Health Check-up Benefits: మార్చి 31లోపు ఇలా చేయండి.. రూ.50 వేల వరకు ప్రయోజనం పొందే అవకాశం..!

Health Check-up Benefits: కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రతి ఒక్కరు ఆరోగ్యంపై ఎంతో శ్రద్ద వహిస్తున్నారు. ముఖ్యంగా రోగనిరోధక శక్తి పెంచుకునేందుకు అనేక చర్యలు ..

Health Check-up Benefits: మార్చి 31లోపు ఇలా చేయండి.. రూ.50 వేల వరకు ప్రయోజనం పొందే అవకాశం..!
Health Check Up Benefits
Follow us
Subhash Goud

|

Updated on: Mar 25, 2021 | 2:35 PM

Health Check-up Benefits: కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రతి ఒక్కరు ఆరోగ్యంపై ఎంతో శ్రద్ద వహిస్తున్నారు. ముఖ్యంగా రోగనిరోధక శక్తి పెంచుకునేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నారు. ఇంతటితో ఆగకుండా శరీరం ఆరోగ్యంగానే ఉందా..? లేదా..? అన్ని అవయవాలు బాగా పని చేస్తున్నాయా..? లేదా అనే అంశాన్ని నిర్ధారించుకునేందుకు ఆరోగ్య పరీక్షలు చేయించుకునే వారి సంఖ్య పెరిగిపోతోంది. అయితే వీరి అవసరాలకు అనుగుణంగా కొన్ని ఆస్పత్రులు పురుషులకు, మహిళలకు, సీనియర్‌ సిటిజన్స్‌కు వేర్వేరు ప్యాకేజీలను అందిస్తున్నాయి.

అయితే హెల్త్‌ చెక్‌ప్‌ కోసం చేసే ఖర్చులపై కూడా పన్ను మినహాయింపు పొందవచ్చనే విషయం చాలా మందికి తెలియదు. వీటిపై మరింత అవగాహన పెంచుకుంటే ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చు. అయితే మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యం కాపాడుకునేందుకు మీరు చేసే ఖర్చులపై ఆర్థిక సంవత్సరంలో సెక్షన్‌ 80డి కింద రూ.25 వేల వరకు, సీనియర్‌ సిటిజన్స్‌ రూ.50 వేల వరకు ప్రయోజనం పొందవచ్చు.

అయితే ప్రివెంటివ్‌ హెల్త్​ చెకప్​ కోసం ఆర్థిక సంవత్సరంలో మీరు చెల్లించిన మొత్తంపై రూ.5 వేల వరకు పన్ను బెనిఫిట్స్‌ పొందవచ్చు. ప్రస్తుతం సమయంలో పన్ను ప్రయోజనాలకు చాలా కీలకం. మార్చి 31తో ఈ ఆర్థిక సంవత్సరం ముగస్తుండటంతో మీ పన్ను ప్రయోజనాలను పొందేందుకు మీ హెల్త్‌ చెకప్‌ ఇన్‌వాయిస్‌లను సిద్ధం చేసుకోండి.

రూ.25 వేల వరకు పన్ను ప్రయోజనాలు..

అయితే మీ హెల్త్‌ కవరేజీకి అయ్యే ఖర్చులను నేరుగా నగదు రూపంలో చెల్లిస్తే పన్ను ప్రయోజనాలు పొందలేరని గుర్తించుకోవాలి. మీ హెల్త్‌ కవరేజీ కొనుగోలుకు చెక్‌, నెట్‌ బ్యాంకింగ్‌ వంటి నగదు రహిత డిజిటల్‌ మోడ్‌లను ఎంచుకోవాలి. అయితే సకాలంలో ప్రీమియం చెల్లించినప్పుడు మాత్రమే ఆరోగ్య బీమా ప్రీమియంపై పన్ను ప్రయోజనం లభిస్తుందని గుర్తించుకోవాలి. కాగా, ప్రివెంటివ్‌ హెల్త్‌ చెకప్‌ కోసం మీరు వెచ్చించిన మొత్తంలో రూ.5 వేల వరకు లభించే పన్ను మినహాయింపు ప్రయోజనం, నగదు రూపంలో చెల్లించినప్పటికీ అనుమతించబడుతుంది. అయితే అనేక బీమా కంపెనీలు 45 ఏళ్లు పైబడిన వారి కోసం ప్రత్యేక హెల్త్‌ కవరేజీ ప్లాన్‌లను అందిస్తున్నాయి. పెద్ద మొత్తంలో బీమా చేసినవారు 45 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్నప్పటికీ హెల్త్‌ చెకప్‌పై పెట్టిన ఖర్చు మొత్తంపై పన్ను మినహాయింపు కోరవచ్చు. హెల్త్‌ కవరేజీ ప్లాన్‌ను క్లెయిమ్‌ చేసుకునేందుకు ఆయా బీమా సంస్థలు మెడికల్‌ రిపోర్టులను అడిగే అవకాశం ఉంది. అందువల్ల వాటిని సిద్ధం చేసుకోండి. ఏటా వైద్య చికిత్సకు అయ్యే ఖర్చులు అనుహ్యంగా పెరుగుతుండటంతో మీపై ఆర్థిక భారం తగ్గించుకునేందుకు ఈ హెల్త్‌ కవరేజీ ప్లాన్‌ ఎంతగానో ఉపయోగపడతాయి.

ఇవీ చదవండి : PAN Aadhaar: మార్చి 31 వచ్చేస్తోంది.. ఈ పని చేయకపోతే వెంటనే చేసుకోండి.. గడువు ముగిసిందంటే ఇక అంతే

Price Hike: ఏప్రిల్‌ 1 నుంచి బాదుడే.. బాదుడు.. వీటి ధరలు భారీగా పెరగనున్నాయి…కొనాలంటే ఇప్పుడే కొనేయండి..!

Premiums Increase: ప్రస్తుతం ఉన్న ఆరోగ్య బీమా పాలసీలపై ఎలాంటి మార్పులు చేయరాదు.. సంస్థలకు ఐఆర్డీఏఐ ఆదేశం

FD Insurance: మీరు బ్యాంకులో డబ్బులు డిపాజిట్‌ చేస్తున్నారా..? దానిపై అధిక ఇన్సూరెన్స్‌ పొందాలంటే ఏం చేయాలి..?