AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Corona Cases India : దేశంలో కొనసాగుతున్న కరోనా ఉధృతి.. కొత్తగా ఎన్ని కేసులు, మరణాలు నమోదయ్యాయంటే..

Corona Cases India : దేశంలో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. సెకండ్ వేవ్ ఉధృతంగా కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా వచ్చిన కేసులు, మరణాల

Corona Cases India : దేశంలో కొనసాగుతున్న కరోనా ఉధృతి.. కొత్తగా ఎన్ని కేసులు, మరణాలు నమోదయ్యాయంటే..
Corona Virus
uppula Raju
|

Updated on: Mar 26, 2021 | 1:44 PM

Share

Corona Cases India : దేశంలో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. సెకండ్ వేవ్ ఉధృతంగా కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా వచ్చిన కేసులు, మరణాల లెక్కలు ఇలా ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 11,00,756 కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా..59,118 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. రోజూవారీ కేసుల విషయంలో గతేడాది అక్టోబర్ మధ్యనాటి పరిస్థితి నెలకొని ఉంది. మొత్తం కేసులు కోటి 18లక్షల మార్కును దాటగా.. మృతుల సంఖ్య 1,60,949కి చేరిందని శుక్రవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

ప్రస్తుతం 4,21,066 క్రియాశీల కేసులుండగా..ఆ రేటు 3.55 శాతానికి చేరింది. ఇప్పటివరకు 1,12,64,637 మంది కొవిడ్ నుంచి కోలుకోగా..ఆ రేటు 95.09శాతానికి పడిపోయింది. నిన్న ఒక్కరోజే 32,987 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. అత్యధికంగా మహారాష్ట్రలోనే కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. తాజాగా 35,952 కొత్త కేసులు వెలుగుచూడగా..111 మంది మృత్యుఒడికి చేరుకున్నారు. అన్ని రాష్ట్రాల్లో కలిపి 4.21లక్షల క్రియాశీల కేసులుండగా..ఒక్క మహారాష్ట్రలోనే వాటి సంఖ్య 2,64,001గా ఉంది. అక్కడ మొత్తం పాజిటివ్ కేసులు 26లక్షలకు పైబడగా.. 22,83,037 మంది మహమ్మారి నుంచి బయటపడ్డారు.

మరోవైపు, దేశంలో రెండు దశల్లో భాగంగా కరోనా టీకా కార్యక్రమం కొనసాగుతోంది. మార్చి 25న కేంద్రం 23,58,731 టీకా డోసులను పంపిణీ చేసింది. ఇప్పటివరకు 5,55,04,440 మందికి టీకాలు అందించింది. ఇది ఇలా ఉంటే దేశ ప్రజలందరు తప్పకుండా మాస్క్‌లు ధరించాలని ఆరోగ్య శాఖ సూచిస్తుంది. అంతేకాకుండా కరోనా నివారణ చర్యలను ప్రతి ఒక్కరు పాటించాలని తెలిపింది. టీకా వేసుకోవడానికి అందరు పేర్లు నమోదుచేసుకోవాలని వెల్లడించింది.

Telangana Assembly Sessions Live Updates: తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లో లాక్‌డౌన్‌ ఉండదు.. స్పష్టం చేసిన సీఎం కేసీఆర్‌

Jathi Ratnalu : కలక్షన్ల రికార్డ్ క్రియేట్ చేసిన జాతిరత్నాలు … యూఎస్ లోనూ గూస్ పింపుల్ రెస్పాన్స్..

Holi 2021 : నార్త్ ఇండియాలో హోలీ స్పెషల్.. సంప్రదాయ వంటలు.. తయారీ విధానం