Bridal Makeup Tips : వివాహం సమయంలో పెళ్ళి కూతురు ఈ మేకప్ టిప్స్ పాటిస్తే ముఖం చంద్రబింబమే

మే నెల వస్తుంది.. ఇక పెళ్లిళ్ల సందడి మొదలు కానుంది. అయితే పెళ్లి కూతురు మేకప్ లో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది.. ఎందుకంటే అసలే వేసవి కాలం.. ఎంత ఏసీ ఫంక్షన్...

Bridal Makeup Tips : వివాహం సమయంలో పెళ్ళి కూతురు ఈ మేకప్ టిప్స్ పాటిస్తే ముఖం చంద్రబింబమే
Bridal Makeup Tips
Follow us
Surya Kala

|

Updated on: Mar 12, 2021 | 7:02 PM

Bridal Makeup Tips : మే నెల వస్తుంది.. ఇక పెళ్లిళ్ల సందడి మొదలు కానుంది. అయితే పెళ్లి కూతురు మేకప్ లో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది.. ఎందుకంటే అసలే వేసవి కాలం.. ఎంత ఏసీ ఫంక్షన్ హాల్ తీసుకున్నా సరే మేకప్ చెమటకు చెదిరితే అందం పోతుంది. ఇక జీవితాంతం మధుర జ్ఞాపకాలుగా దాచుకునే ఫొటోలో కూడా పెళ్లికూతురు అందంగా కనిపించదు. అందుకని పెళ్లి రోజున పెళ్లికూతురు ఎలా మేకప్ వేసుకోవాలి.. ఎన్ని రోజుల ముందు నుంచి రెడీ అవ్వాలి తెలుసుకుందాం..!

పెళ్లి కూతురు సరాసరి పెళ్లి రోజున మేకప్ వేసుకోవద్దు.. ఎందుకంటే అది మీ ముఖానికి సూట్ కాకపోతే ఉన్న అందం పోయి సరికొత్త లుక్ తెస్తుంది. కనుక పెళ్లి కూతురు ఒక నెల ముందు నుంచి మేకప్ కోసం సిద్దపడుతుండాలి. అప్పుడు తన ఫేస్ కు స్కిన్ టోన్ కి సరిపోయే మేకప్ తెలుస్తుంది. పెళ్లి రోజున పెళ్లి కూతురుగా సరికొత్త లుక్ తీసుకొస్తుంది.

మేకప్ ట్రయిల్ వేసే ముందు మీ చర్మం ఏ రకమో తెలుసుకోవడం ఉత్తమం. పొడి చర్మం గలవారైతే.. తేమనిచ్చే మేకప్ ను వాడాల్సి ఉంటుంది. మేకప్ ను వేసుకున్న వారు ఎట్టి పరిస్థితుల్లోనూ రాత్రి మేకప్ రిమూవ్ చేసి నిద్రపోవాలి.. మేకప్‌ రిమూవర్‌ని మాత్రమే ఉపయోగించాలి. తర్వాత ఫేస్‌వాష్‌తో ముఖాన్ని కడిగి, మాయిశ్చరైజర్‌ రాసుకోవాలి. లేదా ముఖానికి పచ్చి పాలు రాసుకుంటే.. ముఖం మంచి గ్లో సంతరించుకుంటుంది. పెళ్లి పనుల్లో కాబోయే పెళ్లి కూతురు ఎంత బిజీగా ఉన్నాసరే మేకప్ తీసేసి నిద్రపోవాల్సిందే.. లేదంటే ఫేస్ ముదురుగా కనిపించే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకని మీరు ఎంత అలసిపోయినా మేకప్ వేసుకుని నిద్ర పోవద్దు.. ఎవరు ఏమి చెప్పినా మేకప్ విషయంలో మీకు సౌకర్యవంతమైనది ఎంచుకోవాలి.. ఖరీదు ఎక్కువ అంటూ మీ ఫేస్ కు లుక్ తీసుకుని రానిదానిని వేసుకోవద్దు. పెళ్లి సమయంలో పెళ్లి కూతురు చర్మం మిలమిలా మెరవాలంటే నెల రోజుల ముందు నుండీ ప్రతి రోజూ సాయంత్రం క్లెన్సింగ్, టోనింగ్, మాయిశ్చరైజింగ్ వంటివి చేస్తుండాలి. అలాగే ప్రతి రెండు రోజులకోసారి లేదా వారానికి రెండు సార్లు వాడాలి..

అన్నింటికంటే ముందు మనసు ప్రశాంతంగా ఉంచుకుని.. పోషకాలు కలిగిన ఆహారాన్ని తినాలి.. మంచి నిద్రపోవాలి.. అప్పుడు పెళ్లి కూతురు సహజంగానే అందంగా ఉంటుంది. అప్పుడు ఆ అందానికి మెరుగులు దిద్దితే మరింత అందం సంతరించుకుంటుంది బుట్టబొమ్మ

Also Read ;

ఫిల్మ్ ఇండస్ట్రీ లో ఎన్నో రికార్డ్స్ మెగాస్టార్ చిరంజీవి సొంతం.. అవి ఏమిటో తెలుసా..!

తిరుపతి ఉప ఎన్నిక.. వెనక్కి తగ్గిన జనసేన.. బరిలో బీజేపీ అభ్యర్థి..