Health alert: ఈ ప్రాణాంతక వ్యాధుల నుంచి రక్షణ పొందండిలా!
భారతదేశంలో చాలా మంది రోగనిరోధక శక్తిని పెంచే వ్యాక్లిన్లను తీసుకోకపోవడంపై కేంద్ర ప్రభుత్వ తాజా నివేదికలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. HPV, Hepatitis B, Influenza, COVID-19 లాంటి వ్యాధుల నుంచి రక్షణ పొందేందుకు అవసరమైన వ్యాక్సిన్లను పిల్లలు, యువత, వయో వృద్ధులకు కూడా పూర్తిస్థాయిలో అందడం లేదని పేర్కొంది. ప్రతీ ఒక్కరికీ వ్యాక్సినేషన్ అవసరాన్ని నొక్కి చెప్పింది.

భారతదేశంలో చాలా మంది పలు ప్రమాదకరమైన వ్యాధులను అరికట్టే వ్యాక్సిన్లను తీసుకోవడం లేదని కేంద్ర ప్రభుత్వ తాజా నివేదిక వెల్లడించింది. HPV, Hepatitis B, Influenza, COVID-19 లాంటి వ్యాధుల నుంచి రక్షణ పొందేందుకు అవసరమైన వ్యాక్సిన్లను పిల్లలు, యువత, వయో వృద్ధులకు కూడా పూర్తిస్థాయిలో అందడం లేదని పేర్కొంది. దీంతో వారిలో ఆయా వ్యాధులను ఎదుర్కొనే రోగనిరోధక శక్తి తగ్గిపోతోందని తెలిపింది.
సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఇన్ ఆఫర్డబుల్ హెల్త్ కేర్(CoE-AH), ఐఐటీ ఖరగ్‌పూర్, ఉమెన్స్ కలెక్టివ్ ఫోరమ్(WCF) నివేదకల ప్రకారం.. దేశంలో పెరుగుతున్న యువత, వయో వృద్ధులు తమకు అవసరైన వ్యాక్సిన్లు తీసుకోకపోవడంతో పలు ప్రమాదకరమైన వ్యాధుల నుంచి రక్షణ పొందలేకపోతున్నారు. ఈ వ్యాక్సిన్లు తీసుకోవడం వల్ల వ్యాధి నిరోధక పెరిగి వారంతా ఆరోగ్యంగా ఉంటారని, జీవన ప్రమాణం మెరుగుపడుతుందని పేర్కొంది.
వ్యాక్సిన్ల పంపిణీ మెరుగైనప్పటికీ..
ఇటీవల కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా విడుదల చేసిన నివేదిక కూడా ఇదే విషయాన్ని చెప్పింది. జాతీయస్థాయి రోగ నిరోధక విధానాలు, క్షేత్రస్థాయిలో కార్యక్రమాల అమలు మధ్య అంతరం ఎక్కువగా ఉందని పేర్కొంది. కార్యక్రమాల కార్యాచరణ, వేగం, స్పష్టత లోపిస్తున్నాయని వివరించింది. దేశంలో ఇటీవలి జీరో-డోస్ పథం ప్రోత్సాహకరంగా ఉన్నప్పటికీ.. పూర్తిస్థాయిలో అమలు కావడం లేదని తెలిపింది. కాగా, భారతదేశంలో 2021 నుంచి 2022 మధ్య కాలంలో ఎలాంటి టీకాలు తీసుకోని పిల్లల సంఖ్య 2.7 మిలియన్ల నుంచి 1.1 మిలియన్లకు తగ్గింది.
సరికొత్త కార్యక్రమాలు అవసరం
వ్యాక్సిన్ల ప్రాముఖ్యతను తెలియజేసేందుకు అనేక ప్రోత్సాహక కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉందని ఆ నివేదిక గుర్తు చేసింది. ప్రినేటర్ కేర్, కౌమార ఆరోగ్య కార్యక్రమాలు, ఆఫీసుల్లో హెల్త్ చెకప్‌లు వయోజన వ్యాక్సిన్లు ఇచ్చేందుకు ఉపయోగపడతాయని తెలిపింది. తల్లిదండ్రులు, టీచర్లు, సంస్థల యాజమాన్యాలు, ఆరోగ్య కార్యకర్తలను భాగస్వాములను చేసుకుని ప్రచారాలను నిర్వహించాలని నిపుణులు పిలుపునిస్తున్నారు. అన్ని వయసుల వారికి వ్యాక్సిన్లు అందించే నేషనల్ లైఫ్ కోర్సు ఇమ్యునైజేషన్ స్ట్రాటజీని అభివృద్ధి చేయడం, అమలు చేయడం వంటి స్పష్టమైన విధాన సిఫార్సులను చేస్తున్నారు. జీవిత కాలంపాటు వ్యాక్సిన్ డెలివరీ కోసం ఆయుష్మాన్ భారత్-హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లు, పాఠశాలలు, కాలేజీలు, యాంటెనటల్ క్లినిక్‌లు వంటి ప్రస్తుత ప్రస్తుత ప్లా్ట్‌ఫాంలను ఉపయోగించుకోవాలని సూచిస్తున్నారు. అంతేగాక, ఆరోగ్య విద్యను పాఠ్యాంశాల్లో తప్పనిసరి చేయాలని నివేదిక స్పష్టం చేసింది.