FD Insurance: మీరు బ్యాంకులో డబ్బులు డిపాజిట్‌ చేస్తున్నారా..? దానిపై అధిక ఇన్సూరెన్స్‌ పొందాలంటే ఏం చేయాలి..?

FD insurance: బ్యాంకులో డబ్బులు దాచుకోవడం అనేది ప్రతి ఒక్కరు చూసేది. బ్యాంకుల నిర్వహణ సరిగ్గా లేనప్పుడు వాటిని మూసివేయాల్సి వచ్చిన సమయంలో

FD Insurance: మీరు బ్యాంకులో డబ్బులు డిపాజిట్‌ చేస్తున్నారా..? దానిపై అధిక ఇన్సూరెన్స్‌ పొందాలంటే ఏం చేయాలి..?
Fd Insurance
Follow us
Subhash Goud

|

Updated on: Mar 20, 2021 | 8:57 AM

FD Insurance: బ్యాంకులో డబ్బులు దాచుకోవడం అనేది ప్రతి ఒక్కరు చూసేది. బ్యాంకుల నిర్వహణ సరిగ్గా లేనప్పుడు వాటిని మూసివేయాల్సి వచ్చిన సమయంలో, ఖాతాదారులు చేసుకున్న డిపాజిట్‌ డబ్బులకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. అలాంటి సమయంలో ఖాతాదారులకు ఇబ్బందులు తలెత్తకుండా వారి డిపాజిట్లకు రూ. 5 లక్షల వరకు ఇన్సూరెన్స్‌ సదుపాయం కల్పించేలా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రతిపాదించారు. ఖాతాదారుల డిపాజిట్లకు ‘డిపాజిట్‌ ఇన్సూరెన్స్‌ క్రెడిట్‌ గ్యారెంటీ కార్పొరేషన్‌’ (DICGC) హామీ ఇస్తుంది. అంటే బ్యాంకులు విఫలమైనప్పుడు ఖాతాదారుల డిపాజిట్‌ డబ్బులను డీఐసీజీసీ ఇన్సూరెన్స్‌ రూపంలో చెల్లి్స్తుంది. ఈ గతంలో ఈ కవరేజీని రూ.1 లక్షగా ఉండేది. కానీ గత ఏడాది దీనిని సవరించారు. 2020 ఫిబ్రవరి 4 నుంచి డిపాజిట్లకు రూ.5 లక్షలు ఇన్సూరెన్స్‌ కవరేజీ అమల్లోకి వచ్చింది. అయినా కూడా ఈ మొత్తం చాలా మంది డిపాజిటర్లకు సరిపోవవడం లేదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రూ.65 లక్షల వరకు ఇన్సూరెన్స్‌ కవరేజీని పెంచుకునే అవకాశాలపై ఖాతాదారులు అవగాహణ పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రస్తుతం అకౌంట్‌ ఉన్న అదే బ్రాంచిలో ఈ సదుపాయం ఉంటుంది.

DICGC ఎలాంటి ఇన్సూరెన్సులను అందిస్తుంది?

డీఐసీజీసీ సేవింగ్‌ అకౌంట్లు, ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, కరెంట్‌ అకౌంట్లు, రికవరింగ్‌ డిపాజిట్లు వంటి డిపాజిట్లపై ఇన్సూరెన్స్‌ కవరేజీ ఇస్తుంది. కానీ విదేశీ ప్రభుత్వాల డిపాజిట్లు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల డిపాజిట్లు, రాష్ట్ర సహకార బ్యాంకులు, ప్రభుత్వానికి సంబంధించిన ఇతర డిపాజిట్లు, రిజర్వు బ్యాంక్‌ మినహాయించిన డిపాజిట్లకు ఇన్సూరెన్స్‌ వర్తించదు.

ఇన్సూరెన్స్‌ను ఎలా చెల్లిస్తారు.?

బ్యాంకు లైసెన్స్‌ రద్దు చేసిన తేదీ లేద ఆవిలీనం చేసిన తేదీ నుంచి ఖాతాదారులు తమ అసలు, వడ్డీపై రూ.5 లక్షల వరకు ఇన్సూరెన్స్‌ పొందే అవకాశం ఉంటుంది. అయితే అన్ని రకాల డిపాజిట్లకూ ఇన్సూరెన్స్‌ పరిమితి అత్యధికంగా రూ.5 లక్షలుగానే ఉంది. ఒక వేళ డిపాజిట్‌ చేసిన అసలు రూ. 5 లక్షల వరకే ఉంటే.. ఖాతాదారులు అంత వరకే ఇన్సూరెన్స్‌ క్లెయిమ్‌ చేసుకోవచ్చు. దానిపై రావాల్సిన వడ్డీకి ఎలాంటి గ్యారంటీ ఉండదు. అసలు, వడ్డీ కలిపి రూ.5 లక్షల కంటే తక్కువగా ఉంటే ఆ డబ్బును పూర్తిగా పొందే అవకాశం ఉంటుంది. అందువల్ల నెలవారీ వడ్డీ అందే డిపాజిట్ల పరిమితి రూ.5 లక్షలకు మించకుండా జాగ్రత్తపడాలి.

కాగా, వినియోగదారులు ఒకే బ్యాంకులో వివిధ రకాల పథకాలు, డిపాజిట్లను ఎంచుకుంటే వాటన్నింటికీ విడివిడిగా రూ. 5 లక్షల వరకు ఇన్సూరెన్స్‌ లభిస్తుంది. బ్యాంకు ఎఫ్‌డీలను ఎంచుకునే కస్టమర్లు ఒకటి మైనర్‌తో ఉమ్మడిగా , ఒకటి వ్యక్తిగతంగా, మరొకటి జీవిత భాగస్వామితో కలిపి ఇలా తీసుకోవాలి. ఒక వేళ బ్యాంకులు మూసివేస్తే ఈ అన్ని ఎఫ్‌డీ ఖాతాలపైనా ఖాతాదారులు రూ.5 లక్షల వరకు ఇన్సూరెన్స్ క్లెయిమ్‌ చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ డిపాజిట్ల మెచూరిటీ మొత్తం రూ.5 లక్షలకు మించకుండా చూసుకోవాలి.

ఈ సదుపాయం అన్ని బ్యాంకులకు వర్తిస్తుందా..?

అయితే ఇది అన్ని బ్యాంకులకు వర్తిస్తుందా..? అనే అనుమానం చాలా మందిలో ఉంటుంది. మన దేశంలో పని చసే విదేశీ బ్యాంకులు, వాణిజ్య, సహకార బ్యాంకులు అన్నీ ‘డిపాజిట్‌ ఇన్సూరెన్స్‌ క్రెడిట్‌ గ్యారెంటీ కార్పొరేషన్‌’ (DICGC) పరిధిలోకి వస్తాయి. కానీ ప్రాథమిక సహకార సంఘాలు, NBFC, HFC వంటి సంస్థల డిపాజిట్లకు డీఐసీజీసృ ఇన్సూరెన్స్‌ వర్తించదు.అందువల్ల డిపాజిట్ల భద్రత, ఇన్సూరెన్స్ హామీ ఆధారంగా పెట్టుబడులను ఎంచుకోవాలి. డిపాజిట్ల పరిమితి రూ.5 లక్షలు మించకుండా జాగ్రత్తపడాలి. ఇలాంటి ప్రయోజనాల ఆధారంగా పెట్టుబడులు ఎంచుకునేవారు ఆర్థిక నిపుణుల సలహాలు, సూచనలు తీసుకుంటే మంచిది.

ఇవీ చదవండి :

LIC Policy Claim: ఎల్‌ఐసీ పాలసీదారులకు శుభవార్త.. మార్చి 31 వరకే అవకాశం.. పూర్తి వివరాలు ఇవే..

Financial Dates: మార్చి 31వ తేదీలోగా ఈ పనులను పూర్తి చేసుకోండి.. లేదంటే ఇబ్బందుల్లో పడతారు.. అవేంటంటే..

Premiums Increase: ప్రస్తుతం ఉన్న ఆరోగ్య బీమా పాలసీలపై ఎలాంటి మార్పులు చేయరాదు.. సంస్థలకు ఐఆర్డీఏఐ ఆదేశం