దూసుకెళ్తున్న కాపర్ ధర.. బంగారం ధరను మించిపోనుందా?
Samatha
27 December 2025
బంగారం, వెండి బాటలోనే రాగి కూడా పయనిస్తుంది. జెడ్ స్పీడ్‌తో కాపర్ దూసుకెళ్తుంది. రోజు రోజుకు కాపర్ ధర విపరీతంగా పెరుగుతుంది.
ఈ మధ్య కాలంలో కాపర్ ధరల్లో విపరీతమైన పెరుగుదల కనిపిస్తుంది. రాగి ధరలు రికార్డు స్థాయికి చేరుతూ, పెట్టుబడిదారులు, పారిశ్రామిక వేత్తలను షాక్‌కు గురి చేస్తున్నాయి.
ఇటీవల ట్రేడింగ్‌లో టన్ను రాగి ధర 12,000 డాలర్ల మార్కును దాటింది. ప్రపంచ మార్కెట్లో రాగి ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి.2009 తర్వాత ఈ సంవత్సరంలోనే రాగి ఏకంగా 35 శాతం పెరగడం విశేషం.
అయితే ఇలా బంగారం, వెండిలా రాగి కూడా పరుగులు పెట్టడానికి అనేక కారణాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. ముఖ్యంగా డిమాండ్‌కు తగిన సరఫరా లేకపోవడం,గనుల నుంచి రాగి వెలికితీత తగ్గుముఖం పట్టడం.
అలాగే ఎలక్ట్రిక్ వాహనాల రంగం కూడా రాగి పెరుగుదలకు కారణం అవుతుందంట. ఎలక్ట్రికల్ కారు తయారీలో ఎక్కువ రాగి వాడుతున్నారు, ఎలక్ట్రిక్ వాహనాల వాడకం పెరుగుతుంది. అందువలన రాగి ధర పెరుగుతుందంట.
రెండోది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. భారీ డేటా సెంటర్ల నిర్మాణం, వాటికి అవసరమైన విద్యుత్ ప్రసారం కోసం రాగి అత్యంత కీలకమైన లోహం. రాగి అత్యుత్తమ విద్యుత్ వాహకం కాబట్టి, ఏఐ రంగ విస్తరణతో రాగి వినియోగం భారీగా పెరుగుతోంది.
పవర్ గ్రిడ్లు, సౌరశక్తి, పవనశక్తి వంటి పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల విస్తరణకు, వాటి నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్తును సరఫరా చేయడానికి రాగి కేబుల్స్ తప్పనిసరి.
ఇలా ఈ రంగాల విస్తరణ వలన రాగి ధర పరుగులు పెడుతోందని, 2030 నాటికి రాగి డిమాండ్ 60 శాతం మేర పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.