Cause of Concern : నైట్ షిఫ్టుల్లో పనిచేసే మగవారికంటే ఆడవారికే ప్రమాదమా..! మహిళలకు ఈ వ్యాధి తప్పదా?
ప్రస్తుత మనిషి జీవన విధానంలో ఎన్నో మార్పువచ్చాయి. రోజు రోజుకీ పెరుగుతున్న ఖర్చులు.. తగ్గుతున్న రాబడి. ఇంటి బాధ్యతలు, అనారోగ్యం పిల్లల చదువులు అంటూ భార్య భర్తలు...
Cause of Concern : ప్రస్తుత మనిషి జీవన విధానంలో ఎన్నో మార్పువచ్చాయి. రోజు రోజుకీ పెరుగుతున్న ఖర్చులు.. తగ్గుతున్న రాబడి. ఇంటి బాధ్యతలు, అనారోగ్యం పిల్లల చదువులు అంటూ భార్య భర్తలు ఉద్యోగాలు చేయాల్సిన పరిస్థితితులు ఏర్పడ్డాయి.
దీంతో ప్రస్తుతం మగవారితో పాటు మహిళలు కూడా జాబ్ చేస్తేనే ఇల్లు గడుస్తుంది. కాకపోతే వారు పనిచేసే వేళలు కూడా ముఖ్యమే. ఎందుకంటే.. ఆఫీసుల్లో పగటిపూట పనిచేసేవారితో పోలిస్తే.. నైట్ షిఫ్టులలో పనిచేసే వారికి ఆరోగ్య సమస్యలు ఎక్కువ. పైగా లైట్ల మధ్య పనిచేస్తే మరికొన్ని అదనపు సమస్యలూ తప్పవు.
ఎందుకంటే.. ఈ ఆర్టిఫిషియల్ లైటింగ్ వల్ల కణుతుల వృద్ధి ఆగిపోయే ప్రమాదముంది. ఇక పొగతాగేవారు, మెనోపాజ్ కు దగ్గరగా ఉన్నవారు, లైట్లమధ్య పనిచేసేవారికి మరో ప్రమాదం పొంచి ఉంది. అదే ప్రపంచాన్ని కుదిపేస్తున్న బ్రెస్ట్ క్యాన్సర్. ఈ విషయం హార్వర్డ్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్లు జరిపిన పరిశోధనలో బయటపడింది. నిజానికి బ్రెస్ట్ క్యాన్సర్ కణుతులు డెవలప్ అవ్వకుండా మైండ్ రిలీజ్ చేసే మెలటోనిన్ అనే హార్మోన్ పనిచేస్తుంది. కాని ఆర్టిఫిషియల్ లైటింగ్ వల్ల దీని పనితీరు తగ్గిపోతుంది. దానివల్ల నిద్ర ఉండదు. యాక్టివ్ గా ఉండలేరు. ఈ పరిశోధనను లక్షా పదివేల మంది మహిళలపై నిర్వహించారు. ఆ వివరాలను ఎన్విరాన్ మెంటల్ హెల్త్ పర్‌స్పెక్టివ్స్ జర్నల్ లో పబ్లిష్ కూడా చేశారు.
ఓ వైపు కొంతమంది మహిళలు రాత్రి జాబ్ చేసినా ఇంటికి వచ్చిన తర్వాత విశ్రాంతి తీసుకునే సమయం తక్కువని ఇంటి పని చేసుకోవాల్సి వస్తుంది. దీంతో రాత్రి వేళల్లో ఉద్యోగం నిర్వహించే మగవారి కంటే మహిళ్లలే ఎక్కువగా అనారోగ్యానికి గురవవుతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఆరోగ్య నిపుణులు
Also Read: