Banks Privatization: త్వరలో మరో నాలుగు బ్యాంకులు ప్రైవేటీకరణ.. వినియోగదారుల పరిస్థితి ఏమిటీ..?

Banks Privatization: పార్లమెంట్‌ సమావేశాల్లో భాగంగా ఫిబ్రవరి 1, 2021న బడ్జెట్‌ సందర్భంగా ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించనున్నట్లు ఆర్థిక శాఖ మంత్రి ..

Banks Privatization: త్వరలో మరో నాలుగు బ్యాంకులు ప్రైవేటీకరణ.. వినియోగదారుల పరిస్థితి ఏమిటీ..?
Banks
Follow us
Subhash Goud

|

Updated on: Mar 25, 2021 | 5:49 PM

Banks Privatization: పార్లమెంట్‌ సమావేశాల్లో భాగంగా ఫిబ్రవరి 1, 2021న బడ్జెట్‌ సందర్భంగా ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించనున్నట్లు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామణ్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఆ సమయంలో ఆ నాలుగు బ్యాంకుల పేర్లను వెల్లడిచంకపోయినా.. బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఇండియా ఓవర్సీస్‌ బ్యాంక్‌, సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాను ప్రభుత్వం ప్రైవేటీకరించనున్నట్లు సమాచారం. అయితే ఈ నాలుగు బ్యాంకులు 2021-22 ఆర్థిక సంవత్సరంలో ప్రైవేటీకరించనున్నాయి. ఈ బ్యాంకులపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కాగా, బ్యాంకింగ్‌ రంగంలో మొదటి దశ, ప్రైవేటీకరణలో కేంద్ర ప్రభుత్వం పెట్టుబడులు పెట్టడంపై ఎక్కువ దృష్టి సారించింది. ప్రభుత్వ బ్యాంకుల్లో వాటాను విక్రయించడం ద్వారా ఆదాయాన్ని పెంచాలని, ఆ డబ్బును ప్రభుత్వ పథకాలపై ఉపయోగించాలని కేంద్రం భావిస్తోంది. 2021-22లో పెట్టుబడుల నుంచి రూ.1.75 లక్షల కోట్లు సేకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే దేశంలో రెండో అతిపెద్ద చమురు సంస్థ భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (బీపీసీఎల్‌)లో తన మొత్తం వాటాను విక్రయించాలని ప్రభుత్వం భావిస్తోంది.

వినియోగదారులకు ఎలాంటి నష్టం ఉండదు

బ్యాంకుల ప్రైవేటీకరణ కారణంగా వినియోగదారుల్లో కొంత ఆందోళన వ్యక్తం అవుతోంది. దీని వల్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, బ్యాంకు కస్టమర్లకు ఎలాంటి నష్టం ఉండదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఈ నాలుగు బ్యాంకుల్లో ప్రస్తుతం 2.22 లక్షల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్రలో తక్కువ మంది సిబ్బంది ఉన్నందున దాని ప్రైవేటీకరణ సులభంగా ఉండవచ్చని సంబంధిత వర్గాలు భావిస్తున్నాయి. అయితే బ్యాంకులను ప్రైవేటీకరణ చేయడంపై బ్యాంకర్లు గత రెండు రోజులుగా సమ్మె చేపట్టారు. ప్రైవేటీకరణ చేయవద్దని వారు డిమాండ్‌ చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల తాము ఉద్యోగాలు పోయే పరిస్థితి ఉంటుందని బ్యాంకింగ్‌ సేవలు మునుపటిలాగే కొనసాగించాలని వారు కోరుతున్నారు. అయితే ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణపై ప్రభుత్వంతో చర్చిస్తున్నామని ఈ సందర్భంగా రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్‌ శక్తికాంతదాస్ గురువారం అన్నారు.

ఇవీ చదవండి: ICICI Bank EMI: కస్టమర్లకు శుభవార్త చెప్పిన ఐసీఐసీఐ బ్యాంకు.. రూ.50 వేల నుంచి రూ.5 లక్షల వరకు ఈఎంఐ సదుపాయం

Personal Loan: కరోనా కాలంలో వేటి కోసం ఎక్కువగా రుణాలు తీసుకున్నారో తెలుసా..?.. తాజా రిపోర్టు

Health Check-up Benefits: మార్చి 31లోపు ఇలా చేయండి.. రూ.50 వేల వరకు ప్రయోజనం పొందే అవకాశం..!