BSNL Best Plan: రోజుకు కేవలం రూ.8కే 3GB డేటా, ఉచిత కాల్స్.. బీఎస్‌ఎన్‌ఎల్ నుంచి బెస్ట్ ప్లాన్!
BSNL Best Plan: ప్రభుత్వ టెలికాం కంపెనీ అయిన బీఎస్‌ఎన్‌ఎల్ తన వినియోగదారుల కోసం అద్భుతమైన రీఛార్జ్ ప్లాన్లను అందుబాటులోకి తీసుకువస్తోంది. తక్కువ ధరల్లో ఎక్కువ వ్యాలిడిటీ ఇచ్చే ప్లాన్‌లను తీసుకువస్తోంది బీఎస్‌ఎన్‌ఎల్. అయితే ఇప్పుడు వార్షిక ప్లాన్ తో మంచి ప్రయోజనాలు పొందవచ్చు..

BSNL Best Plan: కొత్త సంవత్సరం ప్రారంభానికి ముందే బీఎస్‌ఎన్‌ఎల్ తన కస్టమర్లకు అద్భుతమైన సర్‌ప్రైజ్ ఇచ్చింది. డిసెంబర్ 26 నుండి కంపెనీ పూర్తి సంవత్సరం చెల్లుబాటుతో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ను ప్రారంభించింది. అదనంగా క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకలను ప్రత్యేకంగా చేయడానికి బీఎస్‌ఎన్‌ఎల్ ఇప్పటికే ఉన్న అనేక రీఛార్జ్ ప్లాన్‌లపై అదనపు డేటా బోనస్‌లను అందిస్తోంది.
కొత్త రూ. 2,799 వార్షిక ప్లాన్:
ఈ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ గురించి సమాచారాన్ని BSNL ఇండియా తన అధికారిక X (గతంలో ట్విట్టర్) ఖాతా ద్వారా పంచుకుంది. రూ. 2,799 ధరతో కూడిన ఈ ప్లాన్ దీర్ఘకాలం పాటు సరసమైన, నమ్మదగిన కనెక్షన్‌ను కోరుకునే వినియోగదారులను లక్ష్యంగా చేసుకుంది. ఈ ప్లాన్ 365 రోజుల చెల్లుబాటును అందిస్తుంది. కాలింగ్ కోసం ఇది భారతదేశం అంతటా అపరిమిత వాయిస్ కాల్‌లను అందిస్తుంది. ఉచిత జాతీయ రోమింగ్‌తో సహా అందిస్తోంది. ఇంటర్నెట్ వినియోగదారులు ప్రతిరోజూ 3GB హై-స్పీడ్ డేటాను పొందుతారు. అంటే ఏడాది పొడవునా తగినంత ఇంటర్నెట్ యాక్సెస్ అందిస్తోంది. అదనంగా రోజుకు 100 ఉచిత SMS సందేశాలు కూడా అందిస్తోంది. ఈ ప్లాన్ ధర రోజుకు సుమారు రూ.8 మాత్రమే.
ఇది కూడా చదవండి: Gold Price Today: తెలుగు రాష్ట్రాల్లో భగ్గుమంటున్న బంగారం, వెండి ధరలు.. తులం రేటు ఎంతంటే..!
రూ.2,399, రూ.2,799 ప్లాన్‌ల మధ్య తేడా ఏమిటి?
బీఎస్‌ఎన్‌ఎల్ ఇప్పటికే రూ.2,399కి ఒక సంవత్సరం ప్లాన్‌ను అందిస్తోంది. ఇది అపరిమిత కాలింగ్, రోజుకు 2GB డేటాను అందిస్తుంది. ఇప్పుడు కొత్త రూ.2,799 ప్లాన్‌తో వినియోగదారులు కేవలం రూ.400తో రోజుకు అదనంగా 1GB డేటాను పొందవచ్చు. దీని అర్థం మీరు సంవత్సరానికి దాదాపు 365GB అదనపు డేటాను పొందుతారు. మీరు ఇలా లెక్కించినట్లయితే ప్రతి అదనపు GB ఖర్చవుతుంది రూ.1.10 మాత్రమే. అందుకే తరచుగా ఇంటర్నెట్‌ను ఉపయోగించే వారికి కొత్త ప్లాన్ మరింత ప్రయోజనకరంగా ఉండవచ్చు.
The countdown begins! ✨ Just a few hours left!
Say hello to the New Year Annual Plan – ₹2799 One simple recharge. 365 days of uninterrupted connectivity.
📅 Live from 26th December 2025
Get 3GB/day data, unlimited calling & 100 SMS/day—all packed into one powerful annual… pic.twitter.com/v4lAADqoCx
— BSNL India (@BSNLCorporate) December 25, 2025
నూతన సంవత్సరానికి ప్రత్యేక డేటా బోనస్
కొత్త ప్లాన్‌లను ప్రారంభించడంతో పాటు, BSNL ప్రస్తుత కస్టమర్ల కోసం నూతన సంవత్సర, క్రిస్మస్ ఆఫర్‌లను కూడా ప్రవేశపెట్టింది. డిసెంబర్ 15 నుండి జనవరి 31, 2026 వరకు రీఛార్జ్ చేసుకుంటే రూ. 2,399 వార్షిక ప్లాన్ రోజుకు 2GBకి బదులుగా 2.5GB డేటాను అందిస్తుంది.
ఇది కూడా చదవండి: Car Water Bottle Safety: మీ కారులో ఉంచిన వాటర్ బాటిల్ నీళ్లు తాగుతున్నారా? అధ్యయనంలో షాకింగ్ విషయాలు!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




