సరంలో రూ.5 లక్షల లావాదేవీలు జరిపితే 10 వేల పాయింట్లు లభిస్తాయని కొన్ని కంపెనీలు చెబుతుంటాయి. ఒక వేళ అదే ఖర్చు రూ.8 లక్షలు దాటితే మరో ఐదువేల పాయింట్లు అదనంగా ఇస్తామని ప్రకటిస్తుంటాయి. అయితే ఈ పాయింట్లను మీ అవసరానికి బట్టి పండగ సీజన్‌లో షాపింగ్‌ చేస్తే బోనస్‌ పాయింట్లు కూడా పొందే అవకాశం ఉంటుంది.

అన్ని క్రెడిట్‌ కార్డుల్లో రివార్డు పాయింట్లు రాకపోవచ్చు

అన్ని క్రెడిట్‌ కార్డుల్లో రివార్డు పాయింట్లు రాకపోవచ్చు. అందుకే కార్డు తీసుకునే సమయంలో అన్ని వివరాలు తెలుసుకోవాలి. కొన్ని కార్డుల్లో పాయింట్లకు బదులు క్యాష్‌బ్యాక్‌లు లభిస్తాయి. కొన్నింట్లో డిస్కౌంట్లు లభిస్తాయి. అయితే అన్ని కార్డులపై ఏదో రకమైన సదుపాయం పొందే అవకాశం ఉంటుంది.

ఇక మనకు లభించిన రివార్డు పాయింట్లను రిడీమ్‌ చేసుకునేటప్పుడు వాటి విలువను దృష్టిలో ఉంచుకోవాల్సి ఉంటుంది. పాయింట్ల విలువ కంపెనీ, మనం చేసే లావాదేవీలని బట్టి మారుతుంటుంది. ఒక వస్తువు కొనుగోలు చేసేటప్పుడు ఒక పాయింట్‌ విలువ 20 పైసలుగా ఉంటే, వేరే వస్తువు తీసుకుంటే అదే పాయింట్‌ 30 పైసలు విలువ ఉండవచ్చు.

మీరు ఏదైనా విలువైన వస్తువు కొనుగోలు చేసినట్లయితే ప్రతి 2000 పాయింట్లకు రూ.500లుగా పరిగణిస్తారు. అదే ఏసీ గానీ, ఇంకేదైన విలువైన వస్తువు కొంటే ప్రతి 2500 పాయింట్లను రూ.500 నిర్ణయించవచ్చు. అలాగే ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌.. మనం తీసుకునే వస్తువు, దాని కంపెనీ, మనం వాడుతున్న కార్డు, వాడుతున్న సమయాన్ని బట్టి పాయింట్ల విలువ మారుతూ ఉంటుంది.

పాయింట్లు ఎక్స్‌పైర్‌ అవుతాయా?

కాగా, క్రెడిట్‌కార్డు లావాదేవీల ద్వారా లభించే రివార్డు పాయింట్లకు నిర్ణీత కాలపరిమితి ఉంటుంది. ఆ సమయం దాటితే వాటిని మనం వాడుకోలేము. అందుకే క్రెడిట్‌ కార్డు స్టేట్‌మెంట్‌పై గమనిస్తూ ఉండాలి. సాధారణంగా చాలా కంపెనీలు పాయింట్లు వాడుకునేందుకు గడువు రెండు లేదా మూడు సంవత్సరాలు నిర్ణయిస్తాయి. అతి కొద్ది కంపెనీల్లో కాలపరిమితి అంతగా ఉండదు. తక్కువ రోజుల్లోనే అవి ఎక్స్‌పైరీ అయిపోతుంటాయి. అలాగే కొన్ని కంపెనీలు కాలపరిమితి అనేది ఉండదు. ఎప్పుడైన వాడుకునే వెసులుబాటు ఉంటుంది. వీటిని వినియోగదారుడు తప్పకుండా గమనిస్తుండాలి.

