పోషకాహార నిధి..నోరూరించే “గోధుమ రవ్వ హల్వా’..ఈ సారి ఇలా ట్రై చేసి చూడండి..! టెస్ట్‌ అదుర్స్‌!!

కొంచం తింటే చాలు.. కడుపు నిండిపోయేలా ఉండాలి. తిన్నవాటికి మనసంతా హాయిగా ఉండాలి. అలాగే బోల్డన్ని పోషకాలు అందాలి. వీటన్నింటిని ఒకే ఆహారంలో

పోషకాహార నిధి..నోరూరించే గోధుమ రవ్వ హల్వా'..ఈ సారి ఇలా ట్రై చేసి చూడండి..! టెస్ట్‌ అదుర్స్‌!!
Wheat Ravva Halwa
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 15, 2021 | 1:36 PM

కొంచం తింటే చాలు.. కడుపు నిండిపోయేలా ఉండాలి. తిన్నవాటికి మనసంతా హాయిగా ఉండాలి. అలాగే బోల్డన్ని పోషకాలు అందాలి. వీటన్నింటిని ఒకే ఆహారంలో పొందాలి అనుకుంటే.. అది ఖచ్చితంగా గోధుమ రవ్వే. దానినే కొందరు దాలియా అని కూడా అంటారు. దీంతో ఎన్నో రకాల వంటలవు చేసుకోవచ్చు. శరీరానికి కావాల్సిన పోషకాలను అందించడమే కాకుండా.. నోరూరించే టేస్టీగా ఉంటాయి. అయితే ఈ సారి మరింత రుచికరమైన గోధుమ రవ్వ హల్వా ఎలా చేయాలో తెలుసుకుందామా.

కావల్సిన పదార్థాలు..

గోధుమ రవ్వ.. కప్పు పంచదార పొడి.. అరకప్పు నెయ్యి.. అరకప్పు.. యాలకుల పొడి.. చిటికెడు జీడిపప్పు, పిస్తా పలుకులు.. పావుకప్పు. కిస్ మిస్, తురిమిన బాదంలు.. రెండు టేబుల్ స్పూన్లు..

తయారీ విధానం..

ముందుగా కడాయిలో నెయ్యి వేడిచేసి తక్కువ మంట మీద దాలియాను వేయించాలి. అందులోనే పంచదార పొడి, రెండు కప్పుల వేడినీళ్లు పోసి బాగా కలపాలి. ఆ తర్వాత అందులో యాలకుల పొడి, డ్రైఫ్రూట్స్ వేసి కలుపుతూ ఉండాలి. ఇక ఉడికిన హల్వాను వేరే ప్లేటులోకి తీసుకోవాలి. చివరగా.. ఇందులో బాదం, పిస్తా, జీడిపప్పు పలుకులను పైన అలంకరించుకోవాలి. అంతే మరింత రుచికరమైన గోధుమ రవ్వ హల్వా రెడి అయిపోతుంది.  మీకు తినాలని కోరిక కలిగినపుడు ఎప్పుడుకావాలంటే అపుడు దీనిని వండుకొని తినొచ్చు.

Also Read:

ఆ ఇంజనీర్ సృష్టి అద్భుతం.. ఎండకాలంలో కూడా కరగని మంచు హోటల్.. ఎక్కడుందో తెలుసా..

బరువు తగ్గేందుకు ఆలోచిస్తున్నారా ? ఈ 5 రకాల టీలను తాగితే సులభంగా వెయిల్ లాస్..