ఘనంగా ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ ప్రారంభం.. గాంధీజీ సత్యాగ్రహ స్ఫూర్తితోనే తెలంగాణ ఉద్యమం -సీఎం కేసీఆర్‌

భారత్‌కు స్వాతంత్ర్యం సిద్దించి 75 వసం‌తాలు. ఈ సంద‌ర్భంగా దేశ‌వ్యా‌ప్తంగా ఆజాద్‌ కా అమృత్‌ మహో‌త్సవ్‌ వేడు‌కలు ఘ‌నంగా ప్రారంభ‌మ‌య్యాయి. ప్రధాని మోదీ సూచన మేరకు వివిధ రాష్ట్రాల్లో..

ఘనంగా ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ ప్రారంభం.. గాంధీజీ సత్యాగ్రహ స్ఫూర్తితోనే తెలంగాణ ఉద్యమం -సీఎం కేసీఆర్‌
Kcr Flaghost
Follow us
K Sammaiah

|

Updated on: Mar 12, 2021 | 12:12 PM

భారత్‌కు స్వాతంత్ర్యం సిద్దించి 75 వసం‌తాలు. ఈ సంద‌ర్భంగా దేశ‌వ్యా‌ప్తంగా ఆజాద్‌ కా అమృత్‌ మహో‌త్సవ్‌ వేడు‌కలు ఘ‌నంగా ప్రారంభ‌మ‌య్యాయి. ప్రధాని మోదీ సూచన మేరకు వివిధ రాష్ట్రాల్లో అమృత్‌ మహోత్సవ్‌ వేడుకలు నిర్వహిస్తున్నారు. తెలం‌గా‌ణ రాష్ర్ట ప్ర‌భుత్వం ప‌బ్లిక్ గార్డెన్స్‌లో వేడుకలనుఉ ఘనంగా నిర్వ‌హించింది. ఈ వేడుక‌ల్లో ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్‌రావు పాల్గొని జాతీయ జెండాను ఆవిష్క‌రించారు. స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, ప‌లువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్ర‌భుత్వ ఉన్న‌తాధికారులు పాల్గొన్నారు.

దేశవ్యాప్తంగా అమృత్‌ మహోత్సవ్‌ వేడుకలు 75 వారా‌ల‌పాటు ఈ ఉత్స‌వాలు కొన‌సాగ‌నున్నాయి. గవ‌ర్నర్‌ తమి‌ళిసై సౌంద‌ర్‌‌రా‌జన్‌ వరం‌గ‌ల్‌లో జాతీయ జెండాను ఆవి‌ష్క‌రించి ఉత్స‌వా‌లను ప్రారం‌భించారు. గురు‌వారం బీఆర్కే భవ‌న్‌తోపాటు ప్రభుత్వ భవ‌నాలు, జంక్షన్లను విద్యుత్తు దీపాలతో అలంకరించారు. పబ్లిక్‌ గార్డెన్స్ లో పోలీసుల గౌరవందనం స్వీకరించిన కేసీఆర్.. తివ్రర్ణ పతకాన్ని ఆవిష్కరించారు. 2022 ఆగస్టు 15 వరకు ఆజాదీకా అమృత్‌ మహోత్సవాలు జరగనున్నాయి.

ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. స్వాతంత్ర్యం సిద్ధించి 75 ఏళ్లు గడుస్తున్న సందర్భంగా సంబరాలకు భారతప్రభుత్వం ఇవాళే శ్రీకారం చుట్టిందన్నారు. ప్రపంచ పోరాటాల చరిత్రలోనే మహోజ్వల ఘట్టం. స్వతంత్ర చరిత్రను మహాత్ముని ముందు… తర్వాతగా చూడాలి. ఆయనకంటే ముందు కూడా స్వతంత్ర్య చరిత్ర ఉంది. కానీ ఆయన తర్వాత అద్భుత ఘట్టాలు ఆవిష్కరించబడ్డాయన్నారు. చాలా సందర్భాల్లో సంశయాలు ఉండేవి. చాలా మందిలో అనుమానాలు నెలకొన్నాయి. అహింశాయుతమైన పంథాలో ప్రజలు ఉద్యమించాలన్నదే ఆయన అభిలాష. ఆయన ఆచరించిన పద్దుతులు కొంతమంది ఉద్రేకపరులను నిరాశపరిచింది వాస్తమేనన్నారు.

