- Telugu News Photo Gallery Business photos How to apply home loan and personal loan through epf account
EPF: మీరు ఈపీఎఫ్ ఖాతాదారులా..? అయితే హోమ్, పర్సనల్ లోన్ పొందొచ్చు.. అందుకోసం ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి..
Loans For EPF Members: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ తమ ఖాతాదారుల కోసం గృహ, వ్యక్తిగత రుణాలను అందిస్తోంది. ఈపీఎఫ్‌ఓ అకౌంట్ ద్వారా ఆన్‌లైన్‌లో నేరుగా లోన్ అప్లై చేసుకునేలా అవకాశం కల్పించారు. లోన్ పొందాలనుకునే వారు ఎలా అప్లై చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..
Updated on: Mar 15, 2021 | 2:52 AM

ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్) తమ ఖాతాదారులకు గృహ రుణాలతో పాటు, వ్యక్తిగత రుణాలను అందిస్తోంది. లోన్ కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

పాస్ బుక్ పోర్టల్ (https://passbook.epfindia.gov.in/MemberPassBook/Login)లో UAN నెంబర్, పాస్ వర్డ్ ఎంటర్ చేయడం ద్వారా మీ పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు

అనంతరం మేనేజ్ సెక్షన్‌లోకి వెళ్లి.. ఆధార్, పాన్ కార్డ్ నెంబర్, బ్యాంక్ ఖాతా వివరాలు ఎంటర్ చేయాలి.

తర్వాత ఆన్‌లైన్ సర్వీసెస్‌కు వెళ్లి అందులో క్లెయిమ్ (ఫార్మ్- 31, 19, 10సీ) ఆప్షన్ ఎంచుకోవాలి.

అనంతరం మీ బ్యాంక్ ఖాతాలోని చివరి 4 అంకెలు నమోదు చేసి వెరిఫై ఆప్షన్‌పై నొక్కాలి. మొత్తం వివరాలు నమోదు చేశాక 'ఎస్' ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.

తర్వాత ప్రోసీడ్ ఫర్ ఆన్‌లైన్ క్లెయిమ్ ఆప్షన్ ఎంచుకొని.. 'ఐ వాంట్ టూ అప్లై ఫర్ లోన్' ఆప్షన్‌ను ఎంచుకోవాలి. ఇక్కడ లోన్ ఎందుకు తీసుకోవాలనుకుంటున్నారు, ఎంత నగదు కావాలి లాంటి వివరాలు ఎంటర్ చేయాలి.

అన్ని వివరాలు సరిగ్గా ఉండి Employer ఆమోదం తెలిపితే 15 నుంచి 20 రోజుల్లోగా ఖాతాదారుల అకౌంట్‌కు డబ్బులు జమ అవుతాయి.




