Tea & Health Risks: టీ ప్రియులకు హెచ్చరిక.. ఇలా తాగితే పాము విషం తాగినట్లే!
ఉదయం నిద్రలేవగానే ఘుమఘుమలాడే కప్పు వేడి వేడి టీ తాగడం చాలా మందికి అలవాటు. టీ కేవలం పానీయం మాత్రమే కాదు, చాలా మందికి ఇదొక ఎమోషన్. అయితే ఇదే టీ ప్రస్తుతం ఆరోగ్యానికి పెద్ద ముప్పుగా మారుతోందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే..

తాజా అధ్యయనాల ప్రకారం టీ తయారు చేసిన 15 నుంచి 20 నిమిషాలలోపు తాగాలని చెబుతున్నాయి. ఆ తర్వాత టీ తాగడం వల్ల కాలేయం, జీర్ణవ్యవస్థ దెబ్బతింటుందట. అలాగే చాలా మందికి ఒకసారి తయారు చేసిన టీ మళ్లీ మళ్లీ వేడి చేసి తాగడం అలవాటు. ఇలా మీరూ టీ తాగుతారా…? ఈ అలవాటు మీ ఆరోగ్యానికి ఎంత ప్రమాదకరమో తెలిస్తే ఎప్పటికీ టీ ముట్టుకోరని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇది మీ ఆరోగ్యానికి ఎలాంటి సమస్యలను కలిగిస్తుందో, ఈ అలవాటు ఎందుకు మంచిది కాదో ఇక్కడ తెలుసుకుందాం..
సాధారణంగా టీ తయారుచేసిన తర్వాత మిగిలిపోయిన పానియంలో బ్యాక్టీరియాకు సంతానోత్పత్తి ప్రదేశంగా మారుతుందని పరిశోధకులు హెచ్చరించారు. అందుకే జపాన్, చైనా వంటి దేశాలలో నిల్వ చేసిన టీని విషం వలె హానికరం అని భావిస్తున్నారు. 24 గంటలకు పైగా నిల్వ చేసిన టీ తాగడం పాముకాటు కంటే ప్రమాదకరమని జపనీయులు అంటున్నారు. చైనాలో నిల్వ చేసిన టీని అస్సలు ముట్టుకోరు.
పాలు కలిపిన టీ తాగితే..
సాధారణంగా పాలు త్వరగా చెడిపోతాయి. పాలతో తయారుచేసిన టీని గది ఉష్ణోగ్రత వద్ద రెండు గంటలకు మించి ఉంచకూడదు. ఫ్రిజ్‌లో ఉంచితే ఒకటి నుండి మూడు రోజులు నిల్వ చేయవచ్చు. కానీ టీ మళ్లీ మళ్లీ వేడి చేయడం వల్ల పోషకాలు నశిస్తాయి. అంతే కాదు ఆమ్లత్వం కూడా పెరుగుతుంది.
అల్లం టీని మళ్ళీ వేడి చేసి తాగవచ్చా?
అల్లం టీ పాలు లేకుండా తాగడం సురక్షితం. రిఫ్రిజిరేటర్‌లో నిల్వ చేస్తే అది మూడు నుంచి ఐదు రోజుల వరకు ఉంటుంది. కానీ తాగే ముందు బాగా మరిగించాలి. టీ రంగు మారితే లేదా దుర్వాసన వస్తే దానిని తాగకూడదు. అయితే రోజుకు 4 నుంచి 5 గ్రాముల కంటే ఎక్కువ అల్లం తీసుకోవడం వల్ల కొంతమందిలో గుండెల్లో మంట వస్తుంది.
ఆయుర్వేదం ఏం చెబుతుంది?
ఆయుర్వేదం ప్రకారం టీని నిల్వ చేయడం, మళ్లీ వేడి చేయడం వల్ల శరీరంలో విష పదార్థాలు ఉత్పత్తి అవుతాయి. అంతే కాదు జీర్ణక్రియ కూడా నెమ్మదిస్తుంది. టీని పదే పదే మరిగించడం వల్ల దానిలోని ప్రోటీన్లు నాశనం అవుతాయి. తద్వారా ఆమ్లత్వం, మంట వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి మీరు టీ తాగాలని భావిస్తే ప్రతిసారీ తాజాగా తయారు చేసుకోవడం ఆరోగ్యకరమైన పద్ధతి.
మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్ చేయండి.