గాంధీజీ చేపట్టిన అహింసాయుత మార్గంలోనే దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. మానవహక్కుల నేత మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్‌కు స్ఫూర్తి ఆయన. 1930 ప్రాంతంలో మార్చ్ 12న దండి అనే గ్రామంలో ఉప్పు సత్యాగ్రహం ప్రారంభించారు. దండి మార్చ్ స్ఫూర్తితోనే అమృతోత్సవాలను ప్రారంభించాలని భావించారు. అందుకే ఈ రోజున ప్రారంభించారు. స్వాతంత్ర్య ఉద్యమ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. యాత్ర పరిపూర్ణయం అయ్యే సమయంలో.. 60- 70వేల మంది ఘనమైన స్వాగతం ఇచ్చారు. పిడికెడు ఉప్పును చేతపట్టి.. ఇదే బ్రిటీష్ సామ్రాజ్యవాదుల పునాదులను కదిలిస్తుందన్నారు. ఆరోజున హైదరాబాద్ ముద్దుబిడ్డ సరోజినీ నాయుడు ఉన్నారుని సీఎం కేసీఆర్‌ గుర్తు చేశారు.

శాసనోల్లంఘన ఉద్యమానికి, సంపూర్ణ స్వాతంత్రోద్యమానికి పిలుపునిచ్చారు. దండిగ్రామంలో గాంధీజీ సింహంలా గర్జించారు. దేశం నలుమూలలా.. దావానంలా వ్యాపించింది. ఆనాడు గాంధీజీ అద్భుతమైన ఉద్యమ వ్యూహ రచన చేశారు. 20 ఏళ్ల క్రితం తెలంగాణ ఉద్యమ సమయంలోనూ నా సహచరులతో గాంధీజీ వ్యూహ రచననే స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించాను. అహింసాయుతంగా … గాంధీ మార్గంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని సీఎం కేసీఆర్‌ వివరించారు. గాంధీజీ చూపిన మార్గమే తెలంగాణను సాధించిపెట్టిందని చెప్పారు.

రూ. 25 కోట్లు కేటాయింపు రాష్ట్రంలో  75 వారాల పాటు అమృత్ మ‌హోత్స‌వ్ వేడుక‌ల‌ను నిర్వ‌హిస్తున్నామ‌ని సీఎం తెలిపారు. ప్ర‌భుత్వ స‌ల‌హాదారుగా కొన‌సాగుతున్న ర‌మ‌ణాచారి ఈ క‌మిటీ అధ్య‌క్షులుగా నియ‌మించుకుని ముందుకు కొన‌సాగుతున్నామ‌ని తెలిపారు. ఈ వేడుక‌ల కోసం రూ. 25 కోట్లు కేటాయించామ‌ని చెప్పారు. న‌వీన త‌రం వారికి స్వాతంత్ర్య పోరాటాన్ని తెలియ‌జేసేందుకు ర‌మ‌ణాచారి ఆధ్వ‌ర్యంలో కార్య‌క్ర‌మాల‌కు రూప‌క‌ల్ప‌న జ‌రుగుతుంద‌న్నారు. అన్ని విద్యాసంస్థ‌ల్లో వ‌కృత్వ‌, వ్యాస‌ర‌చ‌న పోటీలు నిర్వ‌హిస్తార‌ని పేర్కొన్నారు. ర‌చ‌యిత‌లు, కవుల‌తో క‌వి స‌మ్మేళ‌నాలు నిర్వ‌హించ‌డంతో పాటు సాంస్కృతిక ప్ర‌ద‌ర్శ‌న‌లు నిర్వ‌హించేలా కార్య‌క్ర‌మాలు ఉంటాయ‌న్నారు.

గ‌వ‌ర్న‌ర్‌కు ధ‌న్య‌వాదాలు ఆజాదీ కా అమృత్ మ‌హోత్స‌వ్ వేడుక‌ల‌ను వ‌రంగ‌ల్‌లో ప్రారంభించిన గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర్ రాజ‌న్‌కు సీఎం కేసీఆర్ ధ‌న్య‌వాదాలు తెలిపారు. ఈ ఉత్స‌వ వేడుక‌ల్లో ప్ర‌జాప్ర‌తినిధులు, ప్ర‌భుత్వ అధికారులతో పాటు ప్ర‌తి ఒక్క‌రూ పాల్గొనాల‌ని పిలుపునిచ్చారు. కార్య‌క్ర‌మాల వివ‌రాల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు మీడియా ద్వారా ప్ర‌జ‌ల‌కు తెలియ‌జేస్తామని సీఎం కేసీఆర్ చెప్పారు

Read More:

వాటిని అమలు చేస్తే విశాఖ స్టీల్‌కు మళ్లీ పూర్వవైభవం.. ప్రధాని మోదీకి లేఖలో వివరించిన సీబీఐ మాజీ జేడీ

మహాశివరాత్రి రోజున రేవ్‌పార్టీ కలకలం.. పోలీసుల అదుపులో 80 మంది యువతీ యువకులు

నేటితో ప్రచారానికి తెర.. ఎల్లుండి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌.. ఆఖరు రోజున అభ్యర్థుల విస్తృత ప్రచారం

మూడు గంటలపాటు పోలీసులను ముప్పు తిప్పలు పెట్టిన మందుబాబు
మూడు గంటలపాటు పోలీసులను ముప్పు తిప్పలు పెట్టిన మందుబాబు
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..