ఈ ఒక్క సైకాలజీ ట్రిక్‌తో మీ శత్రువులను మిత్రులుగా మార్చుకోండి!
స్కూల్, కాలేజీ, జాబ్, బంధువులు, కుటుంబసభ్యులు ఇలా ఎక్కడైనా ఎవరో ఒకరికి మరొకరు నచ్చకుండా ఉంటారు. వారి మధ్య శత్రుత్వం ఉంటుంది. అయితే, వారి మధ్య ఉన్న శత్రుత్వాన్ని తగ్గించే ప్రయత్నం చేయకపోతే అది అలాగే ఉండిపోతుంది. అందుకే బెన్ ఫ్రాంక్లిన్ ఎఫెక్ట్ ప్రకారం వారితో వ్యవహరించి వారిని మన మిత్రులుగా చేసుకోవచ్చు.

చాలా మందికి ఇతరులను తమకు అనుకూలంగా ఎలా మార్చుకోవాలనే విషయం తెలియదు. అందుకే, ఎవరినైనా సహాయం అడగాలంటే తటపటాయిస్తుంటారు. ఇక శత్రువుల నుంచి సహాయం తీసుకోవడం అంటే అది వారికి అసాధ్యమే అవుతుంది. కానీ, కొన్ని సైకాలజీ ట్రిక్స్ ఉపయోగిస్తే మనం మన శత్రువులను కూడా మిత్రులుగా మార్చుకోవచ్చు. ఇందుకు బెన్ ఫ్రాంక్లిన్ ప్రభావాన్ని ఉదాహరణగా తీసుకోవచ్చు.
ఈ థియరీ ప్రకారం మనం ఎవరినైనా సహాయం అడిగితే.. వాళ్లు మనల్ని ఎక్కువగా ఇష్టపడటం ప్రారంభిస్తారు. ఇది కొంచెం కొత్తగా అనిపించినా చాలా సందర్భాల్లో జరిగేది ఇదే. ఆ విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
బెన్ ఫ్రాంక్లిన్ అనే వ్యక్తికి ఓ శత్రువు ఉండేవాడు. ఆ వ్యక్తికి బెన్ ఫ్రాంక్లిన్ అస్సలు నచ్చడు. ఈ క్రమంలో బెన్ ఫ్రాంక్లిన్ తన శత్రువు మనసు మార్చాలనుకున్నాడు. బెన్ అతని దగ్గరికి వెళ్లి ఫైట్ చేయలేదు. అతడ్ని ప్రశంసించనూ లేదు. బదులుగా.. అతను తన శత్రువును తనకు ఒక పుస్తకం ఇవ్వాలని కోరాడు. దీంతో ఆ శత్రువు మొదట అయోమయంలో పడ్డాడు. చాలా మంది ఉన్నప్పుడు అతను మన నుంచి సహాయం అడుగుతున్నాడని భావించాడు. చేసేదేం లేక బెన్ ఫ్రాంక్లిన్‌కు పుస్తకాన్ని ఇచ్చాడు.
ఇక, బెన్ ఫ్రాంక్లిన్ ఆ పుస్తకాన్ని చదివి తిరిగి అతనికి ఇస్తాడు. ఈ సమయంలో తాను తీసుకున్న పుస్తకానికి ధన్యవాదాలు అనే నోట్ కూడా జత చేస్తాడు. దీంతో బెన్ శత్రువులో సానుకూల ఆలోచనలు మొదలయ్యాయి. ఆ క్షణం తర్వాత వారి మధ్య సంబంధం మారిపోయింది. ఇద్దరు స్నేహితులుగా మారిపోయారు. దీన్నే బెన్ ఫ్రాంక్లిన్ ప్రభావమని అంటారు. మనం ఇష్టపడని వ్యక్తులకు మనం ఎప్పుడూ కూడా సహాయం చేయం. కానీ, మనం ఆ అలవాటును మానుకుని వారికి సహాయం చేస్తే.. మన మెదడు వారి గురించి మనం ఆలోచించే విధానాన్ని మారుస్తుంది.
మన మెదడు మనం వాళ్లని ఇష్టపడుతున్నామని, అందుకే వాళ్లకి సహాయం చేశామని అనుకునేలా చేస్తుంది. ఇది కొంత ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ చాలా సందర్భాల్లో ఇదే జరుగుతుంది. మనలో చాలా మంది ఇతరుల సహాయం అడిగితే వాళ్లు మనల్ని ఇష్టపడరని అనుకుంటారు. అందుకే మనకు అవసరం ఉన్నప్పుడు సహాయం అడగము. కానీ, బెన్ ఫ్రాంక్లిన్ ప్రభావం దానికి భిన్నంగా చెబుతుంది.
ఈసారి మిమ్మల్ని ఎవరినైనా ఇష్టపడాలని కోరుకుంటే.. వారిని చిన్న చిన్న సహాయాలు అడగండి. ఉదాహరణకు ఈ రెండు దుస్తుల్లో మీకు ఏదీ బాగా నచ్చింది? హెయిర్ కట్ ఎలా వుంది? వంటి ప్రశ్నలు అడిగి వారి అభిప్రాయాన్ని తీసుకోండి. జీవితంలో మీకు ఏవైనా సందేహాలు ఉంటే.. వారి వద్దకు వెళ్లి అడగండి. అప్పుడప్పుడు పెన్ను లేదా పుస్తకాన్ని అడిగి తీసుకోండి. మీ కోసం ఒక చిన్న పని చేయమని కోరండి. మీరు ఇలా చేసినప్పుడు వారు మిమ్మల్ని ఎక్కువగా ఇష్టపడతారు. వీటిని ఒకసారి ప్రయత్నించి చూడండి మీకే తెలిసిపోతుంది.