Setu Bandhasarvangasan : వెన్నె, కీళ్ల నొప్పులా, నిద్ర సరిగ్గా పట్టడంలేదా.. అయితే ఈ యోగాసనాన్ని ఒక్కసారి ట్రై చేస్తే సరి

ప్రస్తుతం మానవజీవితం అత్యంత ఒత్తిడితో సాగుతుంది. శారీరక శ్రమ తక్కువగా ఉండడంతో చిన్న వయసులోనే ఈజీగా వ్యాధుల బారిన పడుతున్నారు. అయితే యోగా, వ్యాయామం ...

Setu Bandhasarvangasan : వెన్నె, కీళ్ల నొప్పులా, నిద్ర సరిగ్గా పట్టడంలేదా.. అయితే ఈ యోగాసనాన్ని ఒక్కసారి ట్రై చేస్తే సరి
Setu Bandhasanam
Follow us
Surya Kala

|

Updated on: Mar 12, 2021 | 12:28 PM

Benefits of Setu Bandha Sarvangasan : ప్రస్తుతం మానవజీవితం అత్యంత ఒత్తిడితో సాగుతుంది. శారీరక శ్రమ తక్కువగా ఉండడంతో చిన్న వయసులోనే ఈజీగా వ్యాధుల బారిన పడుతున్నారు. అయితే యోగా, వ్యాయామం మానసిక, శారీరక ప్రశాంతతను ఇస్తుంది. ఇక యోగ విద్య నభ్యసించుటకు వయో పరిమితి లేదు. ఏ వయస్సు వారైనా యోగ విద్య నభ్యసించ వచ్చును. స్త్రీ, పురుషులు అనే బేధం కూడా లేదు.. కనుక చిన్నచిన్న వ్యాధికారాలను యోగాసనాల ద్వారా తగ్గించుకోవచ్చు.. ఈరోజు మానసిక ఒత్తిడిని తగ్గింది నిద్రపట్టేందుకు వేసే సేతు బంధ సర్వాంగాసనం ఎలా వేయాలో తెలుసుకుందాం..!

ఆసనం వేయు పద్దతి:

!. నేలపై వెల్లకిలా పడుకోవాలి. 2. మోకాళ్లను వంచాలి. పాదాలు నేలపై ఆనించాలి. చేతులు రిలాక్స్‌డ్‌గా నేలను ఆనుకొని ఉండాలి. 3. ఇప్పుడు గట్టిగా శ్వాస పీల్చి వీపు భాగాన్ని పైకి లేపాలి. శరీర బరువు మొత్తం పాదాలు, భుజాలపై ఉండాలి. 4. చేతులు రెండింటిని ఒకదానితో ఒకటి పట్టుకోవాలి. ఎంతసేపు వీలైతే అంత సేపు ఈ భంగిమలో ఉండాలి. శ్వాసను నెమ్మదిగా వదలడం, తీసుకోవడం చేస్తుండాలి. 5. తరువాత నెమ్మదిగా సాధారణ స్థితిలోకి రావాలి.

ఉపయోగాలు :

ఈ ఆసనం వల్ల వెన్నెముక బలోపేతం అవుతుంది. శ్వాసకోశాల పనితీరు పెరుగుతుంది. కీళ్లలో ఉండే సైనోవియల్ అనే ద్రవం జాయింట్లకు తాజా ఆక్సిజన్ ను, పోషకాలను అందిస్తుంది. కీళ్ల సమస్యలను తగ్గిస్తుంది. నిద్రలేమి సమస్య ఉన్నవారికి ఈ ఆసనం మంచిది . ఒత్తిడి , ఆందోళనను తగ్గించి నిద్ర పట్టడానికి ఈ సేతు బంధ సర్వాంగాసనం సహాయపడుతుంది.

Also Read:

ప్రమాదకర పరిస్థితుల్లో ఉభయ గోదావరి జిల్లాలు, పంటలకు నీటి కోసం ఆందోళన బాటపట్టాల్సిన దుస్థితి