పాయింట్ల రీడీమ్‌

అయితే రివార్డు పాయింట్లను విలైనంత తొందరగా రీడీమ్‌ చేసుకోవాలని భావిస్తుంటారు. అలాంటి ఆలోచన పెట్టవద్దు. పాయింట్లకు ఎక్కడ అధిక విలువ లభిస్తుందో గమనించండి. అలాగే ఎక్కడ, ఎప్పుడు వాడితే అధిక ప్రయోజనం కలుగుతుందో తెలుసుకోవాలి. కొన్ని కంపెనీలు పండగ సీజన్‌లలో ప్రత్యేక ఆఫర్లను ప్రకటిస్తుంటాయి. ఆ సమయంలో మన వద్ద ఉన్న పాయింట్లకు ఎక్కువ మొత్తంలో వస్తువులు కొనే అవకాశం ఉండవచ్చు. అలాగే ఆఫ్‌లైన్ కంటే ఆన్‌లైన్‌లో లావాదేవీ కోసం రీడీమ్‌ చేసుకుంటే సాధారణంగా పాయింట్ విలువ ఎక్కువ ఉంటుంది. మరికొన్ని కంపెనీలు క్రెడిట్‌ కార్డు బకాయిల్ని చెల్లించేందుకు కూడా పాయింట్లను వినియోగించుకునే అవకాశం కల్పిస్తుంటాయి. ఇలా క్రెడిట్‌ కార్డు వాడుతున్నవారు రివార్డు పాయింట్ల ఉపయోగించే విధానం తెలుసుకుని ఉంటే మంచిది. అయితే రివార్డు పాయింట్లను పండగ సీజన్‌లో, ఇంకేమైన ప్రత్యేక ఆఫర్ల సీజన్‌లో షాపింగ్‌లు చేస్తే ఆ పాయింట్లపైనే బోనస్‌ పాయింట్లు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి.

ఇవీ చదవండి : PM Kisan Samman Nidhi: రైతులకు డబుల్‌ బెనిఫిట్స్‌.. మార్చి 31లోగా చేరండి.. బ్యాంకు ఖాతాలో రూ.4 వేలు పొందండి

Provident Fund (PF): ఉద్యోగులు అలర్డ్‌.. మీరు ఈ పనులు చేయకపోతే పీఎఫ్‌ డబ్బులు తీసుకోలేరు

Health Check-up Benefits: మార్చి 31లోపు ఇలా చేయండి.. రూ.50 వేల వరకు ప్రయోజనం పొందే అవకాశం..!

రోగాల బెండు తీసే కూరగాయ.. ఆ జిగురుతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు..
రోగాల బెండు తీసే కూరగాయ.. ఆ జిగురుతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు..
అమ్మా.. నీ అవసరం తీరిపోయింది నిన్నొదిలేస్తున్నా.! వృద్ధాశ్రమం బయట
అమ్మా.. నీ అవసరం తీరిపోయింది నిన్నొదిలేస్తున్నా.! వృద్ధాశ్రమం బయట
30 దాటాకా పెళ్లయినా.. పెద్దగా లాభం లేదట.! ఆలోచించుకోండి మరి..
30 దాటాకా పెళ్లయినా.. పెద్దగా లాభం లేదట.! ఆలోచించుకోండి మరి..
ఒకటి.. రెండు కాదు.. ఒకేసారి వికసించిన 26 బ్రహ్మ కమలాలు.! వీడియో
ఒకటి.. రెండు కాదు.. ఒకేసారి వికసించిన 26 బ్రహ్మ కమలాలు.! వీడియో
బంగారం ధర.. ఇవాళ ఎంతుందంటే.! తగ్గినట్టే తగ్గి మళ్లీ పరుగు..
బంగారం ధర.. ఇవాళ ఎంతుందంటే.! తగ్గినట్టే తగ్గి మళ్లీ పరుగు..
ఇలాంటి కష్టకాలంలో వాళ్లకు రెహమాన్‌ లీగల్ నోటీసులు.! వీడియో.
ఇలాంటి కష్టకాలంలో వాళ్లకు రెహమాన్‌ లీగల్ నోటీసులు.! వీడియో.
కాబోయే భార్యను ఉద్దేశించి నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు.. వీడియో.
కాబోయే భార్యను ఉద్దేశించి నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు.. వీడియో.
విజయ్‌-రష్మిక మళ్లీ దొరికేశారుగా.! లంచ్ చేస్తున్న ఫోటో వైరల్‌..
విజయ్‌-రష్మిక మళ్లీ దొరికేశారుగా.! లంచ్ చేస్తున్న ఫోటో వైరల్‌..
నా మాజీ కోసం చాలా ఖర్చు చేశాను.! సమంత కామెంట్స్ వైరల్‌..
నా మాజీ కోసం చాలా ఖర్చు చేశాను.! సమంత కామెంట్స్ వైరల్‌..
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!