Ant Control: 2 రూపాయలతో చీమలన్నీ మాయం! ఉప్పుతో కలిపి ఇలా చేస్తే ఒక్క చీమ కూడా కనిపించదు!
వంటగదిలో ఏదైనా తీపి పదార్థం పెడితే చాలు.. నిమిషాల్లో వేలాది చీమలు చుట్టుముట్టేస్తాయి. ఎంత శుభ్రం చేసినా అవి మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాయి. వీటిని చంపడానికి మార్కెట్లో దొరికే కెమికల్స్ వాడటం ఆరోగ్యానికి, ముఖ్యంగా ఆహారానికి అస్సలు మంచిది కాదు. అయితే, కేవలం 2 రూపాయలకు దొరికే బిర్యానీ ఆకు మన ఇంట్లో ఉండే ఉప్పుతో చీమల దండయాత్రకు శాశ్వతంగా ముగింపు పలవచ్చని మీకు తెలుసా? ఈ బెస్ట్ హోమ్ హ్యాక్ ఇప్పుడు చూద్దాం.

చీమలు సాధారణంగా వాసనను పసిగట్టి ఒకదాని వెంట ఒకటి వరుసలో వెళ్తుంటాయి. ఈ వాసన పట్టే సామర్థ్యాన్ని బిర్యానీ ఆకు దెబ్బతీస్తుంది. ఉప్పు వాటి శరీరానికి తగిలితే అవి డీహైడ్రేషన్ వల్ల పారిపోతాయి. ఈ సహజసిద్ధమైన చిట్కాను ఎలా వాడాలి? ఇతర ప్రత్యామ్నాయ మార్గాలు ఏంటో ఇప్పుడు వివరంగా మీకోసం.
బిర్యానీ ఆకు + ఉప్పు మ్యాజిక్!
కొన్ని బిర్యానీ ఆకులను తీసుకుని చిన్న ముక్కలుగా చేయాలి. ఇలా చేయడం వల్ల ఆకులో ఉండే ‘యూకలిప్టాల్’ అనే రసాయనం వల్ల వచ్చే ఘాటైన సువాసన బయటకు వస్తుంది. ఈ ముక్కలకు ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల ఉప్పు కలపాలి. ఈ మిశ్రమాన్ని చీమలు తిరిగే కిచెన్ ప్లాట్‌ఫారమ్స్, కిటికీలు, డోర్ ఫ్రేమ్‌ల దగ్గర ఉంచితే చీమలు ఆ దరిదాపుల్లోకి కూడా రావు. రెండు వారాలకు ఒకసారి ఈ మిశ్రమాన్ని మారుస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.
చీమల సంహారానికి ఇతర చిట్కాలు:
బేకింగ్ సోడా చక్కెర:
సమాన మోతాదులో బేకింగ్ సోడా, చక్కెర కలిపి చీమలు తిరిగే చోట చల్లాలి. చక్కెర వాటిని ఆకర్షిస్తుంది, కానీ బేకింగ్ సోడా తిన్నప్పుడు వాటి పొట్టలో గ్యాస్ ఉత్పత్తి అయ్యి అవి చనిపోతాయి.
నిమ్మరసం స్ప్రే:
నిమ్మలోని సిట్రిక్ యాసిడ్ వాసన చీమలకు అస్సలు నచ్చదు. స్ప్రే బాటిల్‌లో సమానంగా నిమ్మరసం, నీళ్లు కలిపి కిటికీలు, తలుపుల దగ్గర చల్లితే చీమలు లోపలికి రాకుండా అడ్డుకోవచ్చు.
కిచెన్ క్లీనింగ్:
చీమలు ఆహారం కోసం వెతుకుతుంటాయి. కాబట్టి వంటగదిలో ఆహారపు ముక్కలు, ముఖ్యంగా స్వీట్లు, జ్యూస్ లాంటివి చిందకుండా జాగ్రత్త పడాలి. ఆహార పదార్థాలను గాలి చొరబడని డబ్బాల్లో భద్రపరచాలి.
