AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బరువు తగ్గేందుకు ఆలోచిస్తున్నారా ? ఈ 5 రకాల టీలను తాగితే సులభంగా వెయిల్ లాస్..

Weight Loss Tips: అధిక బరువు అన్నింటిని మించిన భారీ సమస్యగా మారిపోయింది. మరీ ముఖ్యంగా వయసుతో సంబంధం లేకుండా ఈ సమస్యతో బాధపడే

బరువు తగ్గేందుకు ఆలోచిస్తున్నారా ? ఈ 5 రకాల టీలను తాగితే సులభంగా వెయిల్ లాస్..
Best Teas For Weight Loss
Rajitha Chanti
|

Updated on: Mar 15, 2021 | 8:25 AM

Share

Weight Loss Tips: అధిక బరువు అన్నింటిని మించిన భారీ సమస్యగా మారిపోయింది. మరీ ముఖ్యంగా వయసుతో సంబంధం లేకుండా ఈ సమస్యతో బాధపడే యువతీయువకులు అనేకం. ఇక శరీరంలో ఉండే అధిక కొవ్వును తగ్గించుకునేందుకు వారు చేసే ప్రయాత్నాల గురించి చెప్పాల్సిన పనిలేదు. ఆర్థికంగానే కాకుండా.. శారీరకంగా, మానసికంగా ఎన్నో సమస్యలకు గురవతుంటారు. అయితే వెయిల్ లాస్ అవ్వడానికి మరీ అంత కష్టపడాల్సిన అవసరం లేదంటున్నారు నిపుణులు. కేవలం ఈ ఐదు రకాల టీలలో ఏదో ఒక టీ రోజూ తాగితే వెయిల్ లాస్ అవ్వడమే కాకుండా.. తొందరగా ఈ సమస్యల నుంచి విముక్తి పొందుతారట. కేవలం టీ మాత్రమే కాకుండా.. శారీరానికి కావాల్సిన వ్యాయమాలను చేస్తే క్రమంగా బరువు తగ్గుతారు. జంక్ ఫుడ్, కూల్ డ్రింక్స్ కాకుండా.. ఇంట్లో ఉండే పోషకాహర వంటలను తీసుకోవడం… శారీరానికి తగినంత శ్రమ కల్పించడం చేస్తూ ఉంటే సులభంగా వెయిట్ అవుతారు. ఇక ఇవే కాకుండా కొన్ని రకాల ట్రీలను రోజూ తాగితే అధిక బరువు సమస్యను నుంచి విముక్తి పొందుతారట. మరీ అవెంటో తెలుసుకుందామా.

1. పుదీనా టీ.. మార్కెట్లో విరివిగా లభిస్తుంది పుదీనా. దీనిని పండించడానికి ఎలాంటి రసాయనిక ఎరువులు అవసరం లేదు. ఎల్లప్పుడు తడిగా ఉండే ప్రదేశంలో దీనిని నాటితే సులభంగా పెరుగుతుంది. వంటల్లో రుచికే కాకుండా.. ఇది ఆరోగ్యానికి ఎన్నో రకాల ప్రయోజనాలను చేకూరుస్తుంది. బరువు తగ్గాలని ప్రయత్నించేవారికి ఇది సరైన ఔషదం. ఈ టీలో సహజంగా ఆకలి తగ్గించే గుణం ఉంటుంది. పుదీనా టీ తాగడం వలన క్రమంగా బరువు తగ్గుతారు.

2. బ్లాక్ టీ.. ఇందులో ఎక్కువగా కెఫిన్ ఉంటుంది. ఇది బరువు తగ్గించేందుకు ఉపయోగపడుతుంది. శరీరంలోకి కెఫిన్ ఎంత ఎక్కువగా వెళితే.. అన్ని క్యాలరీలు తగ్గేందుకు సహయపడతాయి. ఓ సర్వే ప్రకారం రోజూలో 3 సార్లు ఈ బ్లాక్ టీ తాగడం వలన సులభంగా బరువు తగ్గే అవకాశాలున్నాయి. అలాగే నడుము, పొట్ట దగ్గర ఉండే కొవ్వును కూడా తగ్గిస్తుంది.

3. గ్రీన్ టీ.. దీనిని ఎక్కువగా బరువు తగ్గాలనుకునే వారు తాగుతుంటారు. రోజూ గ్రీన్ టీ తాగే వ్యక్తులు.. 7.3 పౌండ్లు బరువు కోల్పోయినట్లుగా 2008లో జరిగిన ఓ సర్వేలో వెల్లడైంది. ఇందులో కాటెచిన్స్ అనే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరంలో జీవక్రియను పెంపొదిస్తాయి. అలాగే శరీరంలోని కొవ్వులను తగ్గించేందుకు సహకరిస్తాయి. ఇందులో ఉండే కాటెచిన్స్.. ఎఎంపీని యాక్టీవ్ చేస్తుంది. ఎఎంపీ అంటే యాక్టీవ్ ప్రోటిన్ కినేస్. ఇది శరీరంలోని కొవ్వు, క్యాలరీలను కరిగించడంలో సహయపడుతుంది.

4. ఓలాంగ్ టీ.. గ్రీన్ టీ, బ్లాక్ టీలకు ఉపయోగించే మొక్కల ఆకులతోనే తయారు చేసే టీని ఓలాంగ్ టీ అంటారు. ఇది శరీరంలో జీవక్రియను పెంపొందిస్తుంది. శరీరంలో పేరుకుపోయిన కొవ్వును శక్తిలా మార్చుతుంది. ఇది బరువు తగ్గేందుకు సహయపడుతుంది. 2009లో జరిగిన ఓ ప్రకారం రోజూ రెండు కప్పుల ఓలాంగ్ టీ తాగిన మహిళలు కేవలం మూడు రోజుల్లోనే 2.2 పౌండ్ల బరువు తగ్గినట్లుగా వెల్లడైంది.

5. వైట్ టీ.. ఇందులో శరీరంలోని అధిక కొవ్వులను బర్న్ చేసే పాలిఫెనాల్స్ ఉంటాయి. ఇవి కొవ్వును కరిగించడమే కాకుండా.. నూతన కొవ్వు కణాలు పెరగకుండా చేస్తాయి. అంతేకాకుండా.. ఇది శరీర జీవక్రియను పెంపొందిస్తుంది. రోజూ అదనంగా 70 నుంచి 100 క్యాలరీలు కరిగేందుకు సహకరిస్తుంది.

Also Read:

ఈ ఎండాకాలంలో మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు ఉత్సాహంగా ఉండేందుకు ఈ దుస్తులను ధరించండి..