Jathi Ratnalu : కలక్షన్ల రికార్డ్ క్రియేట్ చేసిన జాతిరత్నాలు … యూఎస్ లోనూ గూస్ పింపుల్ రెస్పాన్స్..

టాలీవుడ్ టాలెంటెడ్ హీరోల్లో నవీన్ పోలిశెట్టి ఒకడు. ఈ కుర్ర హీరో శ్రీనివాస ఆత్రేయ సినిమాతో హీరోగా మారి.. మొదటి సినిమాతోనే మంచి హిట్ ను అందుకున్నాడు.

Jathi Ratnalu : కలక్షన్ల రికార్డ్ క్రియేట్ చేసిన జాతిరత్నాలు ... యూఎస్ లోనూ గూస్ పింపుల్ రెస్పాన్స్..
Jathi Ratnalu
Follow us
Rajeev Rayala

|

Updated on: Mar 26, 2021 | 1:33 PM

Jathi Ratnalu : టాలీవుడ్ టాలెంటెడ్ హీరోల్లో నవీన్ పోలిశెట్టి ఒకడు. ఈ కుర్ర హీరో ఏజెంట్ శ్రీనివాస ఆత్రేయ సినిమాతో హీరోగా మారి.. మొదటి సినిమాతోనే మంచి హిట్ ను అందుకున్నాడు. ఇప్పుడు జాతిరత్నాలు అంటూ హడావిడి చేస్తున్నాడు. నవీన్ పోలిశెట్టి, ప్రియా దర్శి, రాహుల్ రామకృష ప్రధాన పాత్రలో ఈ సినిమా తెరకెక్కింది. అనుదీప్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మహాశివరాత్రి కానుకగా విడుదలైంది. ఈ సినిమాకు మహానటి ఫెమ్ నాగ్ అశ్విన్ నిర్మాతగా వ్యవహరించాడు. ఇక ఈ సినిమా సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. విడుదలై ఇన్ని రోజులు గడుస్తున్నా థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ అవుతున్నాయి.

అలాగే ఈ సినిమా అమెరికాలో కూడా రికార్డులు క్రియేట్ చేస్తుంది. ‘జాతి రత్నలు’ మార్చి 10న యూఎస్ లో రిలీజ్ అయ్యింది. ఇక మొదటి వారం ఈ సినిమా 800 కే డాలర్లు వసూలు చేసింది. అలాగే రెండో వారంలో అదే జోరును కంటిన్యూ చేసింది. మొత్తానికి మూడో వారంలో 1 మిలియన్ మార్కును తాకింది. కరోనా తర్వాత యూఎస్ లో మూడువారాల్లో 1మిలియన్ మార్క్ కు చేరుకున్న తెలుగు సినిమాగా జాతిరత్నాలు రికార్డ్ క్రియేట్ చేసింది. అలాగే తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ సినిమా విజయవంతంగా ప్రదర్శించబడుతుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Lasya Manjunath: కామెడీ టైమింగ్ తో నవ్వులు పూయించిన యాంకర్ లాస్య.. రవితో కలిసి స్టేజ్ పై..

Allu Arjun: తన ఫెవరేట్ హీరోయిన్ ఎవరో చెప్పిన బన్నీ డాటర్.. సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న వీడియో…

Rang De Movie Review: అల్లరి చేష్టలతో సందడి చేసిన నితిన్ , కీర్తిసురేష్.. ‘రంగ్ దే’ మూవీ ఎలా ఉందంటే..