Jaggery Milk: బెల్లం కలిపిన పాలతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు.. తెలుసుకోకపోతే మీకే నష్టం..
Jaggery mixed Milk benefits: రోజూ ఒక గ్లాసు పాలు తాగితే ఎంతో మంచిదనే విషయం మనందరికీ తెలుసు. అదే బెల్లం కలిపిన పాలు తాగితే.. మన శరీరానికి కావాల్సిన అన్ని పోషకాలు ఇట్టే లభిస్తాయని..
Updated on: Mar 12, 2021 | 9:59 PM

Jaggery mixed Milk benefits: రోజూ ఒక గ్లాసు పాలు తాగితే ఎంతో మంచిదనే విషయం మనందరికీ తెలుసు. అదే బెల్లం కలిపిన పాలు తాగితే.. మన శరీరానికి కావాల్సిన అన్ని పోషకాలు ఇట్టే లభిస్తాయని.. ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. ఆ ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకోండి..

పాలు, బెల్లంలో ఎన్నో పోషకాలు ఉన్నాయి.. కాల్షియం, భాస్వరం, ఐరన్, పొటాషియం, జింక్, ప్రోటీన్స్, విటమిన్ బి వంటి పోషకాలు ఉన్నాయి. కావున ఈరెండింటి మిక్స్ చేసి తాగితే శరీరానికి మంచి ప్రయోజనం చేకూరుతుందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.

బెల్లం కలిపిన పాలు తాగడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. పాలలో కాల్షియం ఎక్కువగా కావున.. దానిలో బెల్లం కలిపితే ఆ పోషకాలు మరింత ఎక్కువ అవుతాయి. ఇవి బ్యాక్టీరియాతో పోరాడేందుకు, రోగనిరోధక శక్తిని పెంచి ధృఢంగా తయారుచేసేందుకు ఉపయోగపడుతుంది.

బెల్లంపాల వల్ల అజీర్తి సమస్యలు తగ్గిపోతాయి. చాలామంది అజీర్తీ, గ్యాస్ట్రిక్, మలబద్ధకం, తదితర ఉదర సమస్యలతో బాధపడుతుంటారు. ప్రతిరోజూ బెల్లం కలిపిన పాలు ఒక గ్లాస్ తాగితే ఈ సమస్య తగ్గుతుందని నిపుణులు పేర్కొంటున్నారు.

స్త్రీల గర్భధారణ సమయంలో రక్తహీనతను తగ్గించడానికి బెల్లం కలిపిన పాలు బాగా సహకరిస్తుంది. దీంతోపాటు జాయింట్ పెయిన్ తగ్గేందుకు, బరువును అదుపులో ఉంచుకునేందుకు దివ్యఔషధంలా ఈ ద్రావణం పనిచేస్తుంది.




