AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anti-Valentine Week 2026: ఫిబ్రవరి 15 నుంచి ‘యాంటీ వాలెంటైన్స్ వీక్’ సందడి.. స్లాప్ డే నుంచి బ్రేకప్ డే వరకు

ప్రతి ఏడాది ఫిబ్రవరి 7 నుంచి 14 వరకు ప్రపంచమంతా ఎర్రటి గులాబీలు, ప్రేమ సందేశాలతో రొమాంటిక్ గా కనిపిస్తుంది. కానీ అందరికీ ప్రేమ కథలు సక్సెస్ అవ్వాలని లేదు కదా? ప్రేమలో విఫలమైన వారు, టాక్సిక్ బంధాలతో విసిగిపోయిన వారు లేదా ఒంటరిగా ఉండటమే ఇష్టమని భావించే వారి కోసం ఒక ప్రత్యేక వారం ఉంది.

Anti-Valentine Week 2026: ఫిబ్రవరి 15 నుంచి ‘యాంటీ వాలెంటైన్స్ వీక్’ సందడి.. స్లాప్ డే నుంచి బ్రేకప్ డే వరకు
Anti Valentine Week.jpg
Nikhil
|

Updated on: Feb 13, 2026 | 8:49 PM

Share

అదే ‘యాంటీ వాలెంటైన్స్ వీక్’. వాలెంటైన్స్ డే ముగిసిన మరుసటి రోజు అంటే ఫిబ్రవరి 15 నుంచి ఈ వేడుకలు మొదలవుతాయి. ఇది ప్రేమను ద్వేషించడం కోసం కాదు, మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం కోసం.. గతాన్ని వదిలిపెట్టి కొత్తగా జీవితాన్ని ప్రారంభించడం కోసం జరుపుకునే వారం. మరి ఈ వారంలో ఏ రోజుకు ఏ ప్రాముఖ్యత ఉందో, యువత ఎందుకు దీనికి ఇంతలా కనెక్ట్ అవుతున్నారో వివరంగా తెలుసుకుందాం..

కృత్రిమమైన ప్రేమ వేడుకలను ఇష్టపడని వారు ఈ వారాన్ని ఎంజాయ్ చేస్తారు. ముఖ్యంగా బ్రేకప్ తర్వాత బాధలో ఉండేవారు, తమ ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటూ ముందుకు సాగడానికి ఈ రోజులు ఒక మానసిక ఊరటనిస్తాయి. నెగటివిటీని తరిమికొట్టి, స్వతంత్రంగా ఉండటాన్ని సెలబ్రేట్ చేసుకోవడమే దీని ముఖ్య ఉద్దేశం.

యాంటీ వాలెంటైన్స్ వీక్

స్లాప్ డే – ఫిబ్రవరి 15

ఇది ఎవరినో శారీరకంగా కొట్టడం గురించి కాదు. మిమ్మల్ని బాధించిన చేదు జ్ఞాపకాలకు, మిమ్మల్ని తక్కువ చేసిన వ్యక్తులకు ప్రతీకాత్మకంగా ఒక ‘చెంప దెబ్బ’ కొట్టి గతాన్ని వదిలేయడం. మీ ఆత్మగౌరవం కోసం నిలబడటమే ఈ రోజు ఉద్దేశం.

కిక్ డే – ఫిబ్రవరి 16

మీ జీవితం నుంచి నెగటివిటీని, నకిలీ స్నేహితులను, భారంగా మారిన బంధాలను తన్ని తరిమేయడమే ఈ రోజు ప్రత్యేకత. నొప్పిని ఇచ్చే జ్ఞాపకాల కంటే మనశ్శాంతే ముఖ్యం అని ఈ రోజు గుర్తు చేస్తుంది.

పెర్ఫూమ్‌ డే – ఫిబ్రవరి 17

పరిమళం మనసుకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. మీకు ఇష్టమైన పెర్ఫ్యూమ్ ధరించి, పాజిటివ్ ఆలోచనలతో కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి ఇది చిహ్నం. మీ వ్యక్తిత్వాన్ని కొత్తగా ఆవిష్కరించుకోవడానికి ఈ రోజు నాంది పలుకుతుంది.

ఫ్లర్ట్ డే – ఫిబ్రవరి 18

ఎలాంటి ఎమోషనల్ ఒత్తిడి లేకుండా ఇతరులతో సరదాగా మాట్లాడటం, ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడం ఈ రోజు ఉద్దేశం. లైఫ్ ను సీరియస్ గా కాకుండా హ్యాపీగా ఎంజాయ్ చేయాలని ఇది చెబుతుంది.

కన్ఫెషన్ డే – ఫిబ్రవరి 19

మనసులో దాచుకున్న నిజాలను బయటపెట్టడం వల్ల భారం తగ్గుతుంది. ఎవరికైనా ఏదైనా చెప్పాలన్నా లేదా మీ తప్పులను ఒప్పుకోవాలన్నా ఈ రోజు సరైన సమయం. దీనివల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది.

మిస్సింగ్ డే – ఫిబ్రవరి 20

ఒక వ్యక్తిని లేదా గతాన్ని మిస్ అవ్వడం సహజం. ఆ బాధను అణచుకోకుండా, అనుభూతి చెంది.. దాన్ని అధిగమించడానికి ఈ రోజు ప్రయత్నించాలి. గతం నుంచి కోలుకోవడానికి ఇది ఒక మెట్టు.

బ్రేకప్ డే – ఫిబ్రవరి 21

యాంటీ వాలెంటైన్స్ వీక్ లో చివరి రోజు. బాధాకరమైన బంధాలకు పూర్తిస్థాయిలో ముగింపు పలికి, స్వీయ ప్రేమతో సరికొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టడమే ఈ రోజు సందేశం.

ఎందుకు జరుపుకోవాలి?

చాలామంది తమ మానసిక ఆరోగ్యం కోసం, బ్రేకప్ పెయిన్ నుంచి బయటపడటం కోసం ఈ వారాన్ని ఎంచుకుంటారు. స్నేహితులతో సమయం గడపడం, పర్సనల్ గోల్స్ పై దృష్టి పెట్టడం, మనల్ని మనం ప్రేమించుకోవడం వంటి పనులు ఈ వారంలో చేయాలి. రిలేషన్‌షిప్ లో లేకపోయినా మనం హ్యాపీగా ఉండగలమని నిరూపించడమే ఈ వారం ఇచ్చే అసలైన కిక్. యాంటీ వాలెంటైన్స్ వీక్ అనేది కేవలం సరదా కోసం మాత్రమే కాదు, అది ఒక ఎమోషనల్ హీలింగ్ ప్రాసెస్. ప్రేమ కంటే ఆత్మగౌరవం, మనశ్శాంతి గొప్పవని నమ్మే ప్రతి ఒక్కరికీ ఈ వారం ఒక పండగ లాంటిది.

భారత్, పాకిస్తాన్ పోరు.. హెడ్ టు హెడ్ రికార్డుల్లో తోపు ఎవరు?
భారత్, పాకిస్తాన్ పోరు.. హెడ్ టు హెడ్ రికార్డుల్లో తోపు ఎవరు?
చీరకట్టులో స్టన్నింగ్ ఫోజులతో గ్లామర్ బ్యూటీ..
చీరకట్టులో స్టన్నింగ్ ఫోజులతో గ్లామర్ బ్యూటీ..
వాలెంటైన్స్ డే తర్వాత వచ్చే ఈ 7 రోజులు ఎంతో ముఖ్యం..
వాలెంటైన్స్ డే తర్వాత వచ్చే ఈ 7 రోజులు ఎంతో ముఖ్యం..
సంప్రదాయ బద్ధంగా అల్లు శిరీష్ హల్దీ వేడుక.. వీడియో ఇదిగో
సంప్రదాయ బద్ధంగా అల్లు శిరీష్ హల్దీ వేడుక.. వీడియో ఇదిగో
బ్యాంకింగ్ రూల్స్‌లో భారీ మర్పులు.. ఆర్బీఐ కీలక డెసిషన్
బ్యాంకింగ్ రూల్స్‌లో భారీ మర్పులు.. ఆర్బీఐ కీలక డెసిషన్
సోంపు ఇలా తిన్నారంటే..ఆ వ్యాధులన్నీ మాయం! ఎన్ని లాభాలో తెలిస్తే.
సోంపు ఇలా తిన్నారంటే..ఆ వ్యాధులన్నీ మాయం! ఎన్ని లాభాలో తెలిస్తే.
ఆది మూవీకి ఎన్టీఆర్ హీరో.! 19 ఏళ్ల తారక్‌కు కథ చెప్పగానే ఆ డౌట్..
ఆది మూవీకి ఎన్టీఆర్ హీరో.! 19 ఏళ్ల తారక్‌కు కథ చెప్పగానే ఆ డౌట్..
రెండుసార్లు విడాకులు.. 45 ఏళ్ల వయసులో గ్లామర్ అరాచకం..
రెండుసార్లు విడాకులు.. 45 ఏళ్ల వయసులో గ్లామర్ అరాచకం..
బీచ్ నుండి ఈ వస్తువులను పొరపాటున కూడా ఇంటికి తీసుకురాకండి..
బీచ్ నుండి ఈ వస్తువులను పొరపాటున కూడా ఇంటికి తీసుకురాకండి..
ఓడలు, విమానాలు లేకుండా ప్రపంచ యాత్ర.. భూగోళంపై మ్యాజిక్
ఓడలు, విమానాలు లేకుండా ప్రపంచ యాత్ర.. భూగోళంపై మ్యాజిక్