AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

New Banking Rules: మారిన బ్యాంకింగ్ రూల్స్.. ఆర్బీఐ సంచలన నిర్ణయం.. 7 గంటల తర్వాత ఇవన్నీ బంద్..

ఆర్బీఐ బ్యాంకుల కస్టమర్లకు ఊరట కలిగించింది. బ్యాంకింగ్ రూల్స్‌లో పలు మార్పులు చేసింది. లోన్ రికవరీ ఏజెంట్ల వేధింపులు ఇటీవల ఎక్కువైపోతున్నాయి. దీనికి చెక్ పెట్టేందుకు కఠిన నిబంధనలు అమలు చేయాలని ఆర్బీఐ నిర్ణయించింది. అందులో భాగంగా పలు నియమాలను తీసుకురానుంది.

New Banking Rules: మారిన బ్యాంకింగ్ రూల్స్.. ఆర్బీఐ సంచలన నిర్ణయం.. 7 గంటల తర్వాత ఇవన్నీ బంద్..
Rbi
Venkatrao Lella
|

Updated on: Feb 13, 2026 | 8:45 PM

Share

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. పలు బ్యాంకింగ్ రూల్స్‌లో మార్పులు చేసింది. లోన్ రికవరీకి సంబంధించి పలు నిబంధనలను తీసుకొచ్చింది. రికవరి ఏజెంట్ల వేధింపులు, దుష్ఫ్రవర్తను అడ్డుకుని కస్టమర్లను రక్షించేందుకు కొత్త గైడ్‌లైన్స్‌ను రూపొందించింది. ఏజెంట్లకు స్పష్టమైన మార్గదర్శకాలు బ్యాంకులు తయారు చేయడం, పారదర్శకతను నిర్ధారించడం, ఇబ్బందుల్లో ఉన్న రుణదారులకు పరిష్కారాన్ని అందించడం వంటివి ఈ నియమాల్లో ఉన్నాయి. కస్టమర్లను సంప్రదించే సమయం, కాల్స్‌ను రికార్డ్ చేయడం, దుర్వినియోగ పద్దతులను నిషేధించడం, బాధ్యతాయుతమైన రుణ వసూలును నిర్ధారించడం వంటి వాటిపై కొత్త నిబంధనలను తీసుకురానుంది.

7 గంటల తర్వాత కాల్స్ బంద్

రుణగ్రహీతలకు భారీ ఉపశమనం కలిగించే విధంగా ఆర్బీఐ కీలక నిర్ణయాలు తీసుకుంది. రికవరీ ఏజెంట్ల వేధింపులను నివారించేలా నియమాలను కఠినతరం చేసింది. కేంద్ర బ్యాంకింగ్ అధికారం RBI రెండవ సవరణ ఆదేశాలు, 2026 అనే ముసాయిదాను విడుదల చేసింది. రికవరీ ఏజెంట్లు ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు మాత్రమే కస్టమర్లను సంప్రదించాల్సి ఉంటుంది. ఫోన్ ద్వారా అయినా ఇదే సమయంలో కాంటాక్ట్ అవ్వాలి. ఇక కస్టమర్ల బంధువులు, స్నేహితులు, సహోద్యోగులకు ఫోన్ చేయడం లేదా వేధించడం పూర్తిగా నిషేధం. వివాహాలు, సంతాప కార్యక్రమాలు లేదా పండుగలు వంటి సున్నితమైన సందర్భాలలో సంప్రదించకూడదు. రుణగ్రహీత చెల్లింపు చేయనప్పుడు ముందు బ్యాంకు రసీదు జారీ చేయాలి. అలాగే ఏజెంట్లు కస్టమర్లకు చేసిన కాల్స్ రికార్డులను భద్రపర్చాల్సి ఉంటుంది. సంభాషణలను రికార్డ్ చేయడంతో పాటు కస్టమర్‌కు దీని గురించి ముందుగానే చెప్పాల్సి ఉంటుందని ఆర్బీఐ స్పష్టం చేసింది.

గూండాయిజం చేయకూడదు

ఇక లోన్ చెల్లించని కస్టమర్‌ను దుర్భాషలాడడం, రుణగ్రహీతలను కించపరచడం, సోషల్ మీడియా ద్వారా ఒత్తిడి తీసుకురాడం లేదా తప్పుడు సమాచారం ఇవ్వడం వంటివి సహించేది లేదని ఆర్‌బీఐ మసాయిదా మార్గదర్శకాల్లో స్పష్టంగా తెలిపింది. రికవరీ పేరుతో ఎలాంటి గూండాయిజం అంగీకరించబడదని హెచ్చరించింది. IIBF అందించే డెట్ రికవరీ ఏజెంట్ల ట్రైనింగ్ ప్రొగ్రాం లేదా IIBFతో టై-అప్ ఏర్పాటై ఉన్న ఏదైనా ఇతర సంస్థ ద్వారా శిక్షణ తప్పనిసరిగా పూర్తి చేయాలి. బ్యాంకు ద్వారా నియమించబడిన రికవరీ ఏజెంట్లు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ (IIBF) నుండి సర్టిఫికేట్ పొందారని ఆర్బీఐ పేర్కొంది. ఈ మార్గదర్శకాలు ఆమోదం పొందిన తర్వాత జులై 1 నుంచి అందుబాటులోకి రానున్నాయి. అయిలే లోన్ ఎంత రికవరీ చేస్తే ఏజెంట్‌కు అంత కమిషన్ వస్తుంది. దీంతో కస్టమర్ల పట్ల రికవరీ ఏజెంట్లు దురుసుగా ప్రవర్తిస్తున్నారు. హింసకు పాల్పడుతూ వేధిస్తన్నారు.