Amaravathi ki Aahwanam Movie Review: అమరావతికి ఆహ్వానం మూవీ రివ్యూ.. హారర్ డ్రామా ఎంతవరకు మెప్పించింది..?
టాలీవుడ్ ఆడియన్స్‌కు హారర్ థ్రిల్లర్ జోనర్‌పై ఎప్పుడూ ఓ స్పెషల్ క్రేజ్ ఉంటుంది. కంటెంట్ కాస్త కొత్తగా ఉంటే చాలు.. బయటపడుతుంది సినిమా. ఇదే ఫార్ములాను నమ్ముకుని వచ్చిన సినిమా అమరావతికి ఆహ్వానం. టైటిల్ ఇంట్రెస్టింగ్‌గా ఉన్న ఈ చిత్రం.. థియేటర్లో ఆడియన్స్‌ని ఏ మేర భయపెట్టింది..? థ్రిల్ చేసిందా..? అనేది ఈ రివ్యూలో చూద్దాం.

మూవీ రివ్యూ: అమరావతికి ఆహ్వానం
నటీనటులు: శివ కంఠంనేని, ఎస్తేర్ నోరోన్హా, ధన్య బాలకృష్ణ, సుప్రిత, హరీష్, అశోక్ కుమార్, జెమినీ సురేష్ తదితరులు..
సంగీతం: పద్మనాభ్ భరద్వాజ్
సినిమాటోగ్రఫీ: జె. ప్రభాకర్ రెడ్డి
దర్శకత్వం: జీవీకే
నిర్మాతలు: కె.ఎస్. శంకర్ రావు, ఆర్. వెంకటేశ్వర రావు
టాలీవుడ్ ఆడియన్స్‌కు హారర్ థ్రిల్లర్ జోనర్‌పై ఎప్పుడూ ఓ స్పెషల్ క్రేజ్ ఉంటుంది. కంటెంట్ కాస్త కొత్తగా ఉంటే చాలు.. బయటపడుతుంది సినిమా. ఇదే ఫార్ములాను నమ్ముకుని వచ్చిన సినిమా అమరావతికి ఆహ్వానం. టైటిల్ ఇంట్రెస్టింగ్‌గా ఉన్న ఈ చిత్రం.. థియేటర్లో ఆడియన్స్‌ని ఏ మేర భయపెట్టింది..? థ్రిల్ చేసిందా..? అనేది ఈ రివ్యూలో చూద్దాం.
కథ:
ఈశ్వర్ (శివ కంఠంనేని) డిపార్ట్‌మెంట్ నుంచి సస్పెండ్ అయిన పోలీస్ ఆఫీసర్. తన భార్య భానుమతి (ధన్య బాలకృష్ణ), మరదలు భార్గవి (సుప్రిత)లతో కలిసి ప్రశాంతంగా గడుపుతుంటాడు. భార్గవికి సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలనే పిచ్చి ఎక్కువ. ఈ క్రమంలో ఆమె చేసిన ఓ దెయ్యం వీడియో వైరల్ అవుతుంది. అది చూసిన ఓ అజ్ఞాత వ్యక్తి… దమ్ముంటే అమరావతి అనే ఊరికి వచ్చి అక్కడ నిజంగా దెయ్యాలు ఉన్నాయని లైవ్‌లో నిరూపించమని సవాల్ విసురుతాడు. ఆ ఛాలెంజ్‌ని స్వీకరించి ఈశ్వర్ ఫ్యామిలీతో సహా అమరావతికి వెళ్తుంది భార్గవి. అక్కడ ఆ కుటుంబానికి ఎదురైన పారానార్మల్ అనుభవాలు ఏంటి? అసలు ఆ ఊరి జమీందారు వారసురాలు రాజేశ్వరి (ఎస్తేర్ నోర్హోన్హా) కథేంటి..? ఈశ్వర్ సస్పెన్షన్‌కి, ఈ ఊరికి ఉన్న లింక్ ఏంటి? అనే ట్విస్టుల సమాహారమే ఈ సినిమా.
కథనం:
టైటిల్ చూసి ఇదేదో పొలిటికల్ సినిమా అనుకుంటే పొరపాటే. ఇది పక్కా హారర్ ఎంటర్టైనర్. దర్శకుడు జీవీకే రెగ్యులర్ హారర్ ఎలిమెంట్స్‌కి ఫ్యామిలీ ఎమోషన్స్‌ని జోడించి కథను నడిపించారు. ఫస్ట్ హాఫ్ అంతా క్యారెక్టర్ల పరిచయం, హైదరాబాద్ టు అమరావతి జర్నీ, చిన్న చిన్న భయాలతో సాగిపోతుంది. అయితే అమరావతికి చేరుకున్నాక అసలు కథ మొదలవుతుంది. అప్పటి వరకు కథ నెమ్మదిగానే వెళ్తుంది. ముఖ్యంగా ఇంటర్వెల్ ముందు వచ్చే ట్విస్ట్ ఆడియన్స్‌లో క్యూరియాసిటీని పెంచుతుంది. సెకండ్ హాఫ్‌లో వచ్చే ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్, రాజేశ్వరి పాత్ర చుట్టూ తిరిగే డ్రామా సినిమాకి ఆయువుపట్టు. ఇక ప్రీ క్లైమాక్స్‌లో రివీల్ అయ్యే అసలు నిజం ప్రేక్షకులను బాగానే ఎంగేజ్ చేస్తుంది. అయితే మధ్యలో కొన్ని సన్నివేశాలు రొటీన్‌గా అనిపించినా.. క్లైమాక్స్ ఓకే. కథ సీరియస్‌గా సాగుతున్నప్పుడు వచ్చే స్పెషల్ సాంగ్ కాస్త స్పీడ్ బ్రేకర్ అనిపించినా, మాస్ ఆడియన్స్ కోసం డిజైన్ చేసినట్లు అర్థమైపోతుంది. అక్కడక్కడా రొటీన్ హారర్ సీన్స్, కొన్ని లాజిక్స్ మిస్ అవ్వడం లాంటివి ఈ సినిమాకు మైనస్ పాయింట్స్.
నటీనటులు:
ఈశ్వర్ పాత్రలో హీరో శివ కంఠంనేని సెటిల్డ్ నటన బాగుంది. యాక్షన్ సీన్స్, ఎమోషనల్ సీన్స్‌లో బాగున్నారు. ఇక సినిమాలో మేజర్ హైలైట్ ఎస్తేర్. రాజేశ్వరి పాత్రలో ఆమె నటన, హావభావాలు బాగున్నాయి. యూట్యూబర్‌గా సుప్రిత ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ధన్య బాలకృష్ణ తన పాత్ర పరిధి మేరకు బాగా నటించింది. నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో శివ కంఠంనేని వేరియేషన్ బాగుంది. మిగిలిన పాత్రల్లో హరీష్, జెమినీ సురేష్, భద్రమ్ తమ పరిధి మేరకు నవ్వించే ప్రయత్నం చేశారు.
టెక్నికల్ టీం:
సాంకేతిక వర్గం పనితీరు సినిమాకు హెల్ప్ అయ్యింది. ముఖ్యంగా ప్రేమ కథా చిత్రమ్ ఫేమ్ ప్రభాకర్ రెడ్డి సినిమాటోగ్రఫీ ఈ సినిమాకు ప్రధాన బలం. రాత్రి పూట వచ్చే సన్నివేశాల్లో లైటింగ్, మూడ్ క్రియేట్ చేసిన విధానం బాగుంది. పద్మనాభ్ భరద్వాజ్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ హారర్ సీన్స్‌ను ఎలివేట్ చేసింది. నిర్మాణ విలువలు పర్లేదు. ఎడిటింగ్ క్రిస్ప్‌గా ఉంటే బాగుండేది. దర్శకుడు జీవీకే రాసుకున్న ట్విస్టులు, స్క్రీన్ ప్లే సినిమాను ఓకే అనిపిస్తాయి. చివర్లో పార్ట్-2 ఉంటుందని హింట్ ఇచ్చారు.
పంచ్ లైన్:
ఓవరాల్‌గా అమరావతికి ఆహ్వానం.. హారర్ డ్రామా..!
