వాటిని అమలు చేస్తే విశాఖ స్టీల్‌కు మళ్లీ పూర్వవైభవం.. ప్రధాని మోదీకి లేఖలో వివరించిన సీబీఐ మాజీ జేడీ
విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేటీకరించాలనే కేంద్ర ప్రభుత్వం నిర్ణయంపై అన్ని వర్గాల నంచి వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఇప్పటికే ఉక్కు కార్మికులు ఉద్యమాన్ని తీవ్రతరం..
విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేటీకరించాలనే కేంద్ర ప్రభుత్వం నిర్ణయంపై అన్ని వర్గాల నంచి వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఇప్పటికే ఉక్కు కార్మికులు ఉద్యమాన్ని తీవ్రతరం చేశారు. పార్టీలకతీతంగా కార్మికుల ఉద్యమానికి మద్దతు తెలుపుతున్నారు. ఇటీవల నిర్వహించిన రాష్ట్ర బంద్ సక్సెస్ కావడంతో కార్మికులు తమ ఉద్యమాన్ని మరింత ఉదృతం చేశారు. ప్రత్యక్షంగా వేలాది మంది, పరోక్షంగా లక్షలాది మంది జీవితాలతో ముడిపడి ఉన్న స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేటుపరం చేయాలనే నిర్ణయంపై నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. కేంద్ర తక్షణమే తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వీవీ లక్ష్మీనారాయణ కేంద్రానికి లేఖ రాశారు.
దేశంలో ఏ స్టీల్ ప్లాంట్‌కు లేని ప్రత్యేకత విశాఖ స్టీల్ ప్లాంట్‌కు ఉందని లక్ష్మీనారాయణ అన్నారు. సముద్రతీరంలో ఉన్న ఏకైక స్టీల్ ప్లాంట్ విశాఖే అని ఆయన తెలిపారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. ఎగుమతి, దిగుమతులకు అత్యంత అనుకూలమైన ప్రాంతం ఇదేనన్నారు. స్లీట్ ప్లాంట్‌పై ప్రధాని మోదీకి లేఖ రాశామన్నారు. కొన్ని ప్రధానమైన సూచనలు చేశామని.. వాటిని అమలు చేస్తే మళ్లీ పూర్వవైభవం తీసుకురావచ్చని తెలిపారు. రానున్న కాలంలో స్టీల్‌కు డిమాండ్ పెరగనుందని.. మొన్నటి బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్థికమంత్రి సీతారామన్ ఈ విషయాన్ని స్పష్టం చేశారన్నారు.
ప్రపంచ స్టీల్ ఉత్పత్తిలో దేశానిది రెండో స్థానమన్న ఆయన.. స్టీల్ పరిశ్రమలను ప్రయివేటీకరిస్తే… సిమెంట్ పరిశ్రమలకు పట్టిన గతే పడుతుందన్నారు. ధరలన్నీ కంపెనీ వాళ్ల చేతుల్లో ఉంటాయని హెచ్చరించారు. రేపటి రోజున స్టీల్ కొనడం కష్టంగా మారుతుందన్నారు. సర్దార్ పటేల్ విగ్రమానికి 3200 టన్నులు, అటల్ టన్నెల్ కోసం 2200 టన్నులను విశాఖ నుంచే పంపారన్నారు. మిగిలిన స్టీల్ కంటే ఇది నాణ్యమైనదని తెలిపారు. స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్లలో భాక్రానంగల్, హీరాకుడ్, నాగార్జున సాగర్‌తో వ్యవసాయరంగం అభివృద్ధి అయ్యేలా చేశారని, అలాగే బిలాయ్ లాంటి ఉక్కు పరిశ్రమలతో పారిశ్రామిక రంగానికి ఊతమిచ్చారని వివరించారు.
అయితే 1990ల నుంచి కేంద్ర సంస్థల నుంచి పెట్టుబడుల ఉపసంహరణ జరుగుతూ వస్తోంది. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను అన్నిటితో పాటు చూడకుండా… కొన్ని చర్యలతో మళ్లీ గాడిన పెట్టొచ్చన్నారు. కొన్ని సూచనలు చేయడానికే తాము ముందుకు వచ్చామని లక్ష్మినారాయణ తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ వెనక అనేకమంది ప్రాణత్యాగాలున్నాయన్నారు. తమ చిన్నప్పుడు విశాఖ పోరాటం గురించి చర్చించుకుంటుంటే విన్నామని తెలిపారు.
విశాఖ ఉక్కు.. ఆంధ్రుల గుండె చప్పుడన్నారు లక్ష్మినారాయణ. టీమ్ ఇండియా క్రికెట్‌లో గెలిస్తే దేశం గెలిచిందని సంబురాలు చేసుకుంటామని.. అలాగే స్టీల్ కేంద్రం చేతుల్లో ఉంటే మనందరికీ గర్వకారణమన్నారు. ప్రైవేటుపరం చేస్తే ఇంతకంటే ప్రజాద్రోమం మరొకటి ఉండదన్నారు. ఇప్పటికైనా కేంద్రం తన నిర్ణయన్ని మార్చుకోవాలని కోరారు. లక్షలాది మంది జీవితాలతో మడిపడి ఉన్న స్టీల్ ఫ్యాక్టరీ ప్రభుత్వం చేతిలో ఉండడమే సబబన్నారు.
Read More:
మహాశివరాత్రి రోజున రేవ్‌పార్టీ కలకలం.. పోలీసుల అదుపులో 80 మంది యువతీ యువకులు
నా కాళ్లు పట్టుకుంటేనే వైసీపీలో చేరాను.. మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ రఘురామా మధ్య సవాళ్ల సీక్వెల్..