Amazon WhatsApp: మీకు ఈ అమెజాన్‌ లింక్‌ వచ్చిందా..? అయితే జాగ్రత్త… క్లిక్‌ చేశారంటే ఇక అంతే సంగతి

Amazon WhatsApp: ఆ కంపెనీ 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.. ఉచితంగా పలు ప్రొడక్ట్‌లను అందిస్తోంది.. ఈ కంపెనీ 30 ఏళ్లు పూర్తి చేసుకుంది ఉచితంగా గిఫ్ట్‌లు అందిస్తోంది..

Amazon WhatsApp: మీకు ఈ అమెజాన్‌ లింక్‌ వచ్చిందా..? అయితే జాగ్రత్త... క్లిక్‌ చేశారంటే ఇక అంతే సంగతి
Whatsapp Message
Follow us
Subhash Goud

|

Updated on: Mar 26, 2021 | 9:38 PM

Amazon WhatsApp: ఆ కంపెనీ 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.. ఉచితంగా పలు ప్రొడక్ట్‌లను అందిస్తోంది.. ఈ కంపెనీ 30 ఏళ్లు పూర్తి చేసుకుంది ఉచితంగా గిఫ్ట్‌లు అందిస్తోంది అంటూ వాట్సాప్‌ గ్రూపుల్లో, ఇతర సోషల్‌ మీడియా గ్రూపుల్లో చక్కర్లు కొడుతుంటాయి. అలాంటి మెసేజ్‌లు రాగానే అందులో ఏముందో తెలుసుకోకుండా కొందరు వాటిని ఇతరులకు పంపిస్తుంటారు. అలాంటి వాటిని క్లిక్‌ చేశారంటే ఇక అంతే సంగతి.. సైబర్‌ నేరగాళ్లు ఉచ్చులో పడటం ఖాయమంటున్నారు టెక్‌ నిపుణులు. తాజాగా అమెజాన్‌ పేరిట కూడా ఓ లింక్‌ వాట్సాప్‌ గ్రూపుల్లో తెగ వైరల్‌ అవుతోంది. ఇది కూడా ఆ కోవలోకే వస్తుంది. ముందుగా ఈ లింక్‌ను గమనిస్తే అమెజాన్‌ లోగోతోనే వస్తుండటం ఎక్కువ మంది నమ్మేందుకు ఆస్కారం ఉంఉటుంది.

కానీ క్షుణ్ణంగా పరిశీలిస్తే ఆమెజాన్‌ స్పెల్లింగ్‌ తప్పు ఉంటోంది. అలాగే యూఆర్‌ఎల్‌ కూడా HTTPతో ప్రారంభం అవుతుంది. ‘S’ లేదంటే అది సెక్యూర్‌ కాదని అర్థం చేసుకోవాలి. ఇలాంటి లింకులు హెచ్‌టీటీపీతోనే ప్రారంభం అవుతున్నాయన్నది గమనించాలి. అయితే ఈ లింక్‌లో ఫలానా ఫోన్‌ గెలచుకోవాలంటే ఈ లింక్‌ను క్లిక్‌ చేయాలంటూ వాట్సాప్‌ గ్రూపుల్లో పంపిస్తుంటారు. అయితే వాస్తవానికి అమెజాన్‌ ఎలాంటి ఆఫర్‌ ప్రకటించలేదు. సైబర్‌ నేరగాళ్లు ఇలాంటి లింక్‌లను క్రియేట్‌ చేసి నిలువునా మోసగించేలా చేస్తున్నారు. అందుకే ఇంలాంటి సందేశాలు వస్తే జాగ్రత్తగా ఉండండి. పొరపాటున ఆ లింక్‌లను క్లిక్‌ చేస్తే మీరు సైబర్‌ నేరగాళ్ల బారిన పడటం ఖాయమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

కాగా, ఇలాంటివి సోషల్‌ మీడియాలో చాలా చక్కర్లు కొడుతున్నాయి. జనాలను వీక్‌పాయింట్‌ను ఆసరా చేసుకుని సైబర్‌ నేరగాళ్లు ఇలాంటి లింక్‌లు పంపిస్తూ నిలువునా దోచేస్తున్నారని, జాగ్రత్తగా ఉండాలని సైబర్‌ క్రైస్‌ పోలీసులు హెచ్చరిస్తున్నారు. అలాంటి ఫేక్‌ లింకులను క్లిక్‌ చేసినట్లయితే మీ వ్యక్తిగత సమాచారం వారి చేతుల్లోకి వెళ్లిపోతుందని, మీ బ్యాంకు ఖాతాలు, ఇతర సమాచారం తెలుసుకునేందుకు ఆస్కారం ఉంటుందని, మరింత జాగ్రత్తగా ఉండటం ఎంతో అవసరమని సూచిస్తున్నారు.

Fake Messages

ఇవీ చదవండి: Credit Card: మీరు క్రెడిట్‌ కార్డు వాడుతున్నారా…? రివార్డు పాయింట్లను ఎలా వాడాలి..? వాటి విలువ ఎంత..?

PM Kisan Samman Nidhi: రైతులకు డబుల్‌ బెనిఫిట్స్‌.. మార్చి 31లోగా చేరండి.. బ్యాంకు ఖాతాలో రూ.4 వేలు పొందండి

Provident Fund (PF): ఉద్యోగులు అలర్డ్‌.. మీరు ఈ పనులు చేయకపోతే పీఎఫ్‌ డబ్బులు తీసుకోలేరు

Health Check-up Benefits: మార్చి 31లోపు ఇలా చేయండి.. రూ.50 వేల వరకు ప్రయోజనం పొందే అవకాశం..!