- Telugu News Photo Gallery Spiritual photos Holi 2021 celebrate the festival of colours with these delectable treats
Holi 2021 : నార్త్ ఇండియాలో హోలీ స్పెషల్.. సంప్రదాయ వంటలు.. తయారీ విధానం
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి, దసరా పండగల్లో తమ కుటుంబంతో సంతోషంగా గడపడమే కాదు.. స్పెషల్ వంటలను కూడా తయారు చేస్తారు.. ఇక అదే విధంగా ఉత్తరాదిలోని కొన్ని రాష్ట్రాల్లో హొలీ పండగను సెలబ్రేట్ చేసుకుంటారు. హోలీ రోజు రంగులతో పాటు నోరూరించే వంటకాల గురించి తెలుసుకుందాం..!
Updated on: Mar 27, 2021 | 6:07 AM

తాండాయ్ అనేది హొలీ రోజున తీసుకునే అత్యంత ముఖ్యమైన పానీయం. వేసవిలో దాహార్తిని తగ్గిస్తూ.. శరీరానికి సహజసిద్ధమైన చల్లదనాన్ని ఇచ్చే సంప్రదాయ పానీయం. సోంపు వాసనతో గుమాయిస్తుంది. హోళీరోజున అతిథిలకు స్నేహితులకు స్వగతం పలకడానికి ఇస్తారు.. ఐతే ప్రస్తుతం ఈ తాండాయ్ తయారీకి రెడీమేడ్ మిశ్రమాలు మార్కెట్లో లభిస్తాయి.

మాల్పువా ఒక ట్రెడిషినల్ ఇండియన్ స్వీట్ రిసిపి. దీనిని చాలా ఈజీగా ఇంట్లో ఉన్న పదార్ధాలతో తయారు చేసుకోవచ్చు.. పూరీలాంటి వంటకం. నేతిలో వేయించి, చక్కెర పాకంలో ముంచి తీస్తే.. మాల్పువా రెడీ అవుతుంది.

రాజస్థాన్ లో రంగుల కేళి తో పాటు హొలీ స్పెషల్ గా రాజస్థాన్ వంటకమైన గుజియా అనే వంటకాన్ని తయారు చేస్తారు. ఇవి తెలుగు వారు తయారు చేసే కజ్జికాయలవంటివి మనం కొబ్బరిని స్టఫ్ గా పెడితే .. రాజస్థాన్ లో కోవా, డ్రై ఫ్రూట్స్ మిశ్రమాన్ని స్టఫ్ గా పెడతారు. మైదా పిండి లేదా గోధుమపిండితో చపాతీ చేసి.. అందులో ఈ మిశ్రమాన్ని పెట్టి కజ్జికాయల్లా చుట్టి వేయిస్తారు.

ఉత్తర భారత దేశంలో చాలా ప్రఖ్యాతి గాంచిన వీధి ఆహార వంటకం. దాల్ కచోరి అనేది ఒక రుచికరమైన చిరుతిండి అని చెప్పవచ్చు, కొంత మంది కందిపప్పు తో మసాలాలు మిశ్రమంగా చేసి కచోరి ని చేస్తే.. మరికొందరు పెసర పప్పు తో మసాల మిశ్రమాన్ని స్టఫ్ గా చేసి కచోరి గా తయారు చేస్తారు.. ఇది తిన్నవారు ఎప్పటికీ కావాలని అంటారు. అంత రుచిగా ఉంటుంది దాల్ కచోరి.

హొలీ రోజున రంగులతో ఆడి ఆడి అలసిన వారికీ ఈజీగా తయారు చేసి ఇస్తారు పాపిడీ చాట్. ఇది దేశ రాజధాని ఢిల్లీకి చెందిన ఫేమస్ స్నాక్ ఐటెం. క్రిస్పీ పాపడాలు.. స్పాంజిలాంటి పునుగుల మిశ్రమంతో పాపిడి చాట్ ను తయారు చేస్తారు. అంతేకాదు వీటితోపాటు ఎండాకాలంలో హాయినిస్తూ అద్భుతమైన రుచినిచ్చే ఆల్మండ్ మలాయ్ కుల్ఫీ, బేక్ డ్ నమక్ పారా , పానీ పూరీ, సమోసా, బేక్ డ్ నమక్ పారా వంటి స్నాక్ ఐటెమ్స్ కూడా హోళీరోజున సందడి చేస్తాయి




