Petrol Diesel Price Today: స్థిరంగా చమురు ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి..
Petrol Diesel Price Today: దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. చమురు ధరల్లో వరుసగా 20వ రోజూ ఎలాంటి మార్పు..
Petrol Diesel Price Today: దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. చమురు ధరల్లో వరుసగా 20వ రోజూ ఎలాంటి మార్పు లేదు. తాజా సమాచారం ప్రకారం.. దేశ రాజధాని న్యూఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 91.17 ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 81.47గా ఉంది. ఆర్థిక రాజధాని ముంబైలోనూ చమురు ధరలు యధావిధిగా ఉన్నాయి. ప్రస్తుతం అక్కడ లీటర్ పెట్రోల్ రూ. 97.57 కాగా, డీజిల్ రూ. 88.60 కి లభిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోనూ ఇంధన ధరలు ఇలాగే ఉన్నాయి. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర 94. 79 కాగా, లీటర్ డీజిల్ ధర రూ. 88.86 గా ఉంది. ఇక నల్గొండ జిల్లాలో పెట్రోల్ ధర రూ. 94.61, డీజిల్ ధర రూ. 89.19 గా ఉంది. వరంగల్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 94.37, డీజిల్ రూ. 88.45. కరీంనగర్‌లో పెట్రోల్ ధర రూ. 94.67, డీజిల్ ధర రూ. 88.73 గా ఉంది.
ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ. 97.88 ఉండగా.. డీజిల్ ధర రూ. 91.01గా ఉంది. విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్ రూ. 96.13 కాగా, డీజిల్ ధర రూ. 89.69 గా ఉంది. కృష్ణా జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 97.51, డీజిల్ ధర రూ. 91.03 లకు లభిస్తోంది. గుంటూరులో పెట్రోల్ ధర రూ. 97.88 కాగా డీజిల్ ధర రూ. 91.34 గా ఉంది. ఇక దేశంలోని ప్రధాన పట్టణాల్లో పెట్రోల్ ధరలు ఇలా ఉన్నాయి.
కోల్‌కతా – రూ. 91.35, చెన్నై – రూ. 93.11, గుర్గావ్ – 88.82, నోయిడా – 89.28, బెంగళూరు – 94.22, భువనేశ్వర్ – 91.90, చండీగఢ్ – 87.73, జైపూర్ – 97.61, లక్నో – 89.17, పాట్నా – 93. 48 రూపాయలు చొప్పున పెట్రోల్ ధరలు ఉన్నాయి. కాగా, పలు ప్రాంతాల్లో ఇప్పటికే పెట్రోల్ ధర రూ. 100 క్రాస్ చేసింది. రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్‌లో లీటర్ పెట్రోల్ రూ.101.84 ఉండగా, మధ్యప్రదేశ్‌లోని అనుపూర్‌లో పెట్రోల్ లీటర్ రూ.101.59 గా ఉంది.
ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ లైవ్ అప్‌డేట్స్ దిగువన చూడండి
Also read: