How to Become Rich: ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ ట్రిక్‌తో ధనవంతులు కావచ్చటా..! మీరూ ట్రై చేయండి..!

ధనవంతులు కావాలంటే ఏ వ్యాపారం చేయాలి..? ఏ వ్యాపారం చేస్తే ధనవంతులుగా మారుతారు..? అయితే ధనవంతులగా మారేందుకు ...

How to Become Rich: ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ ట్రిక్‌తో ధనవంతులు కావచ్చటా..!  మీరూ ట్రై చేయండి..!
Your Dream Of Becoming A Mi
Follow us
Sanjay Kasula

|

Updated on: Mar 27, 2021 | 9:18 AM

How to Become Rich: ధనవంతులు కావాలంటే ఏ వ్యాపారం చేయాలి..? ఏ వ్యాపారం చేస్తే ధనవంతులుగా మారుతారు..? అయితే ధనవంతులగా మారేందుకు మీరు కేవలం వ్యాపారమే  చేయాలిసిన అవసరం లేదు…! ఏ వ్యాపారం చేయకుండానే లక్షాధికారి కావాలన్న వారి కలను నెరవేర్చుకున్నవారు చాలా మంది ఈ ప్రపంచంలో ఉన్నారు. ప్రపంచం నలుమూలల నుండి చాలా మందిని మీరు ఇలా ఉదాహరణగా చూడొచ్చు… దీని వెనుక ఉన్న కారణం ఏమిటంటే వారు గణితశాస్త్రం యొక్క సరళమైన సూత్రాన్ని అర్థం చేసుకున్నారని అర్థం..

ఆ సూత్రాన్నితమ జీవితంలోకి  అన్వయించుకున్నారని అర్థం. ఈ సూత్రం మొత్తం ఆసక్తికరంగా ఉంటుంది. మనమందరం పాఠశాల రోజుల్లో ఈ సూత్రాన్ని చదుకున్నాము. కాని చాలా కొద్ది మంది మాత్రమే డబ్బు ఆదా చేయడానికి వారి జీవితంలో దీనిని ఉపయోగిస్తున్నారు. ఈ రోజు మనం ఈ ఫార్ములాతో అలాంటి కొన్ని ముఖ్యమైన విషయాలను తెలుసుకుందాం.. దాని సహాయంతో మీరు ధనవంతులు కావాలనే మీ కలను నెరవేర్చుకోవచ్చు.

అదే “కాంపౌండింగ్” సిద్ధాంతం..  ఇదే సిద్ధాంతం గురించి ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ ఇలా చెప్పాడు. ఇది ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనదని పేర్కొన్నాడు. అయితే సులభమైన పద్దతిలో  కాంపౌండింగ్ ఇంట్రెస్ట్‌‌ను అర్థం చేసుకుంటే.. ఇప్పటికే చెల్లించిన వడ్డీకి మరింత వడ్డిని జమ చేసే ప్రక్రియే కాంపౌండింగ్ సిద్ధాం.

కాంపౌండింగ్‌ అనగా వడ్డీపై వడ్డీగా భావించవచ్చు. దీని ప్రభావం కాలక్రమేణా వడ్డీకి రాబడిని పెంచడం జరుగుతుంది. దీనిని “మిరాకిల్ ఆఫ్ కాంపౌండింగ్ ” అని కూడా పిలుస్తారు.

పెట్టుబడి యొక్క ప్రధాన మొత్తంపై వడ్డీని పొందడమే కాకుండా మీకు వడ్డీపై కూడా వడ్డీ లభిస్తుంది. ఉదాహరణకు మీరు ఎక్కడో 500 రూపాయలు పెట్టుబడి పెట్టారని అనుకుందాం… దీనిపై వార్షిక వడ్డీని 10 శాతం వడ్డీ చొప్పున పొందుతున్నారు. మీకు ఏడాది తర్వాత 550 రూపాయలు లభిస్తాయి. అప్పుడు వచ్చే ఏడాది మీకు 605 రూపాయలు లభిస్తాయి. అదేవిధంగా, మీరు వడ్డీపై వడ్డీ ప్రయోజనాన్ని కూడా పొందుతారు. కానీ ఈ సూత్రాన్ని అర్థం చేసుకోవడం అంత ఈజీ కాదు.

కాంపౌండింగ్ వడ్డీపై రాబడి మూడు విషయాలపై ఆధారపడి ఉంటుంది…

1. వడ్డీ / లాభం( Interest / Profit): మీరు స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడి పెడితే అది మీ మూలధన లాభాలు.. డివిడెండ్ ద్వారా  రెట్టింపు చేస్తుంది.

2. సమయం(Time): మీరు మీ డబ్బును ఎక్కువ సమయం పాటు పెట్టుబడిగా పెట్టండి. ఒకే చోట ఎంత ఎక్కువ సమయం పెట్టుబడిగా పెడితే అంత ఎక్కువ రాబడి ఉంటుంది.

3. పన్ను(Tax): కాంపౌండింగ్ వడ్డీపై వచ్చే రాబడిలో ఎంత పన్ను చెల్లించాల్సిస్తున్నారో కూడా చూడాలి. వాస్తవానికి మీరు మీ పెట్టుబడిపై లాభాన్ని పొందుతున్నారను కోండి.. అలా ఎక్కువ కాలం పెట్టుబడి పెట్టడం  జరుగుతుంది.  అయితే మీరు వెచ్చించిన వడ్డిని తిరిగి పొదుపుగా మార్చుకోవచ్చు.. ఇలా చేయడం వల్ల మీ పెట్టుబడిపై పన్ను బారం తగ్గుతుంది.

కాంపౌండింగ్ వడ్డీని తీసుకొని డబ్బుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. డబ్బుతో సమయ విలువ చూసినప్పుడు.. అంటే మీ డబ్బు విలువ కాలక్రమేణా మారుతూ ఉంటుంది. ఒక సంవత్సరం తర్వాత వచ్చే ఆదాయం కంటే.. ఈ రోజు 100 రూపాయలు పొందడం మంచిది. ఎందుకంటే వచ్చే ఏడాదిలో మీరు పెట్టుబడి పెట్టడం ద్వారా కొంత ఆదాయం పొందవచ్చు. కాంపౌండింగ్ సహాయంతో ఈ 100 రూపాయల విలువ ఒక సంవత్సరం తరువాత ఎక్కువగా ఉంటుంది.

ఇవి కూడా చదవండి : ICAI CA Inter Result 2021: CA ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల.. డైరెక్ట్ లింక్ కోసం ఇక్కడ చూడండి… IND vs ENG 2nd ODI Live: టాస్ గెలిచిన ఇంగ్లాండ్.. భారత్ బ్యాటింగ్.. ఎంట్రీ ఇచ్చిన పంత్..