Gold Price Today: వరుసగా రెండో రోజు స్వల్పంగా పెరిగిన గోల్డ్‌ ధరలు.. సోమవారం 10 గ్రాముల బంగారం ధర ఎంతంటే..

Gold Price Today: లాక్‌డౌన్‌ సమయంలో బంగారం ధరలు ఓ రేంజ్‌లో పెరిగిన విషయం తెలిసిందే. ఒకానొక సమయంలో తులం బంగారం ఏకంగా రూ.55 వేల వరకు చేరుకుంది. ఆకాశమే హద్దుగా పెరిగిన ధరలను చూసి సామాన్యులు భయాందోళనకు గురయ్యారు...

Gold Price Today: వరుసగా రెండో రోజు స్వల్పంగా పెరిగిన గోల్డ్‌ ధరలు.. సోమవారం 10 గ్రాముల బంగారం ధర ఎంతంటే..
Gold Price Today
Follow us
Narender Vaitla

|

Updated on: Mar 15, 2021 | 5:23 AM

Gold Price Today: లాక్‌డౌన్‌ సమయంలో బంగారం ధరలు ఓ రేంజ్‌లో పెరిగిన విషయం తెలిసిందే. ఒకానొక సమయంలో తులం బంగారం ఏకంగా రూ.55 వేల వరకు చేరుకుంది. ఆకాశమే హద్దుగా పెరిగిన ధరలను చూసి సామాన్యులు భయాందోళనకు గురయ్యారు. అయితే తదనంతరం జరిగిన పరణామాల తర్వాత గోల్డ్‌ ధరలు తగ్గుతూ వచ్చాయి. రూ.55 వేల నుంచి రూ.47 వేల వరకు చేరుకుంది. ఇదిలా ఉంటే నేల చూపులు చూస్తోన్న గోల్డ్‌ ఇటీవల మళ్లీ పెరుగుతోంది. అయితే పెద్ద మొత్తంలో కాకుండా చాలా స్వల్పంగా పెరుగుతోంది. ఆదివారం సుమారు రూ.100కిపైగా పెరిగిన గోల్డ్‌ ధరల్లో సోమవారం కూడా స్వల్ప పెరుగుదల కనిపించింది. మరి ఈ రోజు దేశవ్యాప్తంగా బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం. దేశ రాజధాని న్యూఢిల్లీలో 22 క్యారెట్ల గోల్డ్‌ ధర ఆదివారంతో పోల్చితే రూ.10 పెరిగి 10 గ్రాముల బంగారం రూ.44,160 వద్ద కొనసాగుతోంది. ఇక 24 క్యారెట్ల గోల్డ్‌ ధర కూడా 10 రూపాయలు పెరిగి రూ. 48,170గా ఉంది. ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబయి కూడా ఇదే పెరుగుదల కనిపంచింది. సోమవారం ముంబయిలో పది గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ రూ. 43,870 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ.44,870 వద్ద కొనసాగుతోంది. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే.. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో పది గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 42,010గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ. 45,830 వద్ద కొనసాగుతోంది. విజయవాడలో 22 క్యారెట్ల తులం బంగారం రూ.42,010 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.45,830గా ఉంది. విశాఖపట్నంలోనూ ఇదే ధరలు కొనసాగుతున్నాయి. ఇక దక్షిణ భారతదేవశంలో మరో ముఖ్య నగరమైన చెన్నైలో 22 క్యారెట్ల తులం బంగారం రూ.42,310 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ.46,160 వద్ద కొనసాగుతోంది.

Also Read: SBI Marriage Loan : మీ ఇంట్లో వివాహ వేడుకకి నగదు తగ్గిందా..! అటువంటి వారికోసమే ఎస్బిఐ బంపర్ ఆఫర్

EPF: మీరు ఈపీఎఫ్‌ ఖాతాదారులా..? అయితే హోమ్‌, పర్సనల్‌ లోన్‌ పొందొచ్చు.. అందుకోసం ఈ స్టెప్స్‌ ఫాలో అవ్వండి..

ICICI Bank FD scheme: సీనియ‌ర్ సిటిజ‌న్లకు గుడ్ న్యూస్.. అధిరిపోయే ఆఫర్ ప్రకటించిన ఐసీఐసీఐ..

కష్టపడ్డ సొమ్ము ఎక్కడికిపోదు..! 72 చోరీ కేసుల్లో 102 మంది అరెస్ట్
కష్టపడ్డ సొమ్ము ఎక్కడికిపోదు..! 72 చోరీ కేసుల్లో 102 మంది అరెస్ట్
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
మీకు ఈ విషయం తెలుసా? బంగారం అమ్మేటప్పుడు ధర ఎందుకు తగ్గుతుంది?
మీకు ఈ విషయం తెలుసా? బంగారం అమ్మేటప్పుడు ధర ఎందుకు తగ్గుతుంది?
అతను మల్టి ఫార్మాట్ బౌలర్ గా ఎదగగలడు
అతను మల్టి ఫార్మాట్ బౌలర్ గా ఎదగగలడు
హోండా యాక్టివా ఈవీ విడుదలకు ముహూర్తం ఫిక్స్..!
హోండా యాక్టివా ఈవీ విడుదలకు ముహూర్తం ఫిక్స్..!
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!
ఆదివారం రోజు ఈ నివారణలు చేయండి.. ఇంట్లో డబ్బులకు లోటు ఉండదు
ఆదివారం రోజు ఈ నివారణలు చేయండి.. ఇంట్లో డబ్బులకు లోటు ఉండదు
ఆన్‌లైన్‌ లక్కీ డ్రాలో మీరే విజేత.. రూ.15లక్షలు, కారు మీ సొంతం..!
ఆన్‌లైన్‌ లక్కీ డ్రాలో మీరే విజేత.. రూ.15లక్షలు, కారు మీ సొంతం..!
ఔట్ అయింది ఎవరు? వికెట్ తీసింది ఎవరు? ద్రావిడ్ ఆశక్తికర ప్రశ్న..
ఔట్ అయింది ఎవరు? వికెట్ తీసింది ఎవరు? ద్రావిడ్ ఆశక్తికర ప్రశ్న..
శీతాకాలంలో కారు ప్రయాణమా..? ఇవి లేకుంటే చాలా ప్రమాదం
శీతాకాలంలో కారు ప్రయాణమా..? ఇవి లేకుంటే చాలా ప్రమాదం