మహాశివరాత్రి రోజున రేవ్‌పార్టీ కలకలం.. పోలీసుల అదుపులో 80 మంది యువతీ యువకులు

మహాశివరాత్రి రోజున ఎవరైనా రాత్రంతా శివనామ జపం చేస్తూ రాత్రంతా నిద్రపోకుండా జాగారం చేస్తారు. కానీ ఇక్కడ వీరు జాగారమైతే చేశారు.. కానీ శివనామం బదులు డీజే సాంగులు..

మహాశివరాత్రి రోజున రేవ్‌పార్టీ కలకలం.. పోలీసుల అదుపులో 80 మంది యువతీ యువకులు
Follow us

|

Updated on: Mar 12, 2021 | 11:27 AM

మహాశివరాత్రి రోజున ఎవరైనా రాత్రంతా శివనామ జపం చేస్తూ రాత్రంతా నిద్రపోకుండా జాగారం చేస్తారు. కానీ ఇక్కడ వీరు జాగారమైతే చేశారు.. కానీ శివనామం బదులు డీజే సాంగులు హోరెత్తించారు. మహాశివరాత్రి రోజున రేవ్‌ పార్టీతో ఎంజాయ్‌ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని సంస్థాన్‌ నారాయణపురం మండల కేంద్రంలో రేవ్‌ పార్టీ కలకలం సృష్టించింది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో పార్టీని రాచకొండ పోలీసులు భగ్నం చేశారు.

నారాయణపురం శివార్లలోని ఓ వ్యవసాయ బావివద్ద సంబంధిత రైతు కుమారుడు గురువారం రాత్రి రేవ్‌పార్టీ ఏర్పాటు చేశాడు. రాత్రంతా ఆ ప్రాంతం మ్యూజిక్‌తో హోరెత్తడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఉదయం 4 గంటల ప్రాంతంలో ఎస్‌వోటీ పోలీసులు రేవ్‌పార్టీపై దాడిచేశారు. ఈ సందర్భంగా 80 మంది యువతీ, యువకులను అరెస్టు చేశారు. మరో 10 మంది యువకులు తప్పించుకున్నట్లు తెలుస్తుంది. తప్పించుకున్న వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

ఘటనా స్థలంలో భారీగా మద్యం బాటిళ్లు లభించాయి. వాటితోపాటు 60 బైకులు, 20 కార్లు, డీజే వాహనాన్ని సీజ్‌ చేశారు. పట్టుబడినవారందరిని స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నారు. వీరంతా హైదరాబాద్‌కు చెందినవారిగా గుర్తించారు. ఎంట్రీఫీజుగా ఒక్కొక్కరివద్ద రూ.500 వసూలు చేసినట్లు తెలుస్తున్నది.

కాగా జక్కిడి ధన్వంతరెడ్డి అనే వ్యక్తికి చెందిన ఫామ్‌హౌస్‌లో రేవ్‌ పార్టీ నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఈ క్రమంలో, డీసీపీ నారాయణరెడ్డి, ఏసీపీ సత్తయ్య, ఎస్‌ఐ సుధాకర్‌ నేతృత్వంలో ఆపరేషన్‌ చేపట్టారు. ఇరవై కార్లు, 60 బైకులను స్వాధీనం చేసుకున్నారు. అలాగే పార్టీలో పాల్గొనడానికి వచ్చిన యువతీ యువకులను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. రేవ్‌పార్టీలో గంజాయి సహా నిషేధిత డ్రగ్స్‌ పట్టుకున్నట్లు సమాచారం. అయితే రేవ్‌పార్టీ నిర్వహించిన ధన్వంతరెడ్డి కుమారుడు శ్రీకాంత్‌ గతంలోనూ రేవ్‌పార్టీలు నిర్వహించి అరెస్ట్‌ అయ్యాడు.

రేవ్‌పార్టీలో అరెస్ట్‌ అయిన వారంతా సాఫ్ట్‌వేర్‌ ఎంప్లాయిస్‌గా గుర్తించారు పోలీసులు. ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పార్టీ అరేంజ్‌ చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. రేవ్‌పార్టీ కోఆర్డినేటర్‌ గిరీష్‌తో కలిసి శ్రీకాంత్‌రెడ్డి రేవ్‌ పార్టీ నిర్వహించారు. పోలీసుల పూర్తిస్థాయి విచారణ అనంతరం ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు మీడియాకు వెల్లడించనున్నారు.

Read More:

తెలంగాణలో ఘనంగా ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌.. జాతీయ జెండాను ఆవిష్కరించనున్న సీఎం కేసీఆర్‌

నేటితో ప్రచారానికి తెర.. ఎల్లుండి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌.. ఆఖరు రోజున అభ్యర్థుల విస్తృత ప్రచారం

నా కాళ్లు పట్టుకుంటేనే వైసీపీలో చేరాను.. మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ రఘురామా మధ్య సవాళ్ల సీక్వెల్‌..

Latest Articles