Bank Locker Rules and Regulations: మీరు బ్యాంకులో లాకర్‌ను తీసుకోవాలనుకుంటున్నారా..? ఈ నియమ నిబంధనలు తెలుసుకోండి

Bank Locker Rules and Regulations: బ్యాంకుల్లో లాకర్‌ సదుపాయం పొందడానికి అందరు అర్హులే. ఇందులో వీఐపీలకే అంటూ ఏది ఉండదు. మీరు కేవలం ఒక బ్యాంకు ఖాతాను..

Bank Locker Rules and Regulations: మీరు బ్యాంకులో లాకర్‌ను తీసుకోవాలనుకుంటున్నారా..? ఈ నియమ నిబంధనలు తెలుసుకోండి
Bank Locker
Follow us

|

Updated on: Mar 15, 2021 | 1:53 PM

Bank Locker Rules and Regulations: బ్యాంకుల్లో లాకర్‌ సదుపాయం పొందడానికి అందరు అర్హులే. ఇందులో వీఐపీలకే అంటూ ఏది ఉండదు. మీరు కేవలం ఒక బ్యాంకు ఖాతాను కలిగి ఉండి, లాకర్‌ కోసం వార్షిక అద్దెను చెల్లించాల్సి ఉంటుంది. మీరు లాకర్లు కలిగిన పబ్లిక్‌, ప్రైవేటు ఏ బ్యాంకు బ్రాంచ్‌లను సందర్శించి లాకర్‌ తీసుకోవడానికి నియమ నిబంధనల గురించి తెలుసుకోండి.

లాకర్‌ పొందాలంటే..

మీరు బ్యాంకు లాకర్‌ పొందాలంటే బ్యాంకులో పొదుపు ఖాతా కలిగి ఉండాలి. లాకర్‌ను పొందడానికి బ్యాంకులో పొదుపు ఖాతాను తెరవడం ముఖ్యమైనది. ఖాతా తెరవడానికి కావాల్సిన పత్రాలు, ఆధార్‌, పాన్‌కార్డు, ఫారం 60, కేవైసీ పత్రాలు అవసరం. అయితే ప్రతి బ్యాంకు లాకర్‌ ఒప్పందం కలిగి ఉంటుంది. మీరు సదరు బ్యాంకుల్లో లాకర్‌ పొందడానికి ఈ ఒప్పందాన్ని అంగీకరించి సంతకం చేయాల్సి ఉంటుంది. ఇది నష్టపరిహార నిబంధనను కలిగి ఉంటుంది. అలాగే దీనిని రు.100 విలువ చేసే స్టాంప్‌ కాగితంపై రాస్తారు.

కాగా, బ్యాంకులు మిమ్మల్ని ముందుగానే లాకర్‌ అద్దె అడ్వాన్స్‌ చెల్లించాల్సిందిగా అడుగుతారు. అలాగే డిపాజిట్‌ రూపంలో ఒక నిర్ధిష్టమైన మొత్తాన్ని తీసుకుంటాయి బ్యాంకులు. ఈ నిబంధనలు అన్ని బ్యాంకులకు ఒకే విధంగా ఉంటాయి. కానీ లాకర్‌ అద్దె మాత్రం బ్యాంకును బట్టి మారుతుంటుంది. ఇతర ప్రత్యేక నియమ నిబంధనలు ఖాతాదారులే నింపాల్సి ఉంటుంది.

వేర్వేరు బ్యాంకులకు వేర్వేరు చార్జీలు:

కాగా, భారతదేశంలో బ్యాంకు లాకర్‌ను తెరవడానికి అద్దె లేదా డిపాజిట్‌ రూపంలో ఎంత మొత్తాన్ని చెల్లించాలో బ్యాంకులు చెబుతాయి. వివిధ నగరాలలోని ఎస్‌బీఐ, యాక్సిస్‌ బ్యాంకు, ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులకు వేర్వేరు రేట్లు ఉంటాయి.మీరు ప్రత్యేకంగా లాకర్‌ను పొందాలనుకున్న శాఖకు వెళితే రేట్లను వివరిస్తారు.

లాకర్‌ తాళాలను ఎన్ని అందిస్తారు:

ఉమ్మడి పేరులో లాకర్‌ తీసుకున్నప్పటికీ లాకర్‌ యజమానికి ఒక తాళం చెవిని మాత్రం అందిస్తారు. లాకర్‌ ఒప్పందంలో తాళం చెవి కీలకమైనది. దానిని జాగ్రత్తగా భద్రపర్చుకోవాల్సి ఉంటుంది. ఒక వేళ అది పోగొట్టుకున్నా.. ఖాతాదారులు వెంటనే బ్యాంకుకు తెలియజేయాలి.

మీ బ్యాంకు లాకర్‌ తాళం చెవి పోయినట్లయితే..?

మీ బ్యాంకు లాకర్‌ తాళం చెవి పోయినట్లయితే పరిస్థితి ఏమిటి.? అలాంటి సమయంలో బ్యాంకు అధికారులు లాకర్‌ను బద్దలు కొట్టి తెరుస్తారు. దానికి అయ్యే ఖర్చులను ఖాతాదారుడే భరించాల్సి ఉంటుంది. అనంతరం ఆ లాకర్‌కు ఒక కొత్త లాక్‌ను అమర్చి దాని తాళం చెవులను ఖాతాదారుడికి అందజేస్తారు. అయితే బ్యాంకు లాకర్‌ను ఆపరేట్‌ చేయడానికి కేవలం లాకర్‌ హోల్డర్‌ని మాత్రమే అనుమతిస్తుంది బ్యాంకు.

