AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Megastar Chiranjeevi: ప్రభాస్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు చిరంజీవి సినిమాలో ఇలా.. అమ్మడు ఎవరంటే..

ఇటీవల సంక్రాంతి పండక్కి మెగాస్టార్ చిరంజీవి మన శంకర వర ప్రసాద్ గారు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమా భారీ హిట్ అవ్వడంతో సినిమాలో నటించిన వాళ్ళు కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఈ అమ్మడు నెట్టింట స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది.

Megastar Chiranjeevi: ప్రభాస్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు చిరంజీవి సినిమాలో ఇలా..  అమ్మడు ఎవరంటే..
Sai Priya Reddy
Rajitha Chanti
|

Updated on: Feb 13, 2026 | 6:42 PM

Share

ఈ ఏడాది ప్రారంభంలోనే బ్లాక్ బస్టర్ హిట్టు అందుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. సంక్రాంతి పండగ సందర్భంగా విడుదలైన మన శంకరవరప్రసాద్ గారు మూవీ భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి నటించిన ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమాకు అడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఈ మూవీ ఫిబ్రవరి 11 నుంచి జీ5 తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది. సంక్రాంతికి థియేటర్లోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేసింది. దాదాపు 350 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి రీజనల్ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఇందులో నయనతార కథనాయికగా నటించింది. అయితే ఈ చిత్రంలో కనిపించిన ప్రతి పాత్రకి ఆడియెన్స్ రియాక్ట్ అయ్యారు. ప్రతీ కారెక్టర్‌కి కనెక్ట్ అయ్యారు. ఇక ఈ సినిమాలో ఆరంభం నుంచి చివరి వరకు ఓ సీరియల్ నడుస్తుంది. ఆ సీరియల్ హీరోయిన్‌గా సౌమ్య పాత్రలో మెప్పించింది.

ఎక్కువమంది చదివినవి : Actor : సూపర్ స్టార్ కొడుకు.. అయినా అవకాశాలు ఇవ్వలేదు.. ఒక్క సినిమాతో ఇండస్ట్రీనే షేక్ చేశాడు..

అసలు విషయానికి వస్తే.. మన శంకర వర ప్రసాద్ కారెక్టర్‌లో చిరంజీవి ఆ సీరియల్ గురించి, ఆ సీరియల్‌లోని పాత్రల గురించి చెబుతూ ఉండటం.. అతని జీవితాన్ని రిప్లెక్ట్ చేస్తున్నట్టుగా ఆ సీరియల్ సాగడం.. ఇలా ఆ ట్రాక్ ఎంత ఫన్నీగా వర్కౌట్ అయిందో చెప్పాల్సిన పని లేదు. ఆ సీరియల్‌‌లో కనిపించిన నటికి కూడా ఇప్పుడు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. సోషల్ మీడియాలో సదరు నటి కోసం అందరూ తెగ సెర్చ్ చేస్తున్నారు.

ఎక్కువమంది చదివినవి : Jabardasth: జబర్దస్త్ మానేసి తప్పు చేశాను.. మాటలు నమ్మి అలా జరిగింది.. జబర్దస్త్ కమెడియన్..

ఈ సినిమాలోని సీరియల్‌లో సౌమ్య పాత్రలో నటించిన అమ్మాయి ఇప్పుడు నెట్టింట చర్చనీయాంశంగా మారింది. ఆమె పేరు సాయి ప్రియా రెడ్డి. చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీలోకి వచ్చింది.తెలుగులో క్షేత్రం, నందీశ్వరుడు, పూలరంగడు, రెబెల్, మిర్చి, తడాఖా, జీనియస్, లక్కీ ఇలా చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎన్నో చిత్రాల్ని నటించింది. ఆ తరువాత యూట్యూబ్‌లో సిరీస్‌లు కూడా చేసి మంచి పేరుని సంపాదించుకుంది.

ఇక రీసెంట్‌గా వచ్చిన విశ్వక్ సేన్ లైలా చిత్రంలోనూ కీలకపాత్రలో నటించింది. అందులో హీరోయిన్ ఫ్రెండ్ పాత్రలో మెరిచింది ఈ ముద్దుగుమ్మ. సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఉన్న బ్యూటీకి ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి చిత్రంలో మంచి పాత్ర దక్కిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఈ అమ్మడు పేరు నెట్టింట మారుమోగుతుంది. ఇక ముందు ఈ బ్యూటీకి టాలీవుడ్‌లో అవకాశాలు పెరిగేలా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ పలు ప్రాజెక్టులో భాగస్వామి అయినట్టుగా సమాచారం.

ఎక్కువమంది చదివినవి : Folk Song : ఏం పాటరా బాబూ.. కుర్రాళ్లు తెగ పాడుతున్న ఫోక్ సాంగ్.. దెబ్బకు యూట్యూబ్‏లో సంచలనంగా మారింది..

Follow Us