తెలంగాణలో ఘనంగా ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌.. జాతీయ జెండాను ఆవిష్కరించనున్న సీఎం కేసీఆర్‌

భారత దేశానికి స్వాతంత్ర్యం సిద్దంచి 75 సంవత్సాలు అవుతుంది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరుతో కేంద్ర ప్రభుత్వం సంబరాలు..

తెలంగాణలో ఘనంగా ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌.. జాతీయ జెండాను ఆవిష్కరించనున్న సీఎం కేసీఆర్‌
Follow us

|

Updated on: Mar 12, 2021 | 10:01 AM

భారత దేశానికి స్వాతంత్ర్యం సిద్దంచి 75 సంవత్సాలు అవుతుంది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరుతో కేంద్ర ప్రభుత్వం సంబరాలు నిర్వహిస్తోంది. ఇప్పటికే అన్ని రాష్ట్రాల సీఎంలతో ఈ వేడుకల గురించి ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఈ వేడుకల్లో అందరూ భాగస్వామ్యం కావాలని ప్రధాని మోదీ కోరారు.

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ 2022 ఆగస్టు 15 వరకు 75 వారాల పాటు దేశవ్యాప్తంగా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.. నేటి నుంచి ఆగస్టు 15 2022 వరకు వేడుకలు జరుగుతాయి. ఇవాళ ప్రధాని మోదీ ఆజాదీ కీ అమృత్ మహోత్సవ్ వేడుకలను మోదీ దండియాత్ర ప్రారంభించిన గుజరాత్‌లో ప్రారంభించనున్నారు. అనంతరం అన్ని రాష్ట్రాల్లో ఆయా రాష్ట్రాల సీఎంలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని వేడుకలు నిర్వహిస్తారు.

తెలంగాణలో హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్‌, వరంగల్ పోలీసు గ్రౌండ్‌లో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ప్రారంభ వేడుకలు జరగనున్నాయి. హైదరాబాద్‌లో సీఎం కేసీఆర్, వరంగల్‌లో గవర్నర్ తమిళసై పాల్గొంటారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం పోలీసు మార్చ్ నిర్వహిస్తారు. స్వాతంత్ర పోరాటంలో తెలంగాణ పోషించిన పాత్ర కీలకమైనందని ఇటీవల నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం కేసీఆర్ చెప్పారు.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన అనంతరం స్వయం పాలనలో అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తున్నామని పేర్కొన్నారు. దేశాభివృద్ధిలో తెలంగాణ తన వంతు పాత్ర పోషిస్తోందని తెలిపారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలకు తెలంగాణ ప్రభుత్వం రూ.25 కోట్లు కేటాయించింది. సంజీవయ్య పార్క్‌తో పాటు తెలంగాణలోని 75 ముఖ్యమైన ప్రాంతాల్లో జాతీయ జెండాలను ఎగురవేస్తారు.

ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా వ్యాస రచన పోటీలు, డిబేట్స్, డ్రాయింగ్, కవితల పోటీలు నిర్వహించనున్నారు. ఈ వేడుకలను ఒక పండుగలా నిర్వహించాలని అధికారులను సీఎం కేసీఆర్ ఇప్పటికే ఆదేశించారు.

Read More:

నేటితో ప్రచారానికి తెర.. ఎల్లుండి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌.. ఆఖరు రోజున అభ్యర్థుల విస్తృత ప్రచారం

కాంగ్రెస్‌కు షాక్‌.. షర్మిల చెంతకు ఏపూరి సోమన్న.. తుంగతుర్తి టికెట్‌పై లభించిన హామీ..?

సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
నాకు రూ.164 కోట్ల ఆస్తి ఉంది | మోత మోగిస్తోన్న పుష్ప రాజ్..
నాకు రూ.164 కోట్ల ఆస్తి ఉంది | మోత మోగిస్తోన్న పుష్ప రాజ్..