ఈ ఎండాకాలంలో మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు ఉత్సాహంగా ఉండేందుకు ఈ దుస్తులను ధరించండి..
Summer Dressing Ideas: వేసవికాలం ప్రారంభంలోనే ఎండలు దంచికొడుతున్నాయి. ఇప్పటికే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
Summer Dressing Ideas: వేసవికాలం ప్రారంభంలోనే ఎండలు దంచికొడుతున్నాయి. ఇప్పటికే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక ఈ వేసవికాలంలో దుస్తులు ఎలాంటి దుస్తులు ధరించాలనేది కూడా ముఖ్యమే. సూర్యరశ్మి నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి కొన్ని రకాల దుస్తులను ఎంచుకోవాల్సి ఉంటుంది. అలాగే.. ఉదయం బయటకు వెళ్ళి సాయంత్రం మళ్లీ ఇంటికి చేరేవరకు ఉత్సహంగా ఉండాలంటే కొన్ని రకాల దుస్తులను ఎంచుకోవడం ఉత్తమం. మరీ అలాంటి దుస్తుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
* లేతరంగు దుస్తులు.
ఈ వేసవికాలంలో ఎక్కువగా డార్క్ కలర్స్ కాకుండా లైట్ కలర్ దుస్తులను ఎంచుకోవడం ఉత్తమం. అలాగే ప్లేన్ దుస్తులు కాకుండా.. చెక్స్ మోడల్ దుస్తులను ఎంచుకోవడం వలన రోజంతా ఉత్సహంగా ఉంటాయి. ఇక ఈ వేసవిలో ఎక్కడికైనా టూర్ ప్లాన్ చేసుకుంటే.. అప్పుడు వైట్ స్నీకర్స ల్ లేదా పెన్సిల్ హిల్స్ దరించడం ఉత్తమం. అలాగే బెల్డ్ మోడల్ దుస్తులు ధరించడం ఉత్తమం.
* జంఫూట్స్..
జంప్ సూట్ అనేది ప్రస్తుతం కాలంలో స్టైలీష్ గా మారిపోయింది. ఇది మిమ్మల్సి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉత్సహంగా ఉంచేందుకు సహయపడతాయి. అలాగే వీటిపై బ్లెజర్స్, సన్నని ఆభరణాలు ధరించడం వలన మరింత ప్రొఫెషనల్ గా కనిపిస్తారు. ఈ జంపు సూట్స్ కు బెల్ట్ వాడడం, కళ్లజోటు వాడడం చేయడం ద్వారా మరింత అందంగా కనిపిస్తారు.
* ఆకర్శణీయమైన స్కర్ట్స్..
ఈ వేసవికాలంలో శరీరానికి తగ్గట్టుగా స్కర్ట్స్ ఎంచుకోవడం ఉత్తమం. ఈ రూపానికి తగ్గట్లుగా నేవీ బ్లూ లెదర్ ర్యాప్ స్కర్ట్ ను ఎంచుకోవడం ఉత్తమం. వీటికి హేవీ జువెల్లరీ కాకుండా.. తక్కువ వెయిట్ జువెల్లరీని దరించడం వలన వెంటనే అలసట చెందకుండా.. రోజంతా ఉత్సహంగా ఉంటారు.
* స్మాల్ బ్లాక్ డ్రెస్..
ముఖ్యంగా ఉద్యోగస్తులు ఈ బ్లాక్ డ్రెస్ ఎంచుకోవడం ఉత్తమం. కాకపోతే ఎక్కువగా బ్లాక్ కాకుండా.. వాటిపై రకరకాల ప్రింట్స్ ఉండటం చూసుకోవాలి. అలాగే స్లీవ్ లేస్ లేదా పొడవాటి స్లీవ్ లు కలిగి ఉన్నవి ఎంచుకోవడం వలన ప్రొఫెషనల్ గా కనిపిస్తారు.
Also Read:
కుంకుడు కాయలు జుట్టు సంరక్షణకు సహయపడతాయా ? అసలు విషయాలెంటో తెలుసుకొండిలా..