అర కిలో బియ్యం ధర 1 మిలియన్ కరెన్సీ.. ప్రపంచంలోనే అతిపెద్ద నోటును విడుదల చేసిన అమెరికా లాటిన్ దేశం..
Venezuela Issued: ఆర్ధిక వ్యవస్థ క్షీణిస్తోంది.. ద్రవ్యోల్బణం దాగుడు మూతలాడుతోంది. ఇదంతా ఏ దేశం గురించో తెలుసా.. నిన్న మొన్నటి వరకు ఆర్దికంగా ఎదిగిన లాటిన్ దేశం గురించి...
Venezuela Issued 10 Lakh Bolivar Note: ఆర్ధిక వ్యవస్థ క్షీణిస్తోంది.. ద్రవ్యోల్బణం దాగుడు మూతలాడుతోంది. ఇదంతా ఏ దేశం గురించో తెలుసా.. నిన్న మొన్నటి వరకు ఆర్దికంగా ఎదిగిన లాటిన్ దేశం గురించి. ఇప్పుడు అక్కడ దేశ రిటైల్ ద్రవ్యోల్బణం మూడు నెలల్లో 5.03 శాతానికి చేరుకుంది. ఇలాంటి పరిస్థితిలో పెరుగుతున్న ద్రవ్యోల్బణం వల్ల ఏమి జరుగుతుందనే అనే ప్రశ్నలు రావడం సహజం. లాటిన్ అమెరికా దేశం వెనిజులా 10 లక్షల బొలీవారెస్ నోటును జారీ చేయడం ద్రవ్యోల్బణంపై ఎఫెక్ట్ చూపించింది.
విలువ పరంగా.. ఇది 52 US సెంట్లకు సమానం అంటే భారత కరెన్సీ ప్రకారం 37 రూపాయలు. అక్కడి సెంట్రల్ బ్యాంక్ లెక్కల ప్రకారం ద్రవ్యోల్బణ రేటు 2665 శాతానికి చేరుకుంది. రాయిటర్స్ నివేదిక ప్రకారం.. రాబోయే రోజుల్లో 2 లక్షలు, 5 లక్షల బొలీవర్ నోట్లను ముద్రించనున్నట్లు వెనిజులా సెంట్రల్ బ్యాంక్ వెల్లడించింది. ప్రస్తుతం 10 వేల, 20 వేల, 50 వేల బోలివర్ నోట్లు ఇప్పటికే చెలామణిలో ఉన్నాయి. వీటి విలువ సుమారు 1 మిలియన్ బోలివర్లలో అర కిలో బియ్యం కొనవచ్చు. అంటే అర్థం చేసుకోండి ఇప్పుడు అక్కడి కరెన్సీ విలువ ఎలాంటి స్థితికి చేరుకుందో…
సెంట్రల్ బ్యాంక్ నిల్వలు…
వెనిజులా దేశానికి ఆర్ధిక రాబడి పెట్రో ఉత్పత్తుల నుంచే కావడం విశేషం. ప్రభుత్వ ఆదాయంలో 95% చమురు నుండే కొనసాగింది. అయితే చమురు ఉత్పత్తి కారణంగా ఇది కూడా గొప్పగా వెలిగింది. అయితే గత ఏడు సంవత్సరాలలో చమురు ధరలు తగ్గడంతో అక్కడ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. దేశంలోని సెంట్రల్ బ్యాంక్ నిల్వలు 50 సంవత్సరాలలో కనిష్ట స్థాయికి చేరుకున్నాయి. ద్రవ్య లోటు ఎంత పెరిగిందో, సెంట్రల్ బ్యాంక్ కరెన్సీ నోట్లను పెద్ద ఎత్తున ముద్రించాల్సి వచ్చింది. ఈ కారణంగా, నోట్ల పరిమాణం పెరుగుతోంది, కానీ విలువ తగ్గుతోంది.
ఆర్థిక వ్యవస్థ 20 శాతం తగ్గుతుంది
కరోనా వైరస్ వ్యాప్తితో లాక్డౌన్ చిక్కులు మొదలయ్యాయి. ప్రపంచ వ్యాప్తంగా చమురు నుంచి వచ్చే రాబడి తగ్గిపోయింది. దీంతో వెనిజులా ఆర్థిక వ్యవస్థ భారీగా క్షీణించింది. ఈ ఏడాది చివరి నాటికి ఈ దేశ ఆర్థిక వ్యవస్థ 20 శాతం తగ్గిపోతుందనే అంచనా వేస్తున్నారు ప్రపంచ ఆర్ధిక విశ్లేషకులు.
అమెరికాపై విమర్శలు
అమెరికా ప్రభుత్వంపై వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో విమర్శలు గుప్పించారు. తమ దేశ ఆర్ధిక వ్యవస్థ దిగజారి పోవడానికి అమెరికా సర్కార్ తీసుకున్న నిర్ణయాలే కారణమని ఆవేదన వ్యక్తం చేశారు. అమెరికా ఆంక్షలు పెట్టడంతో తమ ద్రవ్యోల్బనం క్షీణించిందని అన్నాడు.