PM Kisan Samman Nidhi: రైతులకు డబుల్‌ బెనిఫిట్స్‌.. మార్చి 31లోగా చేరండి.. బ్యాంకు ఖాతాలో రూ.4 వేలు పొందండి

PM Kisan Samman Nidhi: కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెడుతూ వారికి బాసటగా నిలుస్తోంది. ఇప్పటికే రైతుల సంక్షేమం కోసం పలు పథకాలను ...

PM Kisan Samman Nidhi: రైతులకు డబుల్‌ బెనిఫిట్స్‌.. మార్చి 31లోగా చేరండి.. బ్యాంకు ఖాతాలో రూ.4 వేలు పొందండి
Pm Kisan Samman Nidhi
Follow us
Subhash Goud

| Edited By: Team Veegam

Updated on: Mar 27, 2021 | 1:39 PM

PM Kisan Samman Nidhi: కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెడుతూ వారికి బాసటగా నిలుస్తోంది. ఇప్పటికే రైతుల సంక్షేమం కోసం పలు పథకాలను ప్రవేశపెట్టింది. ఇక కేంద్రం రైతుల కోసం అదిరిపోయే పథకం అందుబాటులో తీసుకువచ్చిన విషయం తెలిసిందే. అదే పీఎం కిసాన్‌ స్కీమ్‌. ప్రధాన్‌ మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి యోజన పథకం ద్వారా మోదీ సర్కార్‌ అర్హులైన రైతులకు డబ్బులు అందిస్తోంది. సంవత్సరానికి రూ.6 వేలు బ్యాంకు ఖాతాలో వేస్తోంది. అయితే రూ.6వేలు ఒకేసారి కాకుండా విడతల వారీగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతోంది. మూడు విడతల్లో రూ.2 వేల చొప్పున రైతులకు అందిస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటికే ఏడు విడతల్లో డబ్బును రైతు బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. ఇప్పుడు 8వ విడత డబ్బులు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనుంది.

అయితే ఇప్పటికి కూడా పీఎం కిసాన్‌ స్కీమ్‌లో చేరని రైతులు ఎవరైనా ఉంటే మార్చి 31లోపు చేరితే డబుల్‌ బెనిఫిట్స్‌ పొందే అవకాశం ఉంటుంది. దీంతో రూ.2 వేలు పొందే వెసులుబాటు ఉంటుంది. అంటే రూ.4 వేలు పొందవచ్చు. ఏప్రిల్‌ 1 నుంచి జూలై 31,ఆగస్టు 1 నుంచి నవంబర్‌ 30, డిసెంబర్‌ 1 నుంచి మార్చి 31 వరకు ఇలా మూడు విడతలుగా డబ్బులు వస్తాయి. మార్చి 31లోపు చేరితే డిసెంబర్‌ 1 నుంచి మార్చి 31 విడతల డబ్బులు పొందవచ్చు. తర్వాత ఏప్రిల్‌ నుంచి జూలై ఇన్‌స్టాల్‌మెంట్‌ వస్తుంది. అంటే రెండు విడతల డబ్బును వెంటనే పొందే అవకాశం ఉంటుంది. అయితే రైతులు ఈ విషయాన్ని గమనించి ఈనెల 31వ తేదీ వరకు దరఖాస్తు చేసుకుంటే మంచిది. ప్రయోజనం పొందవచ్చు. అయితే ఇలాంటి రైతులకు ప్రయోజనాలు కల్పించే పథకాలు కేంద్ర ప్రభుత్వం ఎన్నో చేపడుతోంది. రైతులకు బీమా ప్రయోజనాలు, పెన్సన్‌ పథకాలు, రైతులు పంటలు వేసుకునేందుకు పెట్టుబడి సాయం ఇలా రకరకాలుగా పథకాలు రూపొందిస్తూ ప్రయోజనం కల్పిస్తోంది.

ఇవీ చదవండి : Provident Fund (PF): ఉద్యోగులు అలర్డ్‌.. మీరు ఈ పనులు చేయకపోతే పీఎఫ్‌ డబ్బులు తీసుకోలేరు

Health Check-up Benefits: మార్చి 31లోపు ఇలా చేయండి.. రూ.50 వేల వరకు ప్రయోజనం పొందే అవకాశం..!

Banks Privatization: త్వరలో మరో నాలుగు బ్యాంకులు ప్రైవేటీకరణ.. వినియోగదారుల పరిస్థితి ఏమిటీ..?