‘101 Jillala Andagadu’: బట్టతలతో అవసరాల శ్రీనివాస్.. ఆకట్టుకుంటున్న 101జిల్లాల అందగాడు పోస్టర్..

డిఫ‌రెంట్ కాన్సెప్ట్స్ తో తెరకెక్కుతున్న సినిమాలకు ఈ మ‌ధ్య తెలుగు ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. దీంతో కొత్త త‌రం ద‌ర్శ‌కులు వైవిధ్య‌మైన చిత్రాలు..

'101 Jillala Andagadu': బట్టతలతో అవసరాల శ్రీనివాస్.. ఆకట్టుకుంటున్న 101జిల్లాల అందగాడు పోస్టర్..
101 Jillala Andagadu Movie
Follow us
Rajeev Rayala

|

Updated on: Mar 26, 2021 | 2:29 PM

‘101 Jillala Andagadu’: డిఫ‌రెంట్ కాన్సెప్ట్స్ తో తెరకెక్కుతున్న సినిమాలకు ఈ మ‌ధ్య తెలుగు ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. దీంతో కొత్త త‌రం ద‌ర్శ‌కులు వైవిధ్య‌మైన చిత్రాలు, పాత్ర‌ల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో యంగ్ టాలెంట్‌ను ఎంక‌రేజ్ చేయ‌డానికి హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు, ద‌ర్శ‌క నిర్మాత క్రిష్ జాగ‌ర్ల‌మూడి క‌లిసి ఓ డిఫ‌రెంట్ సినిమాను రూపొందిస్తున్నారు. న‌టుడిగా, ద‌ర్శ‌కుడిగా త‌న ప్ర‌త్యేక‌త‌ను చాటుకుంటోన్న అవ‌స‌రాల శ్రీనివాస్ ప్రధాన పాత్ర‌లో రాబోతున్న సినిమా ‘101 జిల్లాల అంద‌గాడు’ . రాచ‌కొండ విద్యాసాగ‌ర్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్న ఈ చిత్రాన్ని శ్రీవెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌, ఫ‌స్ట్ ఫ్రేమ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్స్‌పై దిల్‌రాజు, డైరెక్ట‌ర్ క్రిష్ స‌మ‌ర్ప‌ణ‌లో శిరీష్, రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగ‌ర్ల‌మూడి నిర్మిస్తున్నారు. గురువారం ఈ సినిమా ఫ‌స్ట్‌లుక్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది.

ఈ ఫ‌స్ట్‌లుక్ చూస్తే అవ‌స‌రాల శ్రీనివాస్ బ‌ట్ట‌త‌ల‌తో క‌నిపిస్తున్నారు. తెలుగు సినిమాల్లో హీరోకు బ‌ట్ట‌త‌ల ఉండ‌ట‌మనేది ఇప్ప‌టి వ‌ర‌కు రాన‌టువంటి క‌థాంశం. ఇలాంటి కాన్సెప్ట్‌తో రూపొందుతోన్న `101 జిల్లాల‌ అంద‌గాడు` చిత్రంలో అవ‌స‌రాల శ్రీనివాస్ గొత్తి సూర్య నారాయ‌ణ అనే పాత్ర‌లో న‌టిస్తున్నారు. రుహ‌నీ శ‌ర్మ హీరోయిన్ గా చేస్తుంది‌. టాలీవుడ్‌లో డిఫ‌రెంట్ మూవీస్‌లో న‌టుడిగా,సెన్సిబుల్ డైరెక్ట‌ర్‌గా, రైట‌ర్‌గా త‌న‌దైన గుర్తింపు సంపాదించుకున్న అవ‌స‌రాల శ్రీనివాస్ `101 జిల్లాల‌ అంద‌గాడు` చిత్రంలో హీరోగా న‌టించ‌డ‌మే కాకుండా త‌న‌దైన కామెడీ పంచుల‌తో ప్రేక్ష‌కులు ఎంజాయ్ చేసేలా మంచి ఎంట‌ర్‌టైనింగ్ క‌థ‌ను అందించారు. రామ్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్న ఈ చిత్రానికి శ‌క్తికాంత్ కార్తీక్ సంగీతాన్ని అందిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ద‌శ‌లోఉంది.త్వరలోనే ఈ సినిమానుంచి టీజర్ రానుంది. మే 7న సినిమాను విడుద‌ల చేస్తున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Jathi Ratnalu : కలక్షన్ల రికార్డ్ క్రియేట్ చేసిన జాతిరత్నాలు … యూఎస్ లోనూ గూస్ పింపుల్ రెస్పాన్స్..

Lasya Manjunath: కామెడీ టైమింగ్ తో నవ్వులు పూయించిన యాంకర్ లాస్య.. రవితో కలిసి స్టేజ్ పై..

Allu Arjun: తన ఫెవరేట్ హీరోయిన్ ఎవరో చెప్పిన బన్నీ డాటర్.. సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న వీడియో…

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