AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Farmers: రైతులకు కేంద్ర ప్రభుత్వం తీపికబురు.. వాటికి లైన్ క్లియర్.. అందనున్న మరింత నగదు

రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. రైతులకు ఉపయోగపడేలా కీలక నిర్ణయం తీసుకుంది. గోధుములు, చిక్కెర ఎగుమతులకు అనుమతి ఇచ్చింది. దీంతో రైతులకు రాబడి పెరగనుంది. 2022లో కేంద్రం వీటి అనుమతులపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మళ్లీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Farmers: రైతులకు కేంద్ర ప్రభుత్వం తీపికబురు.. వాటికి లైన్ క్లియర్.. అందనున్న మరింత నగదు
Farmers
Venkatrao Lella
|

Updated on: Feb 13, 2026 | 9:08 PM

Share

రైతులకు కేంద్ర ప్రభుత్వం పెద్ద ఉపశమనం కలిగించే నిర్ణయం తీసుకుంది. గోధుములు, చక్కెర ఎగుమతులకు ఆమోదం తెలిపింది. 2.5 మిలియన్ టన్నుల గోధులు, 0.58 మిలియన్ టన్నుల చక్కెర ఎగుమతులు చేసేందుకు అనుమతి ఇచ్చింది. రికార్డ్ స్థాయిలో వీటి నిల్వలు, ఉత్పత్తి ఉండటంతో రైతులకు మెరుగైన ధరలు రావడం, దేశీయ మార్కెట్‌ను సమతుల్య చేసేందుకు తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. గోధుములు, చక్కెర ఉత్పత్రుల్లో భారత్ రెండో అతిపెద్ద ఉత్పత్తిదారుగా ఉంది. దీంతో రైతులకు మరింత ప్రయోజనం కలిగించేందుకు ఎగుమతులకు అనుమతి ఇచ్చింది.

పాక్షింగా ఇప్పటికే ఆమోదం

గత నెలలోనే పాక్షికంగా ఎగుమతులకు కేంద్రం ఆమోదం ఇచ్చింది. గత నెలలో 5 లక్షల టన్నుల గోధుమ పిండి, ఇతర గోధుమ ఉత్పత్తులను ఎగుమతి చేయడానికి అనుమతించింది. నవంబర్, అక్టోబర్‌లో ప్రారంభమైన కొత్త సీజన్ 1.5 మిలియన్ టన్నుల చక్కెర ఎగుమతులను అనుమతిస్తున్నట్లు ప్రకటన జారీ చేసింది. ఈ ఎగుమతుల వల్ల రైతులు మంచి రాబడి పొందగలుగుతారు. అలాగే మార్కెట్ సమతుల్యత ఏర్పడుతుందని కేంద్రం భావిస్తోంది. అయితే అంతర్జాతీయ ధరల కంటే భారత గోధుముల ధరలు అధికంగా ఉన్నాయి. భరత గోధుములు టన్నుకు 280 డాలర్లుగా ఉండగా.. అర్జెంటీనా గోధుములు టన్నుకు 200 డాలర్లకే లభిస్తున్నాయి. గోధుములను కొనుగోరలు చేసే బంగ్లాదేశ్ టన్నుకు 260 డాలర్లు వేచ్చిస్తోంది. దీంతో ఎగుమతులకు అధిక ధరలు సవాల్‌గా మారాయి.

గోధుములపై నిషేధం

గోధుములపై 2022లో కేంద్రం నిషేధం విధించింది. 2024 వరకు దీనిని పొడిగించారు. పంట దెబ్బతినడంతో దేశంలో ధరలు రికార్డ్ స్థాయికి చేరుకున్నాయి. 2025లో ఉత్పత్తి భారీగా పెరిగింది. 2025లో 117.9 మిలియన్ మెట్రిక్ టన్నుల గోధుమలు ఉత్పత్తి అయ్యాయి. ఈ సంవత్సరం తగినంత నిల్వలు ఉన్నందున ఎగుమతులకు అనుమతులు ఇవ్వడం రైతులకు ప్రయోజనం చేకూర్చుతుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.