లాకర్‌ ఒప్పందం ఏమిటి..?

లాకర్‌ ఒప్పందం అంటే… లాకర్‌ యజమాని, బ్యాంకు మధ్య కుదుర్చుకున్న ఒప్పందం. ఖాతాదారుడి మధ్య సంబంధాన్ని కలిగి ఉంటుంది. ఖాతాదారుడు తనకు కేటాయించిన లాకర్‌లో అక్రమ వస్తువులను నిల్వ చేయకుండా లాకర్‌కు చెల్లించాల్సిన వార్షిక అద్దె చెల్లించడం వంటి ప్రాథమిక నిబంధనలను అంగీకరిస్తున్నట్లు ఒప్పందంలో సంతకం చేయాల్సి ఉంటుంది. ఇది ఒక్కో బ్యాంకుకు ఒక్క పద్దతి ఉంటుంది. బ్యాంకు లాకర్‌ పొందాలంటే ఈ నిబంధనలు తప్పనిసరి.

లాకర్‌లో అభరణాలు ఉంచడం సురక్షితమేనా..?

లాకర్‌లో బంగారు అభరణాలను ఉంచడం సురక్షితమే. కానీ దానికి బ్యాంకులు బాధ్యత వహించవు.

రెండు తాళం చెవులను ఉపయోగించి లాకర్‌ తెరవవచ్చు. వాటిలో ఒకటి ఖాతాదారుడి దగ్గర ఉన్న తాళంతో, అలాగే మరొకటి బ్యాంకు వారి ఆధీనంలో ఉన్న మరో తాళంతో తెరవవచ్చు. ఈ రెండు తాళాలను ఒకేసారి ఉపయోగించినప్పుడు మాత్రమే లాకర్‌ తెరుచుకుంటుంది. అందుకే లాకర్‌ గదిలోకి ఖాతాదారుడితో పాటు బ్యాంకర్‌ కూడా వచ్చి ఒకేసారి ఇద్దరూ లాకర్‌ తెరుస్తారు. అనంతరం బ్యాంకర్‌ తన తాళంను తీసుకుని లాకర్‌ గది నుంచి బయటకు వెళ్లిపోతాడు. లాకర్‌ను ఒక్క తాళం చెవి ద్వారా మాత్రమే మూసివేయవచ్చు. కాగా, అరుదైన పరిస్థితుల్లో మాత్రమే లాకర్‌ను బద్దలు కొట్టే అవకాశం ఉంటుంది. నామినీ పేరును నమోదు చేయకుండా లాకర్‌ యజమాని మరణించినట్లయితే, లాకర్‌ తాళం చెవిని పోగొట్టుకున్నప్పుడు నిర్ధిష్ట సమయం కంటే ఎక్కువ సమయం లాకర్‌ను నిర్వహించని సందర్భాలలో మాత్రమే లాకర్‌ బద్దలు కొట్టే చాన్స్‌ ఉంటుంది.

ఖాతాదారుడి అనుమతి లేకుండా బ్యాంకు సిబ్బంది లాకర్‌ తెరవవచ్చా..?

ఖాతాదారుడి అనుమతి లేకుండా బ్యాంకు సిబ్బంది లాకర్‌ తెరవవచ్చా..? అనే సందేహం రాకమానదు. కేవలం కొన్ని సందర్భాల్లో మాత్రమే బ్యాంకులు లాకర్‌ యజమాని అనుమతి లేకుండా లాకర్‌ను తెరిచే అవకాశం ఉంటుంది. కోర్టు ఆదేశాల మేరకు బ్యాంకు ఖాతాదారుడి ప్రమేయం లేకుండా లాకర్‌ని తెరుస్తుంది. అలాగే నిర్ధష్ట సమయం కంటే ఎక్కువ కాలం పాటు ఖాతాదారుడు లాకర్‌ అద్దె చెల్లించకపోతే అప్పుడు బ్యాంకు అతనికి పలుమార్లు రిమైండర్లు, నోటిసులను పంపుతుంది. అయినప్పటికీ అతను అద్దె చెల్లించని సమయంలో బ్యాంకు అతడి లాకర్‌ తెరుస్తుంది. అలాగే కొన్ని సందర్భాలలో అద్దె చెల్లించినప్పటికీ లాకర్‌ని ఒక ఏడాదిపాటు నిర్వహించకపోయినా కూడా బ్యాంకు లాకర్‌ని తెరిచే వీలు ఉంటుంది.

ఇవీ చదవండి :

Two-Day Bank Strike: సమ్మెబాట పట్టిన జాతీయ బ్యాంకులు.. సోమ, మంగళవారాల్లో బంద్..

Silver Price Today: దేశంలో తాజాగా వెండి ధరలు.. దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరల వివరాలు

Gold Price Today: వరుసగా రెండో రోజు స్వల్పంగా పెరిగిన గోల్డ్‌ ధరలు.. సోమవారం 10 గ్రాముల బంగారం ధర ఎంతంటే..