SBI WECARE Scheme: ఎస్‌బీఐ మరో గుడ్‌న్యూస్.. ఈ స్కీమ్‌లో చేరినట్లయితే అధికంగా వడ్డీ.. మార్చి 31 వరకే చివరి అవకాశం
SBI WECARE Scheme: దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) రోజురోజుకు కొత్త స్కీమ్‌లను ప్రవేశపెడుతూ తన కష్టమర్లను ...
SBI WECARE Scheme: దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) రోజురోజుకు కొత్త స్కీమ్‌లను ప్రవేశపెడుతూ తన కష్టమర్లను ఎంతో ఆకట్టుకుంటోంది. ఇప్పటికే చాలా వరకు స్కీమ్‌లను ప్రవేశపెట్టి వినియోగారులకు మేలు చేకూర్చుతుంది. అయితే గత కొన్ని నెలల నుంచి ఎస్‌బీఐ సీనియర్ సిటిజన్స్ కోసం SBI WECARE పేరుతో ఓ స్కీమ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే ఈ పథకం గురించి ఎస్‌బీఐ కీలక ప్రకటన చేసింది. దేశంలోపే టాప్ బ్యాంకుగా పేరున్న ఎస్‌బీఐ సీనియర్ సిటిజన్స్ కోసం శుభవార్త చెప్పింది. ఈ బ్యాంకు వృద్ధుల కోసం ప్రత్యేకంగా SBI WECARE పేరుతో ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్ తీసుకువచ్చింది. ఇటీవల వడ్డీ రేట్లు తగ్గుతున్న నేపథ్యంలో సీనియర్ సిటిజన్స్‌కు అధికంగా వడ్డీ అందించాలనే లక్ష్యంతో ఎస్‌బీఐ ఈ స్కీమ్‌ను ప్రారంభించింది. అయితే మొదట సెప్టెంబర్ వరకు ఈ స్కీమ్‌లో చేరేందుకు గడువు విధించింది. ఆ తర్వాత కరోనా నేపథ్యంలో డిసెంబర్ 31వరకు గడువు పొడిగించారు. ఈ గడువును మార్చి చివరి వరకు పొడిగిస్తూ బ్యాంకు గతంలో నిర్ణయం తీసుకుంది.
ఈ స్కీమ్‌లో చేరిన సీనియర్ సిటిజన్స్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై అధికంగా లాభాలు పొందే అవకాశం ఉంటుంది. సాధారణంగా సీనియర్ సిటిజన్స్ సాధారణ ఖాతాదారులతో పోలిస్తే ఎఫ్‌డీలపై 50 బేసిక్ పాయింట్ల అధికంగా వడ్డీ లభిస్తుంది. అయితే ఈ స్కీమ్‌లో చేరితే మాత్రం మరో 30 బేసిక్ పాయింట్లు ఎక్కువగా వడ్డీ లభిస్తుంది. ఐదేళ్లు లేదా అపైన కాలపరిమితితో ఫిక్స్‌డ్ డిపాజిట్లకు ఈ వడ్డీ వర్తిస్తుంది. అవకాశాన్ని వినియోగించుకోవాలని సీనియర్ సిటిజన్స్‌ను ఎస్‌బీఐ కోరుతోంది. కాగా, ఇప్పటికే ఎస్‌బీఐ ఎన్నో పథకాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. హోంలోన్, అధిక వడ్డీకి సంబంధించిన పథకాలు, పెన్షన్ పథకాలు, డిపాజిట్లపై అధిక వడ్డీ ఇచ్చే పథకాలు తదితర స్కీమ్‌లను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకువస్తోంది. అంతేకాదు పిల్లలకు కూడా ప్రయోజనం చేకూర్చే పథకాలు కూడా ఎన్నో ప్రవేశపెడుతోంది. అలాగే అతి తక్కువ వడ్డీతో రుణాలు అందిస్తోంది. గృహ రుణాలపై కూడా తక్కువ వడ్డీకి అందిస్తోంది.
ఇవీ కూడా చదవండి :
Gold Price Today: మళ్లీ పెరిగిన బంగారం ధర.. దేశంలోని ప్రధాన నగరాల్లో ధరల వివరాలు ఇలా..
Andhra Bank: పాత ఆంధ్రా బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. కొత్త నిబంధనలు.. గుర్తించుకోవాల్సిన విషయాలు