కాంగ్రెస్‌కు షాక్‌.. షర్మిల చెంతకు ఏపూరి సోమన్న.. తుంగతుర్తి టికెట్‌పై లభించిన హామీ..?

తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తామంటూ వైయస్‌ షర్మిల కొత్త పార్టీ ఏర్పాటులో బిజీ అయ్యారు. వివిధ జిల్లాల వైయస్‌ అభిమానులతో భేటీ అవుతున్నారు. కొత్త పార్టీ విధివిధానాలు, జెండా అజెండా రూపకల్పనపై..

కాంగ్రెస్‌కు షాక్‌.. షర్మిల చెంతకు ఏపూరి సోమన్న.. తుంగతుర్తి టికెట్‌పై లభించిన హామీ..?
Follow us

|

Updated on: Mar 12, 2021 | 9:10 AM

తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తామంటూ వైయస్‌ షర్మిల కొత్త పార్టీ ఏర్పాటులో బిజీ అయ్యారు. వివిధ జిల్లాల వైయస్‌ అభిమానులతో భేటీ అవుతున్నారు. కొత్త పార్టీ విధివిధానాలు, జెండా అజెండా రూపకల్పనపై మేధావులతో మంతనాలు సాగిస్తున్నారు. ఇప్పటికే వివిధ పార్టీల్లో ఉన్న నేతలు వైయస్‌ షర్మిల చెంతకు చేరుతున్నారు. మరికొందరు పార్టీలో చేరనప్పటికీ తమ మద్దతు ప్రకటిస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నేతలు షర్మిలకు మద్ధతు ప్రకటిస్తున్నారు.

ఇటీవల టీపీసీసీ అధికార ప్రతినిధి ఇందిరా శోభన్ కాంగ్రెస్ కు రాజీనామా చేసి షర్మిల వెంట నడుస్తానని ప్రకటించారు. కాంగ్రెస్ లో తగిన గుర్తింపు లభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే తాజాగా కాంగ్రెస్ పార్టీ సాంస్కృతిక విభాగానికి నాయకత్వం వహిస్తున్న ప్రముఖ కళాకారుడు ఏపూరి సోమన్న షర్మిలకు జై కొట్టారు. షర్మిల వెంట నడవనున్నట్లు సోషల్‌ మీడియాలో ప్రకటించారు.

తెలంగాణలో ప్రస్తుత రాజకీయ పరిస్థితి , నా రాజకీయ భవిష్యత్ సంబంధించిన అంశాలను ఆలోచన చేసి , దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారి కూతురు షర్మిల గారితో మాట్లాడి ఆమెకు మద్దతు తెలపాలని నిర్ణయించుకున్నాను. అని సోమన్న తెలిపారు. కాంగ్రెస్ పార్టీని విమర్శించే ఆలోచన తనకు లేదని సోమన్న స్పష్టం చేశారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ నాయకత్వంపై నమ్మకం లేక , సీనియర్లు కూడా వారి భవిష్యత్ పై ఆందోళన చెందుతున్నారన్నారు. ఈ సందర్భంలో తెలంగాణ రాష్ట్రంలో నియంత ప్రభుత్వాన్ని ఎదుర్కోవాలంటే ఈ నిర్ణయం సరైనది అని భావించానని ఆయన వివరించారు.

ఏపూరి సోమన్న ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని తుంగతూర్తి నియోజకవర్గంలోని వెలిశాల గ్రామానికి చెందినవారు. తన ఆటపాటలతో తెలంగాణ ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించారు. తెలంగాణ ఆవిర్భావం అనంతరం ప్రభుత్వం సోమన్నకు సాంస్కృతిక సారధిలో ఉద్యోగావకాశాన్ని కల్పించినా.. కొన్ని రోజులకు ఆ ఉద్యోగాన్ని స్వచ్ఛందంగా వదిలేశారు. ప్రభుత్వంపై తన పాటల ద్వారా పోరాటాన్ని సాగించారు. అనంతరం కొన్ని రోజులకు కాంగ్రెస్ పార్టీలో చేరి గత ఎన్నికల సమయంలో కీలకంగా వ్యవహరించారు. తన సాంస్కృతిక బృందంతో కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేశారు.

టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా సోమన్న నడుచుకున్నారు. ఇటీవల జరిగిన దుబ్బాక ఎన్నికల్లోనూ, రేవంత్ రెడ్డి పాదయాత్ర సమయంలోనూ సోమన్న పాల్గొని తన గళాన్ని వినిపించారు. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాములు నాయక్ ను కాదని ఆయన చెరుకు సుధాకర్ గౌడ్ కు మద్దతు ప్రకటించారు. సుధాకర్ గౌడ్ తరఫున సోమన్న తన ఆట పాటల ద్వారా ప్రచారం నిర్వహిస్తున్నారు. సోమన్న పాటలకు తెలంగాణ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. సొంత నియోజకవర్గం తుంగతూర్తి నుంచి ఆయన టికెట్ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది.

Read More:

నా కాళ్లు పట్టుకుంటేనే వైసీపీలో చేరా.. మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ రఘురామా మధ్య సవాళ్ల సీక్వెల్‌..

భరతమాత విముక్తికి 75 ఏళ్లు.. ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌ను ప్రారంభించననున్న ప్రధాని మోదీ

అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టు పనుల్లో అపశ్రుతి.. పిల్లర్లు కూలి
బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టు పనుల్లో అపశ్రుతి.. పిల్లర్లు కూలి