AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కొబ్బరి పాల చికెన్ కర్రీ.. అద్భుతమైన రుచి.. వేడివేడిగా తింటే అద్దిరిపోతుంది!

కొబ్బరి పాల చికెన్ కర్రీ వినడానికి కొత్తగా విన్నా చేసుకుని తింటే టేస్ట్ అదిరిపోతోంది. ఎందుకంటే, కొందరికి కొత్త కొత్త వంటకాలు తినాలనిపిస్తూ ఉంటుంది. అలాంటి వారు కొబ్బరి పాల చికెన్ కర్రీ ట్రై చేసేయండి. మరి, ఇంకెందుకు లేట్ దీనికి కావాల్సిన పదార్ధాలు, తయారీ విధానం గురించి ఇక్కడ చూద్దాం..

Prasanna Yadla
|

Updated on: Feb 13, 2026 | 6:48 PM

Share
కావాల్సిన పదార్ధాలు: అర కిలో చికెన్, ఒక కప్పు కొబ్బరి పాలు, చిన్న ఉల్లిపాయలు 2, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 3 పచ్చి మిర్చి, కరివేపాకు, అర టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్స్ కారం తీసుకోవాలి.

1 / 5
ముందుగా  చికెన్‌ను నీళ్ళతో కడిగి శుభ్రపరచుకోవాలి. ఇంకా నీసు వాసన వస్తే మళ్ళీ ఇంకోసారి బాగా అడగండి. ఆ తర్వాత దానిలో పసుపు, ఉప్పు, మిరియాల పొడిని వేసి 20 నిమిషాలు గిన్నెలో నానబెట్టుకోవాలి.

ముందుగా చికెన్‌ను నీళ్ళతో కడిగి శుభ్రపరచుకోవాలి. ఇంకా నీసు వాసన వస్తే మళ్ళీ ఇంకోసారి బాగా అడగండి. ఆ తర్వాత దానిలో పసుపు, ఉప్పు, మిరియాల పొడిని వేసి 20 నిమిషాలు గిన్నెలో నానబెట్టుకోవాలి.

2 / 5

ఆ తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టి దానిలో ఆయిల్ వేసి  అది వేడయ్యాక జీలకర్ర, కరివేపాకు, ఉల్లిపాయలు ముక్కలు, పచ్చిమిర్చి వేసి రంగు మారే వరకు బాగా వేయించాలి.

ఆ తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టి దానిలో ఆయిల్ వేసి అది వేడయ్యాక జీలకర్ర, కరివేపాకు, ఉల్లిపాయలు ముక్కలు, పచ్చిమిర్చి వేసి రంగు మారే వరకు బాగా వేయించాలి.

3 / 5

అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఆ తర్వాత దానిలో ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ ముక్కలు వేసి 10 నిమిషాల పాటు  బాగా ఉడికించాలి.
చికెన్ ఉడికిన తర్వాత  పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, ఉప్పు వేసి పది  నిమిషాల పాటు ఉడికించాలి.

అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఆ తర్వాత దానిలో ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ ముక్కలు వేసి 10 నిమిషాల పాటు బాగా ఉడికించాలి. చికెన్ ఉడికిన తర్వాత పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, ఉప్పు వేసి పది నిమిషాల పాటు ఉడికించాలి.

4 / 5
చికెన్ ఉడికిన తర్వాత కొబ్బరి పాలు పోసి 15 నిముషాల పాటు  అలాగే స్టవ్ మీద ఉంచి  నూనె పైకి  తేలే వరకు ఉంచి దించేయండి. చివర్లో  కొత్తిమీర వేసి కిందకు దించేయండి. అంతే  కొబ్బరిపాల చికెన్ కూర రెడీ.

చికెన్ ఉడికిన తర్వాత కొబ్బరి పాలు పోసి 15 నిముషాల పాటు అలాగే స్టవ్ మీద ఉంచి నూనె పైకి తేలే వరకు ఉంచి దించేయండి. చివర్లో కొత్తిమీర వేసి కిందకు దించేయండి. అంతే కొబ్బరిపాల చికెన్ కూర రెడీ.

5 / 5