AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కుంకుడు కాయలు జుట్టు సంరక్షణకు సహయపడతాయా ? అసలు విషయాలెంటో తెలుసుకొండిలా..

ప్రస్తుతం చాలా మంది జుట్టు సమస్యతో బాధపడుతున్నారు. జుట్టు రాలడం, నిర్జీవంగా మారడం వంటి సమస్యలు చాలానే ఎదుర్కోంటున్నారు.

కుంకుడు కాయలు జుట్టు సంరక్షణకు సహయపడతాయా ? అసలు విషయాలెంటో తెలుసుకొండిలా..
Shikakaya
Rajitha Chanti
|

Updated on: Mar 13, 2021 | 12:47 PM

Share

ప్రస్తుతం చాలా మంది జుట్టు సమస్యతో బాధపడుతున్నారు. జుట్టు రాలడం, నిర్జీవంగా మారడం వంటి సమస్యలు చాలానే ఎదుర్కోంటున్నారు. అయితే జుట్టు సంరక్షణకు ఎన్నో రకాల షాంపూలు, నూనేలు వాడుతుంటారు. అయిన ఎలాంటి ఫలితాలు కనిపించవు. పూర్వం పెద్దవాళ్లు జుట్టు కోసం కుంకుడు కాయలను వాడుతుండేవారు. ఇది జుట్టు రాలడం సమస్యను, పొడిబారడం వంటి సమస్యలను నివారిస్తుందని అంటుంటారు. చాలా మందికి కుంకుడు కాయల వలన కలిగే ప్రయోజనాలు తెలియవు. శీకకాయ ఎన్ని ప్రయోజనాలను కలిగిస్తుందో తెలుసుకుందామా.

శీకకాయ ప్రయోజనాలు..

– శీకకాయ తన తలకు వేడిని తగ్గించి.. ఉపశమనం కలుగజేస్తుంది. అలాగే తలలో దురద, మంటను తగ్గిస్తుంది. అలాగే పొడి చర్మం ఉన్నవారికి జుట్టు పెరుగుదలలో సహయపడుతుంది. అలాగే జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది. – ఇది జుట్టు రాలడం వంటి సమస్యను నివారిస్తుంది. అలాగే షైనీగా, సిల్కీగా చేస్తుంది. అంతేకాకుండా.. జుట్టు కుదుళ్లు విచ్చిన్నం కాకుండా చేసి.. జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. – జుట్టును శుభ్రపరిచే సమయంలో శీకకాయను ఉపయోగించడంవలన పోడిబారడం తగ్గించడమే కాకుండా.. ఎక్కువ సమయంలో స్మూత్ గా ఉండేందుకు సహయపడుతుంది.

ఎలా ఉపయోగించాలో తెలుసా..

ఈ శీకకాయను పొడి రూపంలో వాడడం ఉత్తమం. దీనిని షాంపుకు, కండిషనర్లకు జతచేసి వాడవచ్చు. అలాగే దీనిని జుట్టుకు మాస్క్ ల ఉపయోగించవచ్చు. ఇది చుండ్రు సమస్యను తగ్గించడమే కాకుండా.. జుట్టూ స్మూత్ గా ఉండేలా చేస్తుంది. అలాగే దీనిని గుడ్డుతో జతచేసి హెయిర్ మాస్క్ వేసుకోవడం వలన జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.అంతేకాకుండా.. జుట్టును ఎక్కువ సమయం వరకు స్మూత్ గా ఉంచడమే కాకుండా.. పోలికల్స్ పోషణ అందిచడానికి శీకకాయ హెయిర్ ఆయిల్ ఎక్కువగా ఉపయోగపడుతుంది. తేనెతో శీకకాయను కలిపి తీసుకుంటే జుట్టు మెరవడంతోపాటు మృదువుగా ఉంటుంది. అలాగే మూలాలను సరిచేస్తుంది.

Also Read:

వేసవిలో చెరకు రసంతో సేదతీరండిలా..! ఆరోగ్యపరంగా మహిళలకు చాలా బెన్‌ఫిట్స్.. తెలుసుకోండిలా..

Bridal Makeup Tips : వివాహం సమయంలో పెళ్ళి కూతురు ఈ మేకప్ టిప్స్ పాటిస్తే ముఖం చంద్రబింబమే