AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Allu Sirish: అల్లు వారింట మొదలైన పెళ్లి సందడి.. సంప్రదాయ బద్ధంగా అల్లు శిరీష్ హల్దీ వేడుక.. వీడియో ఇదిగో

అల్లు కుటుంబంలో పెళ్లి సందడి మొదలైంది. అల్లు అరవింద్ తనయుడు హీరో అల్లు శిరీష్‌ త్వరలోనే మరికొన్ని రోజుల్లో ఓ ఇంటి వాడు కానున్నాడు. నయనిక అనే అమ్మాయితో కలిసి వైవాహిక బంధంలోకి అడుగు పెట్టనున్నాడు. తాజాగా అల్లు శిరీష్ ఇంట్లో హల్డీ వేడుక అట్టహాసంగా జరిగింది.

Allu Sirish: అల్లు వారింట మొదలైన పెళ్లి సందడి.. సంప్రదాయ బద్ధంగా అల్లు శిరీష్ హల్దీ వేడుక.. వీడియో ఇదిగో
Allu Sirish Pre Wedding
Basha Shek
|

Updated on: Feb 13, 2026 | 8:45 PM

Share

అల్లు కుటుంబంలో పెళ్లి సందడి షురూ అయ్యింది. అల్లు అరవింద్ చిన్న కుమారుడు అల్లు శిరీష్ ప్రీ వెడ్డింగ్ వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఇదివరకే అల్లు శిరీష్, నయనిక తమ స్నేహితులకు దుబాయిలో ఘనంగా ప్రీ వెడ్డింగ్ పార్టీ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు కూడా నెట్టింట బాగా వైరలయ్యాయి. తాజాగా అల్లు శిరీష్ ఇంట్లో పసుపు దంచే వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకలో అల్లు మెగా కుటుంబ సభ్యులందరూ ఒకే చోట చేరి పసుపును దంచారు. మెగాస్టార్ చిరంజీవి భార్య సురేఖతోపాటు తన కుమార్తె సుస్మిత, కోడలు ఉపాసన, పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినోవా తదితర కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులు ఈ వేడుకలో పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను అల్లు శిరీషే స్వయంగా తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశాడు. దీంతో ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు అల్లు శిరీష్ కు ముందస్తు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ఇవి కూడా చదవండి

స్పెషల్ అట్రాక్షన్ గా ఉపాసన

కాగా అల్లు శిరీష్ హల్దీ వేడుక కార్యక్రమంలో ఉపాసన స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. జనవరి 31వ తేదీన ఆమె కవల పిల్లలకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఇక గురువారమే (ఫిబ్రవరి 12) తమ కవల పిల్లలకు బారాసాల కూడా నిర్వహించారు. కూతురికి అన్వీరా దేవి కొణిదెల అని, కుమారుడికి శివ్ రామ్ కొణిదెల అని నామకరణం చేశారు. ఈ క్రమంలో డెలివరీ తర్వాత మొదటి సారి ఉపాసన ఈ వేడుకలో కనిపించింది. ఇక అల్లు శిరీష్ పెళ్లి మార్చి 6వ తేదీన జరగనున్నట్లు తెలుస్తోంది. డేట్ అయితే ఫిక్స్ అయ్యింది కానీ వేదిక వివరాలు మాత్రం ఇంకా తెలియడం లేదు. ఈ గ్రాండ్ వెడ్డింగ్ కు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సెలబ్రిటీలతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు కూడా హాజరు కాబోతున్నట్టు సమాచారం. త్వరలోన అల్లు శిరీష్ పెళ్లి వేడుకకు సంబంధించి ఒక అధికారిక ప్రకటన రానుంది.

హల్దీ వేడుకలో మెగా, అల్లు కుటుంబీకులు.. వీడియో..

View this post on Instagram

A post shared by Allu Sirish (@allusirish)

దుబాయ్ ప్రీ వెడ్డింగ్ పార్టీ వీడియో ఇదిగో..

View this post on Instagram

A post shared by Allu Sirish (@allusirish)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

సంప్రదాయ బద్ధంగా అల్లు శిరీష్ హల్దీ వేడుక.. వీడియో ఇదిగో
సంప్రదాయ బద్ధంగా అల్లు శిరీష్ హల్దీ వేడుక.. వీడియో ఇదిగో
బ్యాంకింగ్ రూల్స్‌లో భారీ మర్పులు.. ఆర్బీఐ కీలక డెసిషన్
బ్యాంకింగ్ రూల్స్‌లో భారీ మర్పులు.. ఆర్బీఐ కీలక డెసిషన్
సోంపు ఇలా తిన్నారంటే..ఆ వ్యాధులన్నీ మాయం! ఎన్ని లాభాలో తెలిస్తే.
సోంపు ఇలా తిన్నారంటే..ఆ వ్యాధులన్నీ మాయం! ఎన్ని లాభాలో తెలిస్తే.
ఆది మూవీకి ఎన్టీఆర్ హీరో.! 19 ఏళ్ల తారక్‌కు కథ చెప్పగానే ఆ డౌట్..
ఆది మూవీకి ఎన్టీఆర్ హీరో.! 19 ఏళ్ల తారక్‌కు కథ చెప్పగానే ఆ డౌట్..
రెండుసార్లు విడాకులు.. 45 ఏళ్ల వయసులో గ్లామర్ అరాచకం..
రెండుసార్లు విడాకులు.. 45 ఏళ్ల వయసులో గ్లామర్ అరాచకం..
బీచ్ నుండి ఈ వస్తువులను పొరపాటున కూడా ఇంటికి తీసుకురాకండి..
బీచ్ నుండి ఈ వస్తువులను పొరపాటున కూడా ఇంటికి తీసుకురాకండి..
ఓడలు, విమానాలు లేకుండా ప్రపంచ యాత్ర.. భూగోళంపై మ్యాజిక్
ఓడలు, విమానాలు లేకుండా ప్రపంచ యాత్ర.. భూగోళంపై మ్యాజిక్
మీలో ఈ లక్షణాలు కనిపిస్తే.. బీ కేర్‌ఫుల్.! లివర్ ఇక షెడ్డుకే..
మీలో ఈ లక్షణాలు కనిపిస్తే.. బీ కేర్‌ఫుల్.! లివర్ ఇక షెడ్డుకే..
ముంబై కోస్టల్ రోడ్డుపై సరికొత్త మ్యాజిక్.. ఆ స్పీడ్‌తో వెళ్తేనే..
ముంబై కోస్టల్ రోడ్డుపై సరికొత్త మ్యాజిక్.. ఆ స్పీడ్‌తో వెళ్తేనే..
ఏపీ బడ్జెట్‌లో పథకాలకు ప్రత్యేక నిధులు.. వీటికి లైన్ క్లియర్
ఏపీ బడ్జెట్‌లో పథకాలకు ప్రత్యేక నిధులు.. వీటికి లైన్ క్లియర్