క్యాన్సర్ రూట్స్ ని అంతం చేసే ఖతర్నాక్ జ్యూస్..!
13 February 2026
Jyothi Gadda
మకరంద పండ్లు... ఎక్కువగా వాయవ్య చైనాలో పండుతుంటాయి. ఇవి స్టోన్ ఫ్రూట్ జాతికి చెందినవి. వీటి మధ్యలో ఒకటే గింజ ఉంటుంది. చెర్రీస్, ఆప్రికాట్స్, ప్లమ్స్, నెక్టారిన్స్ ఇలాంటివే.
పీచ్ పండ్లలోపలి పదార్థం తెలుపు, పసుపు, ఆరెంజ్ కలర్స్‌లో ఉంటుంది. మకరంద పండ్లలో రెండు రకాలున్నాయి. ఫ్రీస్టోన్, క్లింగ్‌స్టోన్. మన శరీరంలోకి విష వ్యర్థాలు రాకుండా ఉండాలంటే మకరంద పండ్లను తినాలి.
పీచ్ పండులో ఉండే పాలిఫెనల్స్, యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు క్యాన్సర్ కణాల వృద్ధిని అడ్డుకుంటాయి. ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా నిరోధించడంలో ఈ పండు సహాయపడుతుంది.
ఫైబర్ అధికంగా ఉండటమే కాకుండా, పీచ్ పండులో ఉండే కొంతమేర నీటి శాతం కూడా జీర్ణతకు ఎంతో ఉపయోగకరం. ఇది మలబద్దకాన్ని నివారిస్తుంది. పేగుల్లో వ్యర్ధాలను బయటకు పంపుతుంది.
డయేరియా, గ్యాస్, అజీర్తి వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. పీచ్ పండులో ఉండే విటమిన్ A మరియు బీటా కెరోటీన్ కంటి చూపును మెరుగుపరచడంలో సహాయపడతాయి.
పీచ్ పండు బాహ్యంగా కూడా ఉపయోగపడుతుంది. దీనిలో ఉండే విటమిన్ A, C చర్మాన్ని మెరుగు పరుస్తాయి. ఫేషియల్‌గా ఉపయోగిస్తే ముడతలు తగ్గుతాయి, చర్మరంధ్రాలు శుభ్రపడతాయి.
విటమిన్ K, మేగ్నీషియం వంటి ఖనిజాలు పీచ్‌లో పుష్కలంగా ఉండి, ఎముకలు బలంగా ఉండేందుకు సహాయపడతాయి. ఇది వృద్ధాప్యంలో వచ్చే అస్థి సంబంధిత రుగ్మతలకు తట్టుకోవడంలో ఉపయోగపడుతుంది.
మెనోపాజ్ అనంతర మహిళలు ఈ పండును ఆహారంలో చేర్చుకోవడం చాలా మంచిది. పీచ్ పండు రక్తపోటు నియంత్రణకు సహాయపడుతుంది. ఇది కోలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది.