వేసవిలో చెరకు రసంతో సేదతీరండిలా..! ఆరోగ్యపరంగా మహిళలకు చాలా బెన్‌ఫిట్స్.. తెలుసుకోండిలా..
SUGARCANE JUICE : వేసవి కాలం మిట్ట మధ్యాహ్నం చెరుకురసం తాగటం అనేది అందరికి ఇష్టం. ఎందుకంటే చెరుకు రసం రుచి చాలా బావుంటుంది. అంతేకాదు.. ఈ జ్యూస్ తాగడం వల్ల చాలా సమస్యలు దూరమవుతాయి.
Updated on: Mar 12, 2021 | 7:20 PM

చెరకు రసం సంతానోత్పత్తికి మంచిగా పని చేసే బూస్టర్. అలాగే కొత్తగా తల్లి ఐన వాళ్లలో పాల ఉత్పత్తిని అలాగే స్పెర్మ్ యొక్క నాణ్యతని మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది.

మహిళలు పీరియడ్స్‌లో వచ్చే నొప్పికి మందుగా చెరకు రసాన్ని వాడొచ్చు. ఇందుకోసం మీకు పీరియడ్ వచ్చే కొన్ని రోజుల ముందు తాగితే మీకు ఆ సమయంలో నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.

చెరకు రసాన్ని మీరు వారంలో మూడు సార్లు తీసుకుంటే చాల మంచిది. ఎందుకంటే ఇది సహజ డిటాక్స్‌గా ఉపయోగపడుతుంది. ఇది సహజ శీతలకరణి. కాకుంటే చాల మంది ఎండాకాలం లో నే చెరకు రసం తాగడానికి ఇష్టపడతారు.

ఎంతో మంది మెల్లగా దీన్ని ఆస్వాదిస్తూ తాగుతారు. మీరు ఎండాకాలంలో బయటికి వెళ్ళినపుడు కానీ డీహైడ్రేషన్ కలిగిన లేదా కొంచెం అలసట అనిపించినా ఒక పెద్ద గ్లాసు చెరకు రసం తాగండి. మీకు చాలా ఉపశమనం కలుగుతుంది.

ఇది డ్యూరెటిక్ వలే పని చేస్తుంది , మీ బాడీలో ఉబ్బరాన్ని, అలసటను తొలగిస్తుంది. అలాగే మీ మూత్రపిండాలు సరిగా, కరెక్టు గా పనిచేయడానికి సహాయపడ్తుంది.





